My written story of Bhagwan & Bhakta
ఒక విశేషమైన భక్తుడు మరియు భగవంతునికి మధ్య జరుగుతున్న సంభాషణ తో కూడిన కథ :-
భక్తుడు :- ఏమయ్యా స్వామీ! నీకిది భావ్యముగా ఉందా? ఎన్ని సంవత్సరాలనుండి నేను నిన్ను కొలుస్తూ వస్తున్నాను, కనీసం 40 సంవత్సరాలు దాటింది. నిన్నే నమ్ముకొని ఉన్నాను. నీ దయ, కరుణ లేదు, నా పై నీ దృష్టి లేదు, నాకు ఒక్క క్షణం గురించి వచ్చి అయినా కనిపించి పోవచ్చు కదా! నా గురించి కూడా కాదు, మిగిలిన నీ భక్తుల నమ్మకం, విశ్వాసం పెంపుదలకు, నేను నీ గురించి గొప్పగా చెప్పుటకు, అర్థం అయ్యిందా స్వామీ ! నేను ఏమి చేయాలో పాలు పోవడం లేదు స్వామీ ! నీవే ఎలాగైనా దర్శన భాగ్యం కల్పించాలి.
భగవంతుడు :- నేను నీకు కనిపించడానికి సిద్ధంగా 40 సంవత్సరాలనుండి ఉన్నాను. కాని నన్ను నువ్వు భగవంతుడివి కావు అని అవమాన పరుస్తావనే సంశయముతో నేను రావడం లేదు. నేను అవమానం ను భరించను.
భక్తుడు :- అటువంటి విధంగా అస్సలు ఉండదు. నేను మీకు హామీ ఇస్తున్నాను.
భగవంతుడు :- నాకు నీ మీద నమ్మకం కలగడం లేదు.
భక్తుడు :- అటువంటి సందేహం వలదు, నన్ను కరుణించి కాపాడు స్వామీ !
భగవంతుడు :- సరే అటులనే, కాని ఒక్కసారి మాత్రమే.
భక్తుడు :- స్వామీ అటులనే, అంతా మీ దయ.
భక్తుడు :- ఏమి స్వామీ ! ఒక సంవత్సరం అయినది రాలేదు, కనిపించి దర్శనం ఇవ్వలేదు. నీ భక్తుడు అగుటకు నాకు అర్హత లేదా?
భగవంతుడు :- అట్లా నీవు ఎందుకు తలంచు చున్నావు. నేను నీ వాడనే. నేను పది నెలల క్రితం గుడి తలుపులు మూసే సమయములో వచ్చి ప్రసాదం అడుగగా లేదని విసుగు, కోపం తో, అజ్ఞానం తో, మూర్ఖత్వం తో తిరస్కరించి పంపినది నీవు కాదా!
భక్తుడు :- అయ్యో అయ్యో ఎంత పని చేసినాను, నేను గుర్తించలేదు. ఈ పాపమునకు నిష్క్రుతి లేదు. ఇక నేను జీవించి ఉండను.
భగవంతుడు :- అట్లు చేయవద్దు. నేను దర్శనము కై వచ్చాను కావున నీవు పుణ్యం చేసినవాడవు, చింత వలదు.
భక్తుడు :- ధన్యవాదములు ఓ దేవ దేవా !
భక్తుడు లేచి చూసిన పిదప కలగా తెలుసుకొని సమయం చూడగా ఉదయం 4.00 గంటలు అయినది. ఇక్కడ భక్తుడు ఆలయ పూజారి అని గమనించగలరు.

Comments
Post a Comment