Posts

Showing posts from 2019

My written story of Bhagwan & Bhakta

ఒక విశేషమైన భక్తుడు మరియు భగవంతునికి మధ్య జరుగుతున్న సంభాషణ తో కూడిన కథ :- భక్తుడు :-  ఏమయ్యా స్వామీ! నీకిది భావ్యముగా ఉందా? ఎన్ని సంవత్సరాలనుండి నేను నిన్ను కొలుస్తూ వస్తున్నాను, కనీసం 40 సంవత్సరాలు దాటింది. నిన్నే నమ్ముకొని ఉన్నాను. నీ దయ, కరుణ  లేదు, నా పై నీ దృష్టి లేదు, నాకు ఒక్క క్షణం గురించి వచ్చి అయినా కనిపించి పోవచ్చు కదా! నా గురించి కూడా కాదు, మిగిలిన నీ భక్తుల నమ్మకం, విశ్వాసం పెంపుదలకు, నేను నీ గురించి గొప్పగా చెప్పుటకు, అర్థం అయ్యిందా స్వామీ ! నేను ఏమి చేయాలో పాలు పోవడం లేదు స్వామీ ! నీవే ఎలాగైనా దర్శన భాగ్యం కల్పించాలి.  భగవంతుడు :- నేను నీకు కనిపించడానికి సిద్ధంగా  40 సంవత్సరాలనుండి ఉన్నాను. కాని నన్ను నువ్వు భగవంతుడివి కావు అని అవమాన పరుస్తావనే సంశయముతో నేను రావడం లేదు. నేను అవమానం ను భరించను. భక్తుడు :- అటువంటి విధంగా అస్సలు ఉండదు. నేను మీకు హామీ ఇస్తున్నాను. భగవంతుడు :- నాకు నీ మీద నమ్మకం కలగడం లేదు. భక్తుడు :- అటువంటి సందేహం వలదు, నన్ను కరుణించి కాపాడు స్వామీ ! భగవంతుడు :- సరే అటులనే, కాని ఒక్కసారి మాత్రమే. భక్తుడు :- స్వామీ అటులనే, అంతా మీ...

God, Godness దేవుడు, దైవం

దైవం అనగా ఏమిటి? అది ఏమి చేయును? ఏమి పని చేయును Functioning?  అతి పెద్ద పదార్థము యొక్క శక్తి స్వరూపము దేవుడు, అతనికి సంభందించిన అన్ని పదార్ధములు, వస్తువులు, విషయాలు దైవం. క్షేత్రం యొక్క పరిధి దైవం. దైవం వలన మానవుడు సత్యం ను తెలుసుకొని ధర్మంనకు అనుగుణంగా నడుచుకోవడం తెలుస్తుంది, అలవాటు అవుతుంది. అట్టి మానవుని గమనము, జీవనం కారణ జన్మకు కారణం అయ్యి తనను తాను తెలుసుకొని మోక్షం, కైవల్యము ప్రాప్తించుటకు, సిద్ధించుటకు దోహద కారి అగును. దైవం ను నమ్మిన వ్యక్తి కష్టాలు పడుతున్నను సుఖం, సంతోషం, తృప్తి, విజయం మొదలగు వానితో వచ్చు  ఆనందం తో కూడిన ప్రశాంత జీవనం కొనసాగించును. కీర్తి పొందును. కాని దైవం నకు వ్యతిరేకంగా ఉన్నవారు క్షణిక సుఖం పొందునట్లు అనుభూతి చెంది భ్రమ ఏర్పడును. తుదకు అన్నీ కోల్పోయి సర్వ నాశనం చెంది దైవం ను ప్రార్ధన చేయు తలంచి, సమయం లేదు అని గ్రహించిన వాడై దేహం వదిలిపెట్టును. అందుకే ముందే స్పృహతో దైవత్వం ను తెలుసుకోని మసలు కొనవలెను, జీవన గమనం చేయవలెను. ఆనందమయ జీవనం కు బాటలు వేసుకోవలెను. 

దుర్గ అమ్మవారి మహిమ తెల్పడం

                     🍃🍂🌹🌹🍂🍃                                                మంచి మాట-మంచి పాట                                                  🍃🍂🌹🌹🍂🍃                                              🌲🌱🌷🌷🌲🌱 మనమే మనమే...  ఎందుకు ఎందుకు...  మనమే  ఎందుకు...   అహంకారం, అజ్ఞానం, అమాయకత్వంతో మనకే తెలుసనుకోవడం ఎందుకు...        తెలుసని డాంభీకాలు, ప్రగల్బములు, వెర్రి మాటలు ఎందులకు...  ఎందులకు...  ఏలయనగా నిన్నే నీవు ఎరుగని నీ జ్ఞానం...  నీకెలా ఏమని తెలుపును మిత్రమా...  ఇకనైనా ఆపేదవా నీ ఉత్తర ప్రగల్బములు......

తుమ్ము యొక్క నా విశ్లేషణ

నేను అడిగిన ప్రశ్నకు నేను ఈ విధముగా logic& reasoning ద్వారా నా విజ్ఞానం మేరకు  జవాబు చెప్పువచ్చు అని ఆలోచన చేయడం జరిగింది. Doctor గారు విశ్లేషణ చేయాలి. మనిషి మూల అంతరాలలో దాగి ఉన్న మంచి, చెడు బ్యాక్టీరియా, వైరస్ మరియు ఇతర వ్యాధికారక క్రిములు మన చుట్టూ ఉన్న వాతావరణం లోని గాలిలో ప్రవేశిస్తాయి. తుమ్ము 100MPH వేగంతో వస్తుందని విన్నాను. దీనిని ఆపే ప్రయత్నం చేయరాదు. అట్టి క్రిములు ఏవైనా chronic, acute, severe problematic diseases ను కల్గించే అవకాశం ఉన్నట్లయితే అట్టి ఉపద్రవం ను కొన్ని నిముషాలు ఆగి వెళ్ళటం వలన అట్టి వ్యాధి కారక క్రిములు మన ఎత్తు  height దాటి పై వాతావరణం లోకి వెళ్ళును, కావున మనకు కలిగే ఇబ్బంది తొలగిపోవును అని నా విశ్లేషణతో కూడిన అభిప్రాయం. యుద్ధాలలో మూర్ఛకు సంభందించిన అస్త్రము లేదా బాంబును ప్రయోగించినపుడు మనము భూమిపై సాష్టాంగ నమస్కారం చేసినట్లు ఉండుట ద్వారా అట్టి ఉపద్రవం నుండి రక్షించుకొనుటలో ఉన్న సూత్రం దీనికి కూడా వర్తిస్తుంది, ఉపయోగపడుతుంది అని నా విశ్లేషణ తో కూడిన భావన వలన కల్గిన అభిప్రాయం. 

Soul applicable theory, ఆత్మ అన్వయ సిద్ధాంతం

ఆత్మ అన్వయ సిద్ధాంతం, అంతరంగముకు  జవాబు దారి, జవాబు ఇచ్చు, జవాబు చెప్పు సిద్ధాంతం. అమ్మవారి తత్వం, ఒకతనికి ఏడుగురు బిడ్డలు అది కథ, ఒకతనికి ఏడుగురు కొడుకులు, ఒకతనికి ముగ్గురు కొడుకులు, ముగ్గురు బిడ్డలు. చెడు దగ్గరికి వెళ్లినా, చెడు తెల్సుకొనిన మంచి ఔన్నత్యము తెల్పుటకు, ప్రదర్షింపజేయుటకు, అది కూడా భగవంతుని అనుగ్రహం ఉంటేనే చేయగలం, చెప్పగలం. ఈ జన్మలో మొగవారు ఆడవారి సమస్త విషయాలు పట్ల అవగాహన కలిగి ఉండాలి, ఆడవారు మొగవారి సమస్త విషయాల పట్ల అవగాహన, ఆలోచన,మనస్సు ఇత్యాది విషయములు తెలుసుకుంటున్నవారు, తెలిసినవారు అయ్యి ఉండాలి అని నా అభిప్రాయం. లేకపోతే దీని గురించి మరియొక జన్మ అవసరం పడుతుంది. అమ్మవారు ప్రకృతి మాత. సకల ప్రదాయిని, సమస్త వాంఛ ఫల సిద్యర్థిని, మోక్ష ప్రదాయిని. ప్రతీ ఆడవారిని ఒకే దృష్టి,సమాన దృష్టి, మంచి మనస్సుతో శుద్ధ భావనతో చూడగల్గడం, అది చాలా కష్టమైన పని, సాధన,ధ్యానము, మెడిటేషన్ ద్వారా సిద్ధిస్తుంది. అప్పుడు నువ్వు అమ్మవారిని తెలుసుకొనుటకు, చూచుటకు మొదటి దశ దాటినట్లు. జై బోలో లాలితాంబ మాతాకీ జై. || నీ దగ్గర ఉన్నదానిని నలుగురితో పంచుకోవడం, ధనము, ధన్యము. పరోపకారాన్ని మించిన హితము ల...

Never neglect your origin, MOTHER.

పెద్ద నగ్న సత్యం, నీ కేంద్రం అనగా మాత, అమ్మ,, తల్లి దానినే అట్టి విషయమునే దైవత్వం గా భావించుము. ప్రథమ దైవం. అట్టి తల్లి ను నువ్వు ఎప్పుడు విమర్శిస్తావో, neglect , విస్మరిస్తావో, అలా ప్రవర్తిస్తావో, నీ పతనం, క్షయం ఆ రోజు నుండి, అప్పటి నుండి ప్రారంభమైనట్లు. నీ ఉనికిని నువ్వు కోల్పోయే దశ, పరిస్థితి వచ్చును. తల్లిదండ్రులు ప్రథమ దేవుళ్ళు మరియు గురువులు. When you neglect, give up, removal of taking care of  your origin i.e. mother you treat it as you finished and you are not a part and physically existing in this physical world. Actually you are a guest wanderer to this physical world inorder to perform Karma based on your previous birth (Janma).

Today onwards my movement is the blessings of divine power.

ఈ రోజు నేను చేసే కర్మ, పని నేను ధర్మమును, సత్యమును అనుసరించి చేస్తే రేపటి రోజు తయారీ ఆ దేవ దేవుడు చేసి మార్గం చూపిస్తాడాని, ఇప్పటి నుండి నా జీవిత చరమాంకం వరకు ఆ పరబ్రహ్మనే త్రోవ చూపిస్తాడని, నా సకల దుఃఖాలు, బాధలు ఇకపై అతనివే అని నేను ప్రఘాడముగా విశ్వసించి ముందుకు గమనం చేయుచున్నాను. నేటి నుండి నేను ఏ కర్మ చేసినా అది ఆ పరబ్రహ్మ ఆదేశానుసారముగా స్వీకరించు చున్నాను. నా ప్రతీ ఆలోచన, ఆచరణకు ఆ పరబ్రహ్మయే మూలం. జై శ్రీగణేషాయనమః! జై శ్రీమన్నారాయనాయ నమః! జై శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పనాయ నమః! జై శ్రీదత్త, గురుదత్తాత్రేయాయ నమః! జై శ్రీ హనుమాన్! జై బోలో భారత్ మాతా కీ జై!

దైవ సాక్షాత్కారం Defining and Proving God, Bhagwan, Parabrahma

దేవున్ని నిరూపించడం. ఇట్టి కార్యం ఈ కలియుగంలో భుజస్కంధాలపై వేసుకోవడం చిన్న పని అగునా అండి. మీరు నేను అందరం ముసుగు వేసుకొని ఉన్నాము ఈ విశాల విశ్వంలో. అయితే చిన్న తేడా మాత్రమే. మీరు వేసుకున్న ముసుగును తీయాలని, తీసివేయాలని ప్రయత్నము చేయడం లేదు, నేను కొంత ప్రయత్నము చేస్తున్నాను, అంతే తేడా, దేవుని పరిధి,ఆవరణ, క్షేత్రములో ముసుగుతో ఉన్నవారికి ప్రవేశం లేదు, ఉండదు. వొజ్జల సిద్ధాంతి, మంథని వాస్తవ్యులు, గొప్పవారు. 10 కోట్ల ప్రవచనాలు1 ఆచరణ ముందు దిగదుడుపు. ఒక ప్రాణం పోతున్నది, నీరు పోయాలి 1 గ్లాసెడు. కాని కారు ఆపి నీరు ఉన్నా పోయలేదు, నీరు పోసి ప్రాణం కాపాడలేదు అనుకొండి. ఒకరి ప్రాణం పోతున్నది అని తెలువకపోతే తరువాత ప్రాణం పోయింది, తరువాత ఆ రోడ్ వెంబడి 1కోటి కార్లు వెళ్లాయి. ఏమి లాభం, పోయిన ప్రాణం తిరిగి వస్తుందా... ఆ కారులో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కానీయండి, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి గారు కాని శ్రీ రాధా కిరణ్ శాస్త్రులు కాని ఉండనివ్వండి, ఒక వృత్తి రీత్యా చెండాలుడు ఉండనివ్వండి, కారు దిగి లేదా అటుగా కాలినడకన అటుగా వెళ్తున్నా బీద రిక్షా కార్మికుడు ఉన్న నీటిని ప్రాణం పోయే వ్...

Eternal Karma, Pure heart

మనము ఏదైనా తప్పు, ఒప్పు తలచి పని చేసిన పిదప, ఒప్పు పనికి ఇబ్బంది ఉండదు, వెనుకకు తిరిగి చూడనవసరం లేదు, తప్పు పనికి మాత్రం దేవుడు ఏదో ఒక విధముగా, ఏదో ఒక రూపంలో (సంజ్ఞ, మనిషి,వస్తు) నీకు తెలియవచ్చు విధముగా నీ కళ్ళముందు అగుపించునట్లు, కనిపించునట్లు చేస్తాడు, ఇది నా జీవిత అనుభవంతో చెప్పుతున్న  మాట. అన్నిటికంటే pure heart, శుద్ధ మనసు, ఆత్మ ముఖ్యం. మనం జన్మించినదే కర్మ చేయడానికి. ఆ కర్మ శుద్ధత్వానికి భంగము కలుగచేయరాదు. మన పని, ఆచరణ, పద్ధతి, ప్రవర్తన దానికి లోబడి,దానికి అనుగుణముగా ఉండాలి. దైవమును తెలుసుకొని మోక్ష ప్రాప్తి పొందాలి, అనగా శుద్ధ మనసు సంతృప్త, ప్రశాంతత స్థితిని చేరి, ఎట్టి వ్యామోహాలు లేనిదై, భవ బంధములకు అతీతమై, దూరమై అరిశడవర్గాలను జేయించినదై ఉత్తమ స్థితి ద్వారా ఆ పరమాత్మ యందు లయం అగుట. దీనినే పరమ ఆత్మ స్థితి అని కూడా అనవచ్చు. ఇదియే నర జన్మ ఎత్తిన మానవుని పరమార్థము, గమ్యము చేర వల్సిన స్థితి. ఒకరి మనసు నొప్పించరాదు, ఒకరి కడుపు కొట్టరాదు, ఒకరిని నిందించరాదు,  దూషించరాదు, మోసం చేయరాదు, వంచించ రాదు. వీనినే పరమముగా  ఆచరించవల్సినవిగా చెప్పవచ్చును.

Journey of Life along with Karma

When you give up your work or karma, it is almost treated as death. Your work, sincerity,quality, control,patience will be rolled as your characteristic instinct. Your karma or work will write or leads destiny or Bhagyamu. That's why we say when character is lost everything is lost. When good or bad, whether good or bad you should have your own system, methodology prepared by your self and followed by your self. You should always try to give answer your self means, to your heart (MANASU, ATMA). Then without leaving karma, you proceed further in your life journey untill it stops on its own or by Para brahma's order or instructions. It is one deep and sensitive process of Para brahma and one has to understand with utmost care focus,concentration and meditation. Keep on practicing with great effort you may find the way of Para brahma, attainment of MOKSHA. Later abhyasa,sadhana you may be immersed, join in Para brahma very rarely depends upon your sincerity, dedication and commit...

Instead of quarrelling for greatness, do best to the needy and find satisfaction, peace and way of Paramatma

ఇద్దరు గొప్పతనం గురించి అర్రలు చాచడం, వెంపర్లాడడం, వెంబడిపడడం కాదు, ఈ సమాజానికి ఏమి ఇచ్చాము, మన సహకారం, భాగస్వామ్యము contribution ఏమిటి? ఈ విధముగా ఆలోచించాలి. ఇంకా వీలైతే రెండు కోతులు రొట్టెముక్కకై కొట్లాడిన మూడవ కోతికి లాభం అయినట్లు, వీరిరువురు అట్టి పరిస్థితి తెచ్చుకోక సమాజ,లోకహితం గూర్చి పాటుపడాలి. అమాయకుల,అనాధల, అబలల, నిరుపేదల జీవితాల్లో వెలుగురేఖలు, వారి మోములో చిరునవ్వు తేవాలి. ఆ ప్రయత్న దిశగా వారి గమనం ఉండాలి. అందరూ కాలగర్భంలో కలిసిపోయేవారే. ఉన్నంతలో, శరీరం చైతన్యవంతముగా ఆ అమ్మవారి దయతో ఉన్నంతవరకు నలుగురికి మంచి చేయడం కన్నా మహోన్నతమైన పని ఈ భూమిపై ఏమి లేదు ఎవరికిని అని నేను అత్యంత విశ్వాసంతో, నమ్మకంతో నా ఆత్మ ద్వారా చెపుతున్న మాట. దీనిలో వారికి అత్యంత ఆత్మ సంతృప్తి కలుగుతుంది. అదియే ఇంకా కొన్ని మంచి పరిణామాలకు దారి తీస్తుంది. ప్రతీవారికి కీర్తి కాంక్ష, మేము గొప్ప, గొప్ప పేరు తెచ్చుకోవాలి అని అందరికి ఉంటుంది, కాని దాని అర్హత,యోగ్యతకు నేను ఎంతమేరకు సరితూగుతున్నాను అని చాలా తక్కువ మంది, నరులు ఆత్మవిమర్శ చేసుకొనెదరు. దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడు, ఏ విధముగా కోరుకుంటే, ఏ శక్తితో ఉం...

Rudeness leads to darkness, see through eye of heart.

అహంకారంతో అంధకారం ఏర్పడును, అజ్ఞానంతో అహంకారం ఏర్పడుతుంది. అట్టి సమయంలో ఆ పరమాత్ముని చరణములను ఎవ్వరు పట్టుకుంటారో, విశ్వశిస్తారో వారికి భగవంతుని లీలల ద్వారా చీకటిని తొలగించి వెలుగును, తేజస్సును ప్రసాదించి వారికి సన్మార్గమును చూపుతాడు. ప్రళయ కాలంలో వస్తు ప్రపంచము భగవంతునిలో, పరమాత్మలో లీనమవుతుంది. ఉదరంలో, పొట్టలో భద్రముగా కాపాడును. తదుపరి తిరిగి మరల ప్రపంచమును సృష్టించును. ఆ దేవ దేవుడు నిరంజనుడు, ఎటువంటి కలంకము లేనివాడు, నిర్విరాకారుడు, రాగ, ద్వేషాలు ఎవరి యందు ఉండవు, పక్షపాతం ఉండదు, మన్మధుడు కూడా శ్రీకృష్ణుని ముందు ఓడిపోయి దాసుడయినాడు. ఓం కామధేనువాయనమః. శబ్ద ప్రపంచము ఓంకారములో లీనమైపోతుంది. భాగవతం ముందు శుఖ మహర్షి, వ్యాస మహర్షిని మనస్సారా తల్చుకోవాలి. భగవత్గీత లేదా భాగవతం భక్తి ద్వారా భగవంతుని తెలుసుకొనుట, చేరుకోనుట ను తెలియజేస్తుంది, చేరుకోనుటకు మార్గం తెలియజేస్తుంది, చూపుతుంది. మనము ఏ విధముగా, ఏ రూపకముగా త్రికరణ శుద్ధిగా కోరుకుంటామో ఆ విధముగా ఆ పరమాత్మ నీ శక్తిని అనుసరించి, శక్తి ప్రకారం, అనుగుణముగా నీకు దర్శనమిస్తాడు. ఒక దారము తీసుకోనండి. దాని పొడవు 3 లక్షల కిలోమీటర్లు. ఒక కొనను భూల...

My movement, My Life, My Philosophy, My way in finding Paramatma

నేను జీవితంలో నా గురించి కంటే ఎదుటి వ్యక్తి గురించి ఎక్కువగా ఆనందము చూశాను, అట్టి కర్మ చేశాను, ఆనందము వెతుక్కోని ఆనందిచాను అని చెపుతూ తదుపరి నిజమైన ఆనందము ఎందులోనూ కనబడనందున దేనిలోను లేదు అని భావించిన వాడినై ఆ పరమాత్మ స్మరణలోనే సకల శుభాలు, ఆనందాలు ఉన్నాయని తలంచాను. ఇదియే మనస్సులో నాటుకొని పోయింది. దీర్ఘకాలంగా దీనినే అనుసరిస్తూ, నమ్ముతూ, విశ్వషిస్తూ కాలం అనే సముద్రంలో గమనం సాగిస్తున్నాను. నేను జీవితంలో దేనికి బానిసను కాలేదు. ఒక్క ఆ పరమాత్ముని చరణాలను, పరమాత్ముని సన్నిధిని చూడడానికి తప్ప. ఇది నా మొదటి మెట్టు విజయం అని అనుకుంటున్నాను. ప్రతి అడుగులో, ప్రతి కర్మలో, ప్రతి విషయంలో, ప్రతి గమనంలో, ప్రతి సంఘటనలో నా జీవితంతో అన్వయించుకొనుచూ వచ్చాను అని మీకు తెలుపుతున్నాను. ఇదియే నా పరమైన ప్రత్యేకతగా భావిస్తాను.  నేను ఈ ఐహిక, అవాస్తవమైన, మిధ్యా ప్రపంచములో దేని వెనుక వెనుక పడలేదు, దేనికోసం వెంపర్లాడలేదు. కొంతకాలం డబ్బుకోసం వెనుక పడ్డాను, కొన్ని నిజాలు తెలుసుకున్నాను, డబ్బు వెనుక పడడం ఆపినాను. నన్ను ఇప్పుడు ఎట్టి విషయం మోహింప చేయలేదు. ఇట్టి స్థితి నరునికి చాలా అరుదుగా అత్యంత అనుభవం, సాధన ద్వారా...

Learn,understand,follow and immerse in the philosophy of Lord Sri Radha Krishna

ఆధ్యాత్మిక భావనలు వ్రాసుకోవాలి, ఎవరైనా చెప్పినప్పుడు శ్రద్ధగా వినాలి. అర్ధమైనట్లు ఉంటాయి కాని తరువాత గుర్తు ఉండవు,రావు, మరచిపోతాము. వానిని మనస్సుతో పట్టుకోగల్గాలి. లేనిచో కర్పూరం వలే ఆవిరైపోతాయి. జీవునికి పరమాత్మకు మధ్య అమ్మవారు మధ్య వ్యస్థితం లేనిచో ఎప్పుడు గొడవ,ఘర్షణ. రాముడు,సీత, లక్ష్మణస్వామి. ముగ్గురి క్రమం. దేవుడు, జీవుడు మధ్యలో అమ్మవారు. వాల్మీకి మహర్షి రచించిన శ్రీరామాయణం మనందరికి ఒక ఆదర్శ కావ్యం మరియు మానవాళికి ఒక వరం. ఏదైనా నువ్వు చేసే ఆలోచన,ధోరణి, మన ప్రయత్నము 90% వృధా పంథాలో తీసుకవెళ్తాము. దీనినే గుర్తింపు కోసం మనము లోకానికి చూపించే ప్రయత్నము చేస్తాము. ఎటులనగా మనము ఏది చేరలేమో, ఏది మనము కాదో, ఏది మనవళ్ల కాదో దాని కొరకు కాలం వృధా చేస్తాము. అదే తాపత్రయంతో దానికై ప్రయత్నము చేస్తుంటాము. ఎదుటివారు గ్రహించాలని తాపత్రయం.సులభముగా చెప్పితే ముసుగు వేషం లో గమనం,కదలిక ఉంటుంది. ముసుగు ప్రయత్నము, ముసుగు ఆలోచన, చింతన. అదే మనమెందో గుర్తెరిగి, మనము ఏమి చేయగలమో, మనవళ్ల ఏది సాధ్యపడగలదో గ్రహించి అట్టి దానికై ప్రయత్నము చేసిన 6 లేదా 30 రోజుల్లో సాధించగలం. లేనిచో 365రోజులైనా, 3 సంవత్సరాలైనా ఏమి చ...

Easy to say but very difficult to follow and implement

చెప్పడం సులభం, ఆచరించడం కష్టం. అది నాకైనా, మీకైనా, ఎవరికైనా. దేవుడు సృష్టించిన ఈ మానవులందరికి వర్తిస్తుంది. అట్టి మనకు మానవ జన్మ ప్రసాదించిన  దేవుడిని కృతజ్ఞతతో మనస్సుతో, పంచ ఇంద్రియాలతో ఆరాధించి, పూజించి ఆ మధుర అమృత తుల్యమైన భగవత్ స్వరూపాన్ని అనగా ఒక్క స్వరూపం అనే కాదు అన్నీ లక్షణాలు, విధులు, హక్కులు మొదలైన సమస్త సమాచారం తెలుసుకోవడమే మన ముఖ్య పని. Life Object of a person after taking birth on holy earth. మనస్సును శుద్ధి చేసుకోవడం కష్టం అనగా ఉత్కృష్టమైనది అని. సత్ బుద్ధి కలగాలి. అందులకు సాధన మనస్సు ద్వారా చేయాలి. మనము తొందరగా mould, motivate ఆవుతున్నాము అంటే బాగా విచారించుకొని పని చేయాలి, మన ఆచరణ తప్పుదిక్కు పోయే అవకాశం ఉంటుంది. దీనిని సంజ్ఞ signal గా గుర్తించాలి. అనుక్షణం అంతరాత్మకు సమాధానం చెప్తుండాలి. ఇలా చేస్తే మరణం తరువాత పరమాత్మకు జవాబు చెప్పడం తక్కువ అవుతుంది అని నా అభిప్రాయం. నా ధ్యానం ద్వారా నేను చెపుతున్నది ఈ విషయం.మనము ఆలస్యముగా mould, motivate అవుతున్నాము అంటే కూడా విచారించుకొనియే పని చేయాలి. కాని ఇప్పుడు మన ఆచరణ ఒప్పు దిక్కు అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. అవకాశం ను మన...

We feel that We know everything and some times more than the other persons, but actually we are still at entrance level of understanding

తెలుసు,నేర్చుకోవడం గురించి. మనకు ఏమి రాదు, రావడానికి,నేర్చుకోవడానికి చాలా జన్మలు పట్టును. ఇట్టి విషయమును గ్రహించవలెను. ప్రతీ మనిషి తనకు బాగా తెలుసు అనే ఫీలింగ్ లో ఉంటాడు, ఏమి రాదో, తెలువదో అతను గుర్తెరుగాడు, ఎందుకనగా అతనికి తెలువదు కాబట్టి. కావున మనకు ఈ జీవితం నిలిచే వరకు అనునిత్యం, ప్రతినిత్యం నేర్చుకుంచూ better చేసుకుంచూ పోవడం ఒక్కటే మార్గం. దాని ద్వారా చివరకు పరమాత్మ తత్వమును తెలుసుకునే ప్రయత్నము. సూక్ష్మంగా ఇది. దీనికి short cuts ఉండవు. చాలా మంది అవివేకంతో గొప్ప వ్యక్తి తో ఫోటో,selfie, అతని ద్వారా అతనిని అనుకరించడం, అతని ఎదో link ద్వారా ఇతను ఎక్కువ చూపుకునే ప్రయత్నము చేస్తారు. ఇది ballooon లో వాయువు నింపిన పిదప, ఏదో ఒక కారణముతో ఆ వాయువు వెళ్లిపోగా ఆ balloon సాధారణ స్థితికి వచ్చినట్లు, వారి స్థితి ఏర్పడును. వారి ప్రయత్నమే వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దును.మనము కాదు ఇక్కడ సంభాషణ జరుపుతున్నవి రెండు మనసులు, రెండు ఆత్మలు కావాలి. అప్పుడే నిజాలు మాత్రమే బహిర్గతమయ్యే అవకాశాలు ఉంటాయి. భావములు మనస్సు అనగా ఆత్మ ద్వారా ప్రకటితము కావాలి. బుద్ధి ప్రచోదనము దానికి దోహదకారి అవును.You are saying tha...

We worship snake even though it is poisonous, the true cruel on the earth what?

శ్రావణమాసం లో వచ్చే నాగ పంచమి, కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి విశేషమైనవి. మనము నాగ దేవత, నాగ దేవుడిగా పామును,సర్పము అనగా కదిలేది దేవతలుగా పూజిస్తాము. మీరు పరిశీలించండి పాము దాని త్రోవలో అది పోతుంది కాని దాని అంతట అది నేరుగా మనిషి మీదికి,పైకి రాదు. మీరు గమనించండి. మనిషి అది విషపూరితమైనది అని ఒక అభద్రతా భావంతో దానిని చంపివేస్తారు. అలా చేయనవసరం లేదు. ఒక్కోసారి ప్రమాద వశాత్తు చీకటిలో మన కాలు దాని మీద పడగా అది అభద్రతా భావంతో కాటు వేయవచ్చు, కాటు వేసిన సందర్భములు ఉంటాయి. అందుకే నాగు పాము పగ పన్నెండేళ్ళు, నాలో రగిలే పగ నూరేళ్లు అని పాట. పాము ఉదయమే దాని కదలిక, బయలుదేరేముందు నరుని కంట పడకుండా చూడు అని ఆ దేవ దేవుని ప్రార్థించును. అత్యంత విషపూరితం మనిషియే. ఇతను మంచి భావనతో పునీతం కావాలి. అదే పరమార్థం.

Meditation తపస్సు

తపస్సు అనగా శ్రద్ధతో ఆచరించే కర్మ, క్రతువు. ఇది verb అనగా క్రియ.పని చేస్తూ ఉండు, ఎట్టి పరిస్థితుల్లో పని ఆపకు, ఇది దానికి అనుగుణంగా ఉంటుంది, దానికి లోబడి ఉంటుంది, దానిని అతిక్రమించినది కాని, దాట వేసినది కాదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. పట్టుకోగల్గాలి. ధ్యానం అన్నా తప్పస్సు అన్నా ఒక్కటే. దీని వల్ల ఏమి వస్తుంది. శక్తి వస్తుంది. తేజస్సు కలుగుతుంది. సన్మార్గంలో నడుస్తావ్. సత్ బుద్ధి కలుగుతుంది. సదాచారము అలవడుతుంది. సత్ ఆలోచన వస్తుంది. సత్ కర్మకు నాంది, నిజమును, సత్యమును పలుకుతావు, ధర్మం ప్రకారం నడుచుకుంటావు. తపస్సు అంటే అసలు అర్థం ఏమిటో తెలుసా మీకు? మనస్సును శుద్ధి చేసుకునుట, కడగడం, మన మనస్సును మనమే పరిశుభ్రం చేసుకోవడం. నిష్కల్మమైనదిగా తయారు చేసుకోవడం. శుద్ధి చేసుకోవడం.

Time, Nature are the Supreme Powers

కాలం, ప్రకృతి వివరణ, వ్యత్యాసం ఈ విధముగా. ఈ ప్రశ్న వేయడానికి కారణం రచన చేస్తున్నప్పుడు ఈ రెంటిలో ఒక పద ప్రయోగం చేయవలసి వచ్చిన సందర్భంలో  సందేహ నివృత్తి ఆలోచన కల్గింది. యక్ష ప్రశ్నలలో అన్నిటికంటే శక్తివంతమైనది ఏది అనే ప్రశ్నకు కాలం అని ఉంది. అన్నీ కూడా కాలగర్భంలో కలువాల్సిందే అంటారు కూడా. ప్రకృతి అనగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి స్వరూపం. అందుకే అమ్మవారి నామాలలో మొదటిది ఇదియే. కావున ఈ రెండు కూడా అత్యంత శక్తి వంతమైనవి. Wording పదాలతో వేరు వేరు, అతి సూక్ష్మమైన సన్నని,చిన్నని తీగ వ్యత్యాసం ఉంది అని నా భావన. ఒక మనిషి యొక్క రెండు చేతులుగా చెప్పవచ్చు అని ఇప్పుడే వచ్చిన ఆలోచనతో కూడిన భావన. దేని ప్రాధాన్యత వాటికి ఉన్నాయి. పంచ భూతములు కూడా వీని పరిధిలోకి వస్తాయి అని అనుకుంటున్నా. పంచభూతములతోనే కాలము గమనం, గణన. పంచ భూతములు ప్రకృతిలో భాగములు అని అనుకుంటున్నా. 

Everything resides and depends in the heart.

అన్నిటికన్నా మనస్సు ప్రధానం. ఆ మనస్సుకు ఆధారమైన మంచి ఆలోచనతో కూడిన మంచి ఆచరణ ముఖ్యం. అందుకే సత్ చింతన, సదాచారము అంటారు. ఇది మనకు అవసరము. మనిషి ఇగోను వదిలి పెట్టాలి. 99% దారిద్ర్యము పోయినట్లే అవుతుంది. మిగిలింది మన కర్మతో మనం పునీతులం కావాలి అంటే సత్ కర్మ, సదాచారమును పాటించవలెను. చెప్పడం సులభం, ఆచరించడం కష్టం. ఇది మొదట నాకు వర్తిస్తుంది, పిమ్మట మన అందరికి వర్తిస్తుంది. కావున సాధనతో ముందుకు వెళ్లి ఈ ఉత్కృష్టమైన, పుణ్యమైన, అరుదుగా లభించే మానవ జన్మను సార్థకం, కృతకృత్యం చేసుకోవాలి అని అందరితో విన్నపము ద్వారా పంచుకుంటున్నాను. అందుకే త్రికరణ శుద్ధి ఉండాలి అంటారు. ఏమి ఆలోచిస్తామో అదియే మాట్లాడగల్గాలి, అదియే కర్మ ద్వారా ప్రకటితము కావాలి. 

Influence of cinema in real life, One should know What is real life and the differences& limitations of both.

ఈరోజు, ఈ నేటి పరిస్థితుల్లో సినిమాలు చూడనివారు ఎవ్వరైనా ఉన్నారా అంటే ఆశ్చర్య కరమైన ప్రశ్న అవుతుంది. బహుశ జవాబు లేరు అని రావచ్చు. ఇట్టి సినిమా ప్రభావం మన అందరి నిజ జీవితంలో ఎంత? తప్పకుండా చాలామట్టుకు ఉంటుంది అని అందరూ చెప్పుతారు, ఇదియే నా అభిప్రాయం కూడా. ప్రతి సినిమా ఏదో ఒక మంచిని తెలుపుతుంది. ఒక మంచి message ను ఇస్తుంది, ఒక నీతిని తెలియజేస్తుంది. మరి మనలో ఈ సినిమాలలో ఏది ఎంత నేర్చుకోవాలి, ఏది అవసరం, ఏ పాయింట్ మనకు ఉపయోగపడుతుంది, మిగిలిన చెత్తను బుర్రకు ఎక్కించుకోకుండా వదలాలి అని ఎంతమంది దృష్టిని నిల్పుతారు. నేను భారతదేశం యొక్క అందగాన్ని అవునో, లేదో, ఏమో నాకు తెలువదు, కాకపోవచ్చు. కాని నా మనస్సు సాన పెట్టగా, సాధనతో మధించగా మనస్సుతో చాలా అందమైన వానిగా నాది నేను చెప్పుకునే ప్రయత్నము చేస్తాను. ఇది నా మట్టుకు నా గురించి నేను అనుకుంటున్న భావన. మరి నా బాధ నా గురించి అయితే మంచిగానే ఉండు కాని కాదే, నా బాధ అంతా అమాయకులైన భారతదేశ ప్రజలైన మీ అందరి గురించి. అందుకే నా ఆలోచనలను, నేను నమ్మే సత్యములను, వాస్తవానికి దగ్గర అనిపించిన మంచి మాటలను, ఆలోచనలను మీ ముందు ఉంచడం. ఇట్టివి ఏ క్రొద్ది మంది జీవితాలను ప...

Your good thought and action will make you to reach God

చిన్నప్పటి నుండి కష్టాలలో పెరిగి,కష్టాలు చూసి చలించిన హృదయం అంత తొందరగా మోసం,నంగా,దొంగ, కుట్రలు, కుతంత్రాలు ఉన్న ప్రవృత్తికి లోనుకారు, వెళ్ళరు అని నేను అనుభవ పూర్వకంగా చెప్పడం. ఇంకా వీలైతే సమాజ ఉద్ధరణకు వీరు పూనుకుంటారు. జల్సా, దుబారా (Lavish&extravagance) ఖర్చుతో పెరిగిన వారు జీవిత పరమార్థం తెలుసుకోక అటువంటి వారు ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఏమి చేస్తారో, ఏమవుతారో వారికే తెలువదు. అంతా ఆ జగన్నాటక సూత్రధారి లీలలు,ఆటలు. అవి మానవ మాత్రులకు అంత తొందరగా,త్వరగా అర్థం కావు. దాని కోసం తపన,తపస్సు ద్వారా అత్యంత శ్రమ,పట్టుదల,దీక్ష,దక్షితతో అతి కష్టముగా తెలుసుకునే ప్రయత్నము సలుపవలెను అనగా చేయవలెను. ఈ ప్రయత్న మార్గంలో కూడా ఓపిక  ఉండక, ఏకాగ్రత లోపించి మరియు ఇతర అనేకానేక కారణాల వలన పట్టు వీడేదరు, ప్రయత్నమును అకస్మాత్తుగా విరమించరాదు, అట్లు విరమించవద్దు. ఆ దేవ దేవుని శ్రీ చరణాలను నమ్మకంతో, విశ్వాసంతో ఎన్ని ఆపదలు, కష్ట, నష్టములు వచ్చినప్పటికీ అట్టి పాద పద్మములను విడువరాదు. వారిని ఆ దేవ దేవుడు, సకల ప్రాణికోటి రక్షకుడు, పరబ్రహ్మ తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇదే నేను నొక్కి వక్కాణిస్తున్నాను. బాబు గోగినేని...

Nobody knows about tomorrow

రేపటికి రూపం లేదు అంటారు. రేపు ఏమి అవుతుందో, ఏమి కానుందో,రేపటికి ఏమి జరగనుందో, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవ్వరికి తెలుసు? ఎవ్వరికి తెలువదు. ఆశావాద దృక్పధం తో, మంచి జరుగుతుంది అనే ఒక మంచి ఆలోచనతో  మాత్రమే పోయ్యే ఒక వీలు ఉంది. అందుకే be positive, think positive అంటారు. నీ శక్తి,సామర్థ్యం ను యుక్తితో బయటకు తీసి ప్రదర్శించి సమాజ శ్రేయస్సుకై ఉపయోగించు. ఏదైనా ,ఏ శక్తి అయినా మనలోనే ఉంటుంది. దానిని కదిలించి మేలుకొల్పాలి. Shake well before use మాదిరిగా. ఎవ్వరికి కూడా వారి భవిష్యత్తు ముందుగా తెలియదు. మనం జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా ఒక్కోమెట్టు ఏర్పాటుచేసుకుంటూ, అల్లుకుంటూ వెళ్లడమే. దానికి బేస్,ఫౌండేషన్,శాస్త్రీయత, శాస్త్ర ప్రమానమును అనుసరించి మన ప్రయాణం,  ఉండేవిధముగా చూసుకోవాలి. సత్యము, ధర్మంతో మన కర్మ కూడి ఉండవలెను.

What for all these evil actions and sins

రెప్ప పాటు మనిషి జీవితం. ఏమిటికై, ఎందులకై ఈ ఆరాటం, పోరాటం. ఎందుకీ కపట నాటకాలు. చివరకు ఏమి సాధించడానికి. మానవత్వం పరిమలించే మంచి మనసుకు స్వాగతం ఈ లోకంలోకి, ఈ జీవితంలోకి. అందరూ కూడా ఆనందము అనే సముద్రంలో మునకలు వేయగల్గాలి. అట్టి నవ సమాజ స్థాపనకై కృషి చేయుటకు తన వంతు బాధ్యతను పోషించాలి, ఆ విధముగా ప్రవర్తించాలి, ఆ విధముగా కార్యోన్ముఖుడై అడుగు ముందుకు వేయాలి. నా ఒక్కరితో ఏమవుతుందో అని ఎప్పుడు తలంచరాదు. నా పాత్ర నేను పోషిస్తాను, నా కర్తవ్యాన్ని నేను చేస్తాను అని భావించి ఆచరణలో పెట్టిన రోజు ఈ దేశం ఎంతో ముందుకు అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. మన అందరి భాగస్వామ్యం తోనే ఈ దేశానికి కదలిక, గౌరవం, అభివృద్ధి. కావున మన దేశ భవిష్యత్తు మన అందరిపై కలదు. ఏ విధముగానైతే ఒక కుటుంబ భవిష్యత్తు ఆ యొక్క అందరి కుటుంబ సభ్యులపై ఆధారపడుతుందో ఆ విధముగా.

Your Power, My Message

మనిషి ప్రస్తుత పరిస్థితి తో రాజీపడనవసరం లేదు, బాధ పడవద్దు. ధైర్యం అసలే కోల్పోవద్దు. నీ హృదయ అంతరాళంలో నుండి దాగివున్న అపరిమిత శక్తి పై దృష్టి పెట్టు, అది నిన్ను ఏ స్థానంలో ఉంచాలో ఆ స్థానంనకు తీసుకొని పోవును. అదియే దాని బలము గొప్పతనం. నీకున్న శక్తిని నీవు గుర్తించ గలవు, గ్రహించ గలవు, అటులనే నీతో కాని పని, నీలో లేని శక్తిని కూడా గ్రహించగలవు. లేనిది ఉన్నట్లు ఊహించుకోవద్దు,చెప్పవద్దు భ్రమ ప్రపంచములో విహరిస్తూ ఉండరాదు. లేని శక్తి పంచభూతాల సాక్షిగా ఒప్పుకోవాలి. వానిని సాధించటకు ఎప్పుడైనా ప్రయత్నము చేయవచ్చు. అంతేకాని ఉత్తర ప్రఘల్భాలకు పోవద్దు. ఉన్న శక్తిపై పోరాడి దేనినైనా సాధించి అసాధ్యమును సుసాధ్యం చేసుకోవచ్చు. దీనికి నీ పట్టుదల,శ్రమకు అదృష్ట రూపంలో రవ్వంత ఆ దేవ దేవుని చల్లని చూపు తోడవుతే సరిపోతుంది. గుమ్మడికాయంత శ్రమ ఉన్న ఆవగింజ అంత అదృష్టం ఉండాలి అంటారు. ఆ ఆవగింజ అదృష్టమే ఆ దేవ దేవుని ఆశీస్సులు అని అనుకోవచ్చు. ఇట్టి విషయం పెద్దలు చెప్పినది, నా అభిప్రాయం కూడా ఏకీభవించినట్లు. అందరికి శుభం కలుగు గాక ||

Destructions in finding ANANDAM (ecstasy of joy)

కృళ్ళు, కుతంత్రం, అసూయ,ద్వేషం,పగ,ప్రతీకారం, శత్రుత్వం,ఓర్వలేనితనం,అంటరానితనం, నేనే గొప్ప, మూర్ఖత్వం,ఋణగ్రస్తులు మరియు నేరము చేసినవారు ప్రకృతి లో సంతోషం ను చూడలేరు, ఆనందంగా ఉండలేరు. మంచి వాతావరణాన్ని, ఈ దేవ దేవుని మహిమలను, గొప్పతనాన్ని అర్థం చేసుకోలేరు, ఆస్వాదించలేరు. ప్రకృతి ఒడిలో ఆడుకోరు, ఆ సౌందర్యాన్ని మరియు లీలలు,మహత్మ్యం ను ఆస్వాధించలేరు, అర్థం చేసుకోలేరు అని నా అభిప్రాయం. ఒకవేళ వారు అలా ఉన్నా సామాన్య స్థితికి రావడానికి చాలా సాధనతో పరివర్తన చెంది, మార్పుకై తపించి మంచితో చేరుకోగల్గాలి.

Understanding the Nature and the protector and creator of the universe of the universes.

Though I seem to be quiet but not, me&my mind and soul thinking and concentrating with DHYANAM to understand the "PARA BRAHMA" the divine power which is taking care or looking after the universe of the universes. He is the creator and protector of the universe of the univrses. How to reach him? how to attain MOKSHA? What is the Karma Sadhana? I will be rounding around these thoughts and activities. I love them. I get immense pleasure and satisfaction in this. My entire body &Soul swims in the air and peace and tranquility passes over my body. My body is filled with or immerse with lot of joy and happiness. This phase and feel is called ANANDAM. One should reach this stage with his own SADHANA. Then he can find the way to reach PARABRAHMA and MOKSHA. This is my idea,philosophy or Sadhana or my creative work of expression you can say. Individually you need to research and judge yourself. Whatever you find, you notice, feel and inform your understandings and experiences...

Speach is the real ornament

వాగ్భూషణం భూషణం. పురుషునికి వాక్కు లేదా మాట అనెడి అలంకారం నిజమైన అలంకారమగును, నగలు, విలేపనము మొదలగునవి అసలు అలంకరణలు కావు అని కవి బర్తృహరి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అతని శతక పద్యాలు అన్ని ఆణిముత్యాలు. మాట సంపదను, ఐశ్వర్యమును ఇచ్చును. మాట ప్రశాంతతను ఇచ్చును. సత్యం వదా, ధర్మం చర. సత్యమును మాట్లాడుము, ప్రియము కలుగునట్లు మాట్లాడుము, అసందర్భమైన సమయంలో అప్రియముగా మాట్లాడకు, నీకు ప్రియము కల్గుటకు, ఎదుటివారికి హానిచేయుటకు అబద్ధమును పలుకకు. మాట మంచిదైతే ఊరు మంచిది అంటారు. అలాగే మాట ద్వారా గౌరవం, మర్యాద లభిస్తాయి. ధన, ధాన్య కటాక్షం లభిస్తుంది. ఎన్నో సాధించవచ్చు, ఎన్నో విజయాలు చేకూరుతాయి. కీర్తికి దోహదపడుతుంది.

You are the best judge of yourself

ఒక మనిషి తనకు తాను, తనది తాను అర్థం చేసుకున్నంతగా ఎవ్వరూ అతనిని అర్థం చేసుకోలేరని నా అభిప్రాయం. You are the best judge of yourself అంటారు. నూతిలో పడ్డ వానిపై నూరు రాళ్లు వేస్తారు. మనం బెదరవద్దు. పండినచెట్టుకె రాతి దెబ్బలు. ఎదుగుతున్న వారిపై పనిలేని వారు ఎన్నో విమర్శలు అసూయతో చేస్తుంటారు. అవి ఏవి పట్టించుకోవద్దు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొత్తుకున్నట్లుగా భావించాలి. మనం ఎక్కువగా రియాక్ట్ కాకూడదు. మనం ఓపికతో మరియు స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి. కావున తనపై తనకు ఉన్న నమ్మకాన్ని ఎప్పుడు విడువరాదు. అదియే తన ఊపిరి. అది పోయిన పిదప మనుగడ ఉండదు. So be careful in your life journey. విజయము నీకై నీ వెనుకే నీ నీడలాగా నిన్ను వరించడానికై వస్తున్నది. అది గ్రహించు. తొందరపడకు మిత్రమా....

Infront of my eyes

విధి ఎంత చిత్రమో, విచిత్రమో. ఎందుకంటే ఈరోజు నా కళ్ళముందు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంలో ( accident) ఒక వ్యక్తి అత్యంత దారుణంగా చనిపోయినారు, రెండవ అతను చిన్న గాయంతో ప్రాణాలతో బయట పడినారు. ప్రమాదానికి కారణం మద్యం త్రాగి మోటారు బైకను స్పీడ్ గా నడపడం. కాని ఈ జరిగిన సంఘటనను తొందరగా మర్చిపోలేకపోతున్నాను. జీవితంలో ఎదురయ్యే,జరిగే,సంభవించే మరియు మనము చేసే పనులుకాని, సంఘటనలకు కాని తిరిగి అవకాశం ఇచ్చే విధముగా కొన్ని ఘటనలు,సంఘటనలకు తావు ఉండదు. ఉదాహరణ పైన చెప్పిన ప్రమాదం. కావున జీవితంలో మనిషి ఎంత అప్రమత్తముగా ఉన్నా, ఎంత జాగ్రత్త పడినా తక్కువే అవుతుంది. మనకు తోచని,ఊహించని,ఆలోచించని,చూడని,ఊహకందని, తెలివికి చిక్కని, అంతుచిక్కని ఎన్నో ప్రమాదాలను ముందుగా మనం పసి కట్టలేము. కావున ప్రతి అడుగులో తొందరపాటుగా ప్రవర్తించకుండా, మెదడు పెట్టి గట్టి ఆలోచనతో , తెలివిగా ముందుకు వెళ్ళాలి. తరువాత దైవాధీనం. దేవుని దయ. మన చేతిలో ఉన్నంతవరకు జాగ్రత్తలు పాటించాలి. ఆ తరువాత అంతా విధి. ఈ మన గమనం అది ఆడిస్తున్న వింత నాటకం. ఆ నాటకంలో మన పాత్రదారులం. రంగస్థలంలో పాత్రధారులు వస్తూ ఉంటారు మరియు పోతూ ఉంటారు. రంగస్థలం ఈ ప్రపంచ భూమి....

My sincere appeal& proposal to you.

ఒక విషయాన్ని స్పష్టముగా చెప్పాలంటే నేటి పరిస్థితుల్లో అలాంటి వాతావరణం లేనట్లుగా ఉంది నా భావన. మనం చెప్పేదానికి ఇంకేమైనా విరుద్ధమైన అర్థం తీస్తారేమో వక్రీకరిస్తారేమో, వివాదాస్పదం చేస్తారేమో అని. సుఖాన ఉన్న ప్రాణం, మనకెందుకులే, వేరేవారు చూసుకుంటారులే. మనకు ఎందుకు వచ్చిన గొడవ. బయట ఉన్న ఇబ్బందికర, భయానక పరిస్థితుల దృష్ట్యా సాటి మనిషి ఆలోచన తీరు ఈ విధంగా మారింది. దీనికి కారణం. రాజు గారి పాలు,నీళ్లు కథలాగా ఉంది. భావప్రకటన స్వాతంత్ర్యము మరుగున పడింది. ఏమైనా మాట్లాడితే ఏమవుతుందో అనే భయం. ఈ భయంతో ఎన్నిరోజులు జీవించడం. ఇట్టి ఈ భయం దోచుకునేవారికి, అవినీతిపరులకు వరంగా మారింది. ఛలోక్తులు చేయడం,చెప్పడం ఈ రోజు ఇబ్బందిగా మారింది. సౌకర్యము లేదు. సరదాగా తీసుకోగలగాలి. Sportive గా ఉండాలి. Sence of humour ఉండాలి. ఏదైనా సమాజంలో వ్యక్తపర్చేవిధముగా ఉండాలి. ఆ వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం ను ఏర్పరచాలి, ఏర్పడాలి. ఒకరిపై ఒకరు నిందలు మోపడం, బురద చల్లడం, అసూయ,ఈర్ష,అహం ఈ స్వభావాలు తగ్గించుకుంటే మంచిది అని నా అభిప్రాయం. అందరూ సహృదయ మనస్కులై ఒక మంచి వాతావరణానికి నాంది పలకాలి. ప్రశాంతమైన గాలి ఇళ్లల్లో మరియు వీధులలో వీచ...

Money management economics

Money management economics. ధనం మూలం ఇదం జగత్తు అంటారు. ప్రపంచములో అన్నిటికి డబ్బు ప్రధానం. కావున ఇట్టి డబ్బు పట్ల సరిగా వ్యవహరించడము మన కర్తవ్యము మరియు బాధ్యత. ఉద్యోగము, డబ్బు పొందడం కన్నా వానిని కాపాడుకోవడం చాలా ముఖ్యమైనదిగా చెప్పుతారు. కావున సదా వీని విషయంలో అప్రమత్తతో వ్యవహరించాలి. మనకు చాలా తెలుసు అని అనుకోరాదు, నిరంతరము ఎంత తెలుసుకుంటూ ఉన్నప్పటికి తక్కువే అవుతుంది. పూలు అమ్మిన చోట ఇంకేమో అమ్మగలమా అని సామెత. ఎదుటి వారి అనుభవం నుండి మనం నేర్చుకోవాలి, దానికి అనుగుణముగా నడుచుకోవాలి. ఒకసారి జరిగిన పొరపాటు తిరిగి జరగకుండా, పునరావృతం కాకుండా చూసుకోవాలి. జీవిత గమనంలో ఎన్ని విషయాలు నిరంతరం నేర్చుకున్నా అవి తక్కువే, ఇంకా చాలా నేర్చుకోవాల్సినవి ఉంటాయి. ఇది నిరంతర ప్రక్రియ. అంతము మన జీవితం సమాప్తి అయినప్పుడు మాత్రమే. మన జీవిత భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. దానిని అందముగా, సౌకర్యవంతముగా మరియు ఆదర్శవంతముగా తీర్చుకుందాము.చెయ్యవలసిన మంచి చెయ్యకపోతే చెడు గా మారుతుంది, చెడు చూడవల్సివస్తుంది. అందుకే ఒక ప్లస్ రెండో ప్లస్ కు దారి తీస్తుంది కాని ఒక మైనస్ ఎన్ని మైనస్ లకైనా దారి తీయును. ఆ ఏర్పడే రెండు ప్...

LIFE OBJECT

What for i am eligible i don't know. I am just taking out my inside and presenting before the almighty. He will decide, he is the decision maker. I am not worried about the result. What is my object and satisfaction, whether I did my best inside me or not, these two are important to me.Here inside means the hidden talent in me wishes and prepares to do and show interest and thirst  towards particular object. అనగా నా హృదయ అంతరాలలో దాగి ఉన్న ప్రతిభను నాకు దేనిపట్లనైతే, ఏ విషయం పైన నయితే ప్రేమ,వాత్సల్యము,తపన మరియు కోరిక వ్యాక్తపర్చుతున్నానో, పని పూర్తి చేయాలని అభిలాషిస్తున్నానో అట్టి పని పూర్తికై నా మనసు అంతరాళం నుండి పడే ఆరాటం దానికై నేను చేసే ప్రయత్న పూర్వక పోరాటం. ఇదియే నా జీవిత ధ్యేయము, లక్ష్యము మరియు.  మనసు పడే కోరిక గా చెప్పుకోవచ్చు. దీనినే " LIFE OBJECT " జీవిత పరమావధి అంటారు. దీనిని దాని నిర్వచనముగా చెప్పుకోవచ్చు. ఇది ప్రతి మనిషికి చాలా ముఖ్యం. ఇది వారి వారి జీవితాలలో వారి వారి సందర్భములననుసరించి వారికి వారు ఏర్పరుచుకునేది. ఏర్పరచుకొని దానిని సాధించుటకై ప్రతి మనిషి ...

True education to be delivered or released

ప్రజలు చదువు మరియు విద్యావ్యవస్థ పట్లగల అశ్రద్ధ మరియు నిర్లక్ష్య వైఖరిని ఏ మాత్రం ఉపేక్షించారు దుమ్ము దులుపుతారు. Education చదువును వ్యాపారంగా చూస్తున్నారు. ప్రభుత్వం దీనిపై చాలా దృష్టి పెట్టాలి. ఇది విద్యార్థి భవిష్యత్తు, తల్లిదండ్రులు కట్టుకున్న ఆశలతో కూడుకున్నది. దీనిలో ఎన్నో emotions, love, sacrifice, desire ఇలా చాలా దాగి ఉంటాయి. ప్రతి విద్యార్థికి, వారి తల్లిదండ్రులకు ఇదే ప్రథమం. కావున దీనిపై ఎంత దృష్టి పెట్టిన, ఎన్ని మార్పులకు శ్రీకారం చుట్టిన తక్కువే అవుతుంది. దీని విలువ మనం విలువ కట్టలేనంత. ఇట్టి వ్యవస్థలో ఎన్నో లోటుపాట్లు. సరియైన విద్యా వ్యవస్థ,ప్రణాళికలు, లేవు అని నా అభిప్రాయం. దీనిపై ఎంత కసరత్తు జరిపిన తక్కువే అవుతుంది. ఒక 7వ తరగతి, ఒక 10వ తరగతి చదవడం చాలు అట్టి పరిస్థితుల్లో. విద్యార్థులకు నేను ఇప్పుడు చెప్పే కొన్ని విషయాలు ఏ గురువు చెప్పరు, ఏ పుస్తకంలో చదువలేరు, దొరకదు ఎందుకనగా ఉండదు కనుక. విషయమేమనగా గురుకుల విద్యావిధానంలో అక్కడే విద్యార్థులు ఉండకుండా ఇంటికి వెళ్లే విధముగా, touring ఉండే విధముగా ఉండాలి. మ్రొక్కయి వంగనిది మానై వంగునా అని సామెత కావున మీరు 2సం ల నుండి 22 సం ల...

Present pathetic situation

ఈ రోజు వాతావరణం ఎలా ఉంది అంటే స్వేచ్ఛగా ఏదైనా,ఏమైనా వ్యక్తీకరించడానికి, తెలియజెప్పాడానికి, భావజాలంను ప్రకటించడానికి చాలా ఇబ్బంది, కష్టపడవల్సి వస్తున్నది. కొన్ని సందర్భాలలో భయపడవాల్సి వస్తున్నది. వ్యవస్థ మరియు దాని కారణభూతులు కారణం. దొంగే దొంగ దొంగ అన్న చంద్రంగా పరిస్థితి మారింది. దొంగ నటన కలవారు, దోపిడిదారులు, భూకబ్జాదారులు మరియు బకాసురులు,ఆర్థికంగా మోసాగించి లక్షల మందికి చెందవల్సిన డబ్బును అనుభవించేవారు దీనికి కారణం అని నా అభిప్రాయం. ఇట్టి లోపాలతో కూడిన వ్యవస్థలు మారాలి. భారతదేశంలో ఆర్థిక సమానత్వం రావాలి. పేదవారి కడుపు నిండాలి. వారికి అన్నీ విషయములలో న్యాయం జరగాలి, సమానత్వం రావాలి. ఈ దేశంలో రెండే కులాలు ఒకటి ఉన్నవారు, రెండు లేనివారు అని నా అభిప్రాయం. లేనివారు ఉన్నవారుగా మారాలి. ఆర్థిక వ్యవస్థ అందరికి అనుగుణముగా మారి సమన్యాయం చేయాలి.మన భారతదేశ మువ్వన్నెల జండా సదా ఎగిరి రెపరేపలాడుతుండాలి.ప్రపంచదేశాలతో చూస్తే మనదేశం గొప్పగా మరియు గర్వించే విధముగా ఉండాలి. పేదవారి గుండె ఆనందముతో నిండి విశ్రమించాలి. నేను కోరుకునే భారతావని అలా ఉండాలి.100 మందిలో 90 మంది తప్పుగా ఉంటే ఆ చెప్పే తప్పే ఒప్పుగా చి...

Existence of God

నీకు నువ్వే దేవుడివి అని అనుకొనుము. ఈ జగత్తు సృష్టి కర్తవు నీవే అనుకో. సకల లోకంలోని కార్యములకు అధిపతివి నీవై, నీ అదుపులో, నీ ఆదేశానుసారం నడుస్తుంది అనుకో. ఇప్పుడు ధ్యానం చెయ్యి. నీవు అధిపతిగా ఉన్న లోకంలోని కార్యక్రమములను ఒక్క క్షణం లేదా కొన్ని క్షణాలు ఆపే ప్రయత్నము చెయ్యగలవు. తరువాత వడిగా కదిలించే ప్రయత్నము చెయ్యగలవు. తదుపరి నీవు ఆశక్తుడవు అని తెలుసుకుంటావు. ఈ వ్యవస్థ వేరేవారి ఆధీనంలో నడుస్తుందని గ్రహించి లోకానికి తెలియజేయుదువు. నీ వల్ల సాధ్యపడదు అని తెలుసుకొని అంగీకారానికి వచ్చి ఒప్పుకుంటావు. తరువాత ఇట్టి కార్యము ఒకరి చేతిలో ఉంది అని నీవు గ్రహిస్తావు. ఈ సకల చరాచర వ్యవస్థ మొత్తం ఒకరి ఆధీనంలో వారి ఆదేశానుసారం నడుస్తుందని గ్రహించి నీవు వేరేవారికి చెప్పే ప్రయత్నము చేస్తావు. ఆ ఒకరికి పరమాత్మ, పరబ్రహ్మ అని నామకరణం చేస్తావు. ఒక లెక్కను నీవు సాధన చేయునపుడు LHS=RHS గా తీసుకొని ముందుగా RHS తీసుకొని అది నిజము అని భావించి చివరకు నువ్వు అనుకున్నది తప్పుగా నిర్దారణ చేస్తావు. తరువాత వారిచ్చింది నిజము అని రూఢీ చేయుదువు. అదేవిధముగా నువ్వే దేవుడివి అన్న వాక్యము అసత్యమై దేవుడే దేవుడు అని ఋజువు అగును.

Nothing waste (useless) in this world.

Is duniya me bekhaar ki cheej koi nahi hoti. ఈ విశ్వంలో,ప్రపంచములో పనికిరాని లేదా ఉపయోగకారి కాని వస్తువు అంటూ ఏది లేదా ఏమి ఉండదు. ఈ సృష్టిలో లేదా ప్రపంచములో ఏ క్రొత్త పదార్థమును సృష్టించలేము లేదా నాశనము చేయలేము, ఒక దాని నుండి ఇంకొక పదార్థముగా మాత్రమే అది రూపాంతరము చెందుతుంది. అట్లు మాత్రమే మనందరం చేయగలం.  అట్టి వస్తువును ఇంకా effective గా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి,తెల్సుకోవాలి.అనగా ఉపయోగించుకోవడం మనకు తెలిసి ఉండక పోవచ్చు. కావుననే మనం ఉపయోగపడని వస్తువుగా ప్రక్కకు పెట్టి పెడతాము. కొన్ని సందర్భాలలో దానిని అమ్ముతాము, అమ్మడము వీలుకానప్పుడు ఉచితముగా చెత్త తీసుకపోయే వారికి ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు పేపర్, బీరు సీసాలు, electronic మరియు electrical పరికరాలు.  అతను దానిని Re processing చేసే వారికి అమ్మి డబ్బును పొందుతాడు. ఒకరికి ఉపయోగపడని, లాభం లేని వస్తువు ఇంకొకరికి ఉపయోగపడవచ్చు లేదా లాభం లేదా ప్రయోజనం కల్పించవచ్చు. దీనిలో నిగూఢమైన Economics, Financial Management ,income,expenditure, saving మొదలగు అనేక ఆర్థిక అంశాలు లోతుగా దాగి ఉన్నాయి అని నా అభిప్రాయం. ఏమిలేని నిరుపేద కూడా ఈ సూత్ర...

Humanity is depriving

Humanity.మానవత్వం. ఇది రోజు రోజుకు క్షీణించి నశిస్తున్నది. దీని విశిష్ఠత ఎంత చెప్పిన తక్కువే. మనిషి క్రిందపడిన, అపస్మారక స్థితిలో ఉన్నా, చనిపోయినా చూసే సమయం ఎవ్వరికి లేదు, చనిపోయే పరిస్థితిలో ఉన్నవారికి హాస్పిటల్ కు తీసుకపోయే సమయం ఎవ్వరికి లేదు అని వారు భావించి సహాయం చేయుటకు ముందుకురారు. పెద్దపల్లి ఆటోడ్రైవర్ చాలా బాగా చెప్పాడు, నాకు చాలా నచ్చాడు. తరువాత కూడా అదే ఆటోలో మా అమ్మగారితో ప్రయాణం చేయడం జరిగింది. అందరూ ఎడమవైపుకు ఆపితే అతను ముందుకు తీసుకువెళ్లి కుడివైపు ఆపాలా అని అడిగి కుడివైపు తీసుకొనిపొయ్యి ఆపాడు. ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి, మంచివారు ఉన్నారు. వారితోనే ఈ ప్రపంచము సస్యశ్యామలంగా ఉంది అని నా భావన. చదువు కాదు గుణము ముఖ్యము. ఇది డబ్బులతో రాదు, కొనలేము. జీవితంలో దిగజారవద్దు. నేను అతని నుండి నాకు ఇదివరకు ఉన్న అభిప్రాయాలను reinforced concrete చేసుకున్నాను. 

Learning is a continuous process which doesn't have the END.

నాకు వచ్చు,తెలుసు, నాకే వచ్చు, నాకే తెలుసు, నా అంతటి వాడు లేడు అని విర్రవీగిన వారి కథలు మీ అందరికి తెలుసు. వారు అందరూ కాలగర్భంలో ఎలా కలిసిపోయినారో. కావున మన అందరికి తెలిసిన సత్యము అయిన తెల్సింది గోరంత, తెల్సుకోవాల్సింది లేదా తెలువాల్సింది కొండంత అను వాస్తవమును జీవిత చరమాంకం వరకు మరువరాదు.

Presence of God

దేవుడిని తనలో చూడలేడు, ప్రక్కనున్న వారిలో చూడలేడు. నీలో దేవుడు ఉన్నప్పుడు అతనిలో కూడా దేవుడు ఉంటాడు. అది నీవు గుర్తించగల్గాలి. ఎంతటి నీచమైన, చండాలుని లోనైనా దేవుడు నిలువ ఉంటాడు. అది నీవు చూడగల్గాలి. ఎందుకనగా వారు కూడా దైవము చేత తయారు చేయబడి, పంపబడినవారు. దైవ అంశులు. ప్రతీ మనిషిలో, ప్రతీ object లో దేవుణ్ణి చూడ గల్గిన రోజు నీకు దైవ శక్తి అందుతుంది. అదియే నీకు పరీక్ష. అప్పుడే నీవు మానవునివి మహానీయునివి మరియు యోగివి అవుదువు. దీనికి ఎన్ని రెట్లో నిర్వచించలేని స్థితిలో ఉన్న మనము ఆ కరుణాసముద్రుడిని వేడుకొనుటయే భక్తి, అది తెల్సిన నాడు ముక్తికి దారి తెలవడం, ఆ దారిచివరకు  చేరుకోవడం ముక్తి కల్గడం, అదియే ఉన్న జన్మకు విముక్తి మరియు తరువాత జన్మ ఉండదు. దానినే జన్మ రహితం అంటారు. మోక్షము అని కూడా అంటారు. మానవ ఆత్మ వెళ్లి పరమాత్మను చేరుకోవడం లేదా లీనమవడం. ఆత్మ ఉండదు కావున తిరిగి జన్మ ఉండదు. కావున కర్మ ఉండదు, కష్ట,సుఖములు మరియు పాప,పుణ్యములు ఉండవు లేదా ఉత్పన్నము కావు. జీవుడు లేడు, జీవి లేదు.

Godess on the Earth, Mother.

మాతుహు. Mother, Mummy,అమ్మ,తల్లి. జీవితంలో తల్లిని మించిన దైవం, అంతకు మించిన దగ్గరి చుట్టం లేదా బంధువు లేరు. నీకు సదా వందనం. ఏమిచ్చినా నీ ఋణం ఈ జన్మకు కాని ఏ జన్మకు కాని తీర్చికోలేను. ఏమిచ్చినా నీ రుణం తీర్చికోలేను. నీ తరువాత స్థానమే ఎవరికైనా. తరువాత స్థానం తండ్రిది. వీరే ప్రత్యక్ష దేవుళ్ళు ఆ సంతానానికి. అలాంటి వీరి ప్రేమ దూరమైతే దొరకదు. దీనిని డబ్బుతో కొనలేము. అంగడిలో దొరికేది కాదు. ఇది దూరమైన వారి బాధ వర్ణించలేము, చాలా అతి దురదృష్ట వంతులుగా చెప్పవచ్చు లేదా పేర్కొనవచ్చు. వారి దీవెనలు దైవ దీవెనలు. కావున వారి ఉపస్థితి మన జీవితంలో అమూల్యం, అజారామరం, అతిమధురం, మరపురానిది, మరువ లేనిది. వెలకట్టుటకు సాధ్యం కానిది. వెల కట్టే సాహసం అసలే చేయవద్దు. ఎంత జీవితంలో వీలైతే వారితో గడిపే విధముగా చూసుకోవాలి. వారి చల్లని నీడలో సేద తీరి విశ్రమించాలి. ఆ రుణం ఏమి చేసిన ఎన్ని జన్మలైనా తీర్చుకోవడం కష్టసాధ్యం. వారితో ప్రేమతో, మర్యాదగా నడుచుకుందాం. వారిని సదా స్మరించుకుందాం. వారి అడుగుజాడల్లో నడిచి ఆదర్శంగా నిలుద్దాం. ఈ భూమి మీద ఉన్న ప్రత్యేక్ష దైవం, అమ్మవారు కన్న తల్లి అమ్మ. Godess on the earth is nothing but...

My experience and message especially for Students and Youth

నేను చెప్పేది చాలా మందికి ముఖ్యముగా విద్యార్థులకు మరియు యువత గురించి. మీరు ఉదయం నిద్రలేచే సమయం కంటే 1 గంట ముందు లేవండి. మీ కార్యాచరణ ప్రారంభించండి. మీ దైనందిన జీవితాన్ని కొనసాగించండి. చదువుకునే వారికి కూడా అనుకూలమైన సమయం అవుతుంది. మెదడు fresh గా ఉండి చదివింది తొందరగా అర్థం అయ్యి ఎక్కువ కాలం గుర్తు పెట్టుకునేలాగా ఉంటుంది. అందుకే మన పెద్దలు బ్రహ్మి ముహూర్తంలో ఉదయం లేవమని చెప్తారు. సుమారుగా 4.00 నుండి 4.45 వరకు.  ఒక సామాన్య సాధారణ సూత్రము. మనం తొందరగా ఏ పనైనా చేసుటకు మొగ్గు చూపిస్తున్నాము అంటే అది మనకు క్షేమదాయకం మరియు లాభదాయకం కాదు. అటువంటిది మనం తొందరగా కార్యోన్ముఖులం కావడం లేదు అంటే అది మనకు క్షేమదాయకం మరియు లాభదాయకం అవుతుంది. దీనికి ఉదాహరణగా నిద్రలేవడంనే తీసుకోండి. మీరు ఏ పనికి ఉపక్రమించే ముందు అయినా 1నుండి3 నిమిషాలు ఆలోచించి ఇది క్షేమదాయకం అవునా కాదా అని మీకు మీరే ప్రశ్న వేసుకోండి లేదా ఉత్పన్నం చేసుకోండి. మీకే జవాబు వస్తుంది. దానికి అనుగుణముగా ముందుకు వెళ్ళండి. ఏ పని చేసిన ముందు వెనుక ఆలోచించండి. తొందరపడవద్దు. ఉరుకులాడి మనం సాధించేది ఏమి లేదు. నిధానమే ప్రధానం. దీనివల్ల మన జీవితం...

Whether that day arrives or comes

నా ఆలోచన, మనసు ఎప్పుడు, ఎల్లప్పుడు తిండి దొరకక అలమటించేవారి గురించి మరియు అకస్మాత్తుగా, ఆయుష్షు కు ముందే అర్ధాయుర్దాయం తో చనిపోయేవారి గురించి , వారి జీవితాలలో వెలుగు వచ్చేంత వరకు వారి చుట్టూ తిరుగుతుంది. వారు ఏమి తప్పు చేశారు, ఏమి పాపం చేశారు.  శ్రద్ధ, జ్ఞానము,మోక్షము. తేజస్సు. ఇది జీవితం మంచి బాటలో నడవడానికి దోహదం చేస్తాయి. మనస్సు కు ఏదైనా కావాలనిపించింది. అది పొందడం తప్పు కాదు. కాని అది ఏ మార్గంలో పొందినావో ముఖ్యం, అది ధర్మానికి అనుగుణముగా ఉండాలి. అది చాలు. అధర్మంగా ఉండరాదు. ధర్మం అనే భీమా ఉంటే జీవితం బాగుండును, నీకు ధీమా ఉండును. మామూలు భీమా చేస్తే నీ జీవితం తరువాత నీకు కావాల్సిన వారికి ఉపయోగపడుతుంది.  రవి కాంచని చోటు కవి గాంచును. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారు అని మీకు తెలుసు. అర్ధరాత్రి మహిళ ఒంటరిగా తిరుగ కల్గిన రోజు ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని చెప్పారు. ఈ రోజటికి అట్టి పరిస్థితి లేదు. దీని వైఫల్యానికి ఎవరు కారణం మీరే చెప్పాలి. ఈ రోజు ఇంకా ఎన్ని ఈ విధముగా సమస్యలు ఉన్నాయి. ఒక్కసారి చూడండి. నడి రోడ్డుపై 2000 రూపాయల కట్ట 1లక్ష ర...

Deep Sorrow (శోకము)

శోకము, దుఃఖము.ఇది శత్రువు తో సమానం.  దీనిని దరి చేరనియ్యరాదు. దగ్గరికి రానివ్వద్దు. దీనికి  వశుడైనవాడు సర్వ నాశనం చెందుతాడు. పతనం చెందుతాడు. ఎంతటి ఘోర కృత్యమైన చేయుటకు ఒడిగడతాడు. నీచ, నికృష్టమైన కార్యాలు చేస్తాడు. కోపానికి వశుడై విచక్షణ కోల్పోయి పాప కార్యాలకు పూనుకుంటాడు. ముందు, వెనుక ఆలోచించడు, చూడడు. మహాపాపాలు వస్తాయి. ఎంత తప్పు అయినా చేస్తాడు. చంపేస్తాను అని లేదా చచ్చిపోతాను అని కోపానికి వశుడై అంటాడు. పాపి చిరాయువు. శరీరం సుఖ, దుఃఖములను అనుభవించుటకు ఉపకరణం. శరీరం తనంతట తానే నశించిపోవాలి లేదా క్షయం కావాలి. విస్తరాకు వలే శరీరం.దానిని జాగ్రత్తగా పుల్లలతో కుట్టి, శుభ్రము చేసి భుజించిన పిమ్మట బయట పడవేస్తాము. అదేవిధముగా మన శరీరం. ఆత్మ హత్య మహాపాపం. అందుకే తన కోపమె తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దాయచుట్టంబౌ. తన సంతోషమే స్వర్గం. అని మహానుభావులు సుమతి శతకంలో ఎంతో అద్భుతముగా సరళమైన పదాలతో చక్కగా వివరించారు కదా!వైరాగ్యానికి నిదర్శనంగా  గాలిని/వాయువును చెప్తారు. మల్లెపూలు,చచ్చిన కళేబరము రెండింటి నుండి ప్రసరించును, ప్రయాణించును. వాయువుకు ఎట్టి తేడా లేదు. అన్నిటి యందు సమానముగా ప్ర...

Name and title of the Writings

శతక వ్యాసాల సంపుటి సంకలనం.( ప్రపంచ సంక్షేమం, లోక కళ్యాణం కాంక్షించి). శతక నగ్న సత్యాలు, అనుభవ సత్యాలు, శత సత్యానుభవాలు. శ్రీ రాధా కిరణ్ శాస్త్రులు, గులుకోట ,మంథని,భారతదేశం.

Your positiveness is Punya

రామో విగ్రహవాన్ ధర్మః. అనగా మనసు లోపల ఏది ఉంటే అది బయటికి వ్యక్తం చేయగల్గడం. లోపల ఏది అనుకుంటే అదే బయటకు చెప్పడం మరియు చేయడం. బయటికి ఏది వ్యక్తము చేయగల్గుతున్నామో అది హృదయం లోపల ఉండడం. మనసు శుచి. మనసు శుద్ధం. సత్యము ఎల్లప్పుడు సత్యమే. ఓకేలాగ ఉంటుంది. కాని ధర్మం మారుతూ ఉంటుంది. మనిషి ఒకరే. ఆ సందర్భమును బట్టి, పరిస్థితిని బట్టి మారుతుంది. చనిపోయే మనిషి హాస్పిటల్ కు తీసుకొని వెళ్లిన తదుపరి కూడా కొద్ది క్షణాలలో మరనిస్తారని ఖచ్చితముగా ముందే తెలిస్తే ఇంట్లోనే ఉంచడం ధర్మం. కావాల్సిన వాళ్ళందరూ దగ్గరే ఉంటారు. చనిపోయేవారు కూడా అదే అనగా ఇంటి వద్ద ఉండాలి అని కోరాలి. -, 0 , + . Like Electron , Neutron , Proton.మన ఇంద్రియాలకు కలిగే ఇబ్బంది/ కష్టమే పాపం మన ఇంద్రియాలకు కలిగే సుఖం/ఆనందమే పుణ్యం. లౌక్యమును నేర్చుకున్నాడు మానవుడు. అతనికి ఇష్టం కాకున్నా ఎదుటి వ్యక్తి మనసును నొప్పించకపోవడం. దీని వలన ఇద్దరు happy. ఇది positive. నష్టం లేదు, కష్టం లేదు. నొప్పించని మనిషి good quality/ sacrifise nature క్రిందకు వస్తుంది.  నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. అంతే అంతరాత్మకు సంతృప్తి కలి...

Time is valuable which you can't bring back.

వయస్సు పెరుగుతున్నందుకు సొంతోషపడ్తావా, లేదా దుఃఖితుడవైతావా. ఎందుకంటే అందరూ పుట్టినరోజు పండుగలా చేసుకుంటారు వారి వారి స్థాయి,స్థోమతను బట్టి. కాని మన అందరికి తెలిసిన సత్యము ఏమంటే మనకు ఈ దేవుడు ఇచ్చిన అమూల్యమైన జీవితంలో 1 సంవత్సరం వెళ్లిపోయినది. అది తిరిగి రాదు, తిరిగి తెచ్చుకోలేము. మిగిలిన అన్నీ సంవత్సరములను మనం త్యాగం చేయడానికి సిద్ధపడినప్పటికిని కూడా 1సంవత్సరం కాదు గడిచిన 1 రోజును కూడా తిరిగి పొందలేము లేదా తీసుకురాలేము. ఇది పున్నమి జాబిలి వాలే, కాలుతున్న క్రొవ్వొత్తి వలే క్షయం అవుతూ వస్తుంది. ఇది కాలం, సమయం గొప్పతనం. ఇది సాక్షాత్తు పరమేశ్వరుని లీల లేదా మాయ అనవచ్చు. ఇంతటి విశిష్టమైన కాలం లేదా సమయమును మనం ఎలా వెచ్చించాలి, ఖర్చు చేయాలి ( ఎందుకనగా ఇదియే మన ధనాగార, ధాన్యాగార నిధి దీనిని అతి జాగ్రత్తతో ఆచి తూచి ఖర్చు చేయాలి.) అని మనము సుస్పష్టమైన అవగాహనాతో ఉండాలి. 

Our Responsibility

My aim or goal and object is that I should reach and my word should reach 130 crores Public of this Holy Bharat/ India. And next to 770 crores of this world. గుడ్డి ఎద్దు చెనులో పడినట్లు పోరాదు. నీ కంటూ ఒక ఆలోచన, స్థిరమైన దృఢ చిత్తం, అభిప్రాయం తో ముందుకు వెళ్ళాలి. ఇది ఎలా వస్తుంది. చదువు మరియు విజ్ఞానం ద్వారా ఇది వస్తుంది మరియు అందుతుంది. దొంగలు, దొంగలు కలిసి ఊర్లు పంచుకుంటున్న విధముగా ఉంది భారతదేశ పరిస్థితి. చలి,ఎండ మరియు వానలో మన దేశ సైనికులు అహర్నిశలు రాత్రి అనకా పగలు అనకా ఈ పవిత్ర భారతదేశాన్ని మరియు ఇక్కడి గొప్ప ఉన్నత విలువలు కల్గిన ప్రజలను రక్షిస్తున్నారు. కాని ఈ అమాయక సైనికులకు తెలువదు ఈ ప్రజల్లోని కొంతమంది మరికొంత మందిని లూటీచేస్తూ,హరిస్తూ నిర్దయతో భక్షిస్తున్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి వారికి అనుగుణముగా మార్పు చేసుకుంటూ లోపాలు ఉన్నట్లయితే సవరించక వానినే కొనసాగిస్తూ ( వారి దోపిడీకి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి కావున) వారి వారి పబ్బం గడుపుతున్నారు. అనుక్షణం అతని ఉనికి స్వలాభం గురించి ఎదుటి వారిని మోసం చేస్తున్నారు. ఇదియే పునరావృతం అవుతున్నది. భారతీయ పౌరులందరు ఐకమత్యంతో సంఘటిత...

Voter is God

ఓటు హక్కు వినియోగింపజేసి ఆ తరువాత అతని విలువ, ప్రాధాన్యం తగ్గించి పబ్బం గడుపుకునే విష వ్యవస్థ, సంస్కృతి నడుస్తున్నది, అదియే దాపురించింది. 5 సంవత్సరాలు పాలించే నాయకుడు ప్రతీరోజు ఓటరును తలచుకుంటూ బ్రతికే విధముగా వ్యవస్థను బలోపితం చేయాలి. తరువాత ఈ 5 సంవత్సరములలో ఏ రోజాయినా పదవి పోవునట్లు జాగ్రత్తగా ఉండే విధముగా వారికి ఆ భీతి కలుగునట్లు చట్ట సవరణలు చేయబడాలి. అలాంటి కట్టుదిట్టమైన ప్రజల వ్యవస్థ రావాలి. అందరూ ప్రజా సంక్షేమం అంటూనే ప్రజలకు గుండు చేయించి కుచ్చు టోపీ పెడుతున్నారు. ప్రజా సంక్షేమంలో ఫలాలు ప్రతీ ఇంటికి ప్రతీ పౌరనికి అందేవిధముగా ఉండాలి మరియు వాటిని తయారు చేసినప్పుడు అది సమాజంలోని ఏ కొందరికో కాకుండా అన్నీ వర్గాలవారు లబ్ది పొందే విధముగా కసరత్తు జరపాలి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం నిలుస్తుంది. గెలిచిన నాయకుడు ఓటు వేసిన ఓటరుకు appointment ఇవ్వడం లేదు. ఇంతటి విషమ పరిస్థితి సమాజంలో ఏర్పడింది. కావున ఓటరు మహాశయులారా ఎన్నోవిధాలుగా మోసపోయినా, ఇకనైనా మేల్కొనండి. లేనట్లయితే మన శరీరంలో ఏ అవయవాలు ఉపయోగపడతాయో అవి అమ్ముకునే పరిస్థితి దాపురిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఓటర్ దేవునితో సమానం.

My mother is Goddess for me.

హిందూ ధర్మం. ఒక రోజు నేను, మా అమ్మ గారు ఏమి పని లేక మామూలుగా ఉంటిమి. మా అమ్మగారు ఎక్కువగా బయట ప్రపంచములో తిరుగకుండా, ఇంటిపట్టుననే ఎక్కువగా ఉందురు. వారు మిక్కిలి అమాయకులు. దైవ చింతన కలవారు. అట్టి సందర్భములో  ఆ రోజు నేను మా అమ్మగారిని గమనించినప్పుడు మా నాన్నగారి ఫోటోపై పడిన దుమ్మును ఒక కాగితం ప్రక్కనుండగా దానిని తీసుకొని దాని సహాయంతో ఆ ఫోటోను శుభ్రపరుస్తుండడం నేను చూసాను. వారికి గల ప్రేమ మనకు ఈ విధముగ గోచరించు చున్నది.

God is everything

దేవుని అపార లీలామృతం. ఇక్కడ అమృతం అనగా దేవుడు అధర్ములను శిక్షిస్తూ ధర్మాత్ములను కాపాడడంలో అతనికి సాటి ఎవ్వరూలేరు. సకల ప్రాణికోటికి ఆధారం అతనే. ఈ విశాల విశ్వం/ ప్రపంచం ఏ ఒక్కరి గురించి ఆగదు. ఈ ప్రపంచములో ప్రస్తుతం ఉనికిగా ఉన్నవి అవి అన్నియు దేవుని సృష్టి అని నమ్మి, దేవుడిని నమ్మి, ఆ దేవుడు సృష్టించిన మానవుని తోటి/ఇతర మానవులను మాత్రం నమ్మరు. ఇది లోకం యొక్క విచిత్ర స్థితి మరియు పరిస్థితి. లోకం పోకడ.

Shastra is nothing but Order of God.

శాస్త్రం అనగా దేవుని ఆజ్ఞ. ఇలా/అలా చేయాలి. దానికి పద్ధతి. స్వరూప ప్రయుక్తములు. Living with the nature. Surrender to God. సాధనములు ఏవి దైవానుగ్రహమును కలుగచేయవు. ఈ సమయంలో ఎప్పుడైనా అనుగ్రహం కల్గె అవకాశం ఉంటుంది లేకపోతే ఉండదు. సాధన చేయటం మాత్రం ఆపొద్దు. Train ఎప్పుడు వస్తుంది మన చేతిలో లేదు కాని red light ద్వారా ఆపవచ్చు, Green light ద్వారా దానిని ఆగకుండా పంపవచ్చు. అంత మాత్రమే. దేవుని అనుగ్రహం కూడా అంతే. అత్యంత అచంచలమైన నమ్మకం, విశ్వాసం కలగాలి, ఉండాలి. దానికై ప్రయత్నముతో కూడిన సాధన చేయాలి. ఎన్నో కష్ట నష్టాలకు సిద్ధమై ఓర్చుకోవాలి. అప్పుడు బుద్ధి,జ్ఞానం సిద్ధిస్తుంది.

I feel happy

నేను పోని, వేళ్ళని మరియు పోలేని,వెళ్లలేని మరియు స్పృశించనివి ఎవరైనా తెలుసుకొని, వెళ్లి ఈ ప్రజల సంక్షేమానికి కృషి చేసినట్లయితే మొదటగా సంతోషించేవాడిని నేనే.

Experiences while writing the Book

నా పుస్తక రచన అనుభవాలు. ఎన్నో ఎన్నెన్నో విచిత్ర మరపురాని సంఘటనలు జరిగినవి. దేవుని కృపతో ముందుకు వెళ్లి సాధించాను. అతనే నడిపించింది. నాకు స్ఫూర్తి కావ్యకంఠ గణపతి మహాముని. 108 అమ్మవారి పద్యాలు రచించారు. శ్రీ ప్రవచన వాచస్పతి డా// ఛాగంటి కోటేశ్వరరావు గారికి వారి ప్రవచనాలు నన్ను చేరిన కారణముగా వారికి నమస్సులతో కూడిన కృతజ్ఞతలు, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి గారు, శ్రీ గరికపాటి నరసింహారావు గార్లకు కృతజ్ఞతలు. సరస్వతి అమ్మవారి కృప ఎలా ఉంటుంది. నేను చదువుత లేను కదా అని నాకు నేను వేసుకున్న ప్రశ్న. అమ్మవారు వీణా పుస్తక దారిణి. నేను ఒక పుస్తకము వ్రాయునట్లు చేయుచున్నది ఈ అమ్మవారు కాదా! ఇది అమ్మవారి కృప మరియు కరుణ కాదా. ముమ్మాటికీ అమ్మవారి భిక్ష. ఎవరైనా అత్యంత భక్తి, విశ్వాసములతో, అత్యంత నమ్మకంతో ( నీ పైన నీకు నమ్మకం ఉండాలి అది సన్నగిల్లుతున్న రోజు నువ్వు మరణంనకు దగ్గర అవుతున్నట్లు) ఈ పని నేను చేస్తాను అని త్రికరణ శుద్ధిగా తలచినట్లైతే దేవుడు కూడా నీకు అండగా ఉండి నీ పనికి ముందు ఈ లోకం నుండి తీసుకొని వెళ్ళడు, భయము వ్యక్తము చేస్తారు, అట్టి పని పూర్తి కావడానికి పంచభూతములు సహాయం చేస్తాయి. జీ...

Work is God

వెన్నంటుకోగానే కన్నంటుకోవడం అదృష్టం. నిద్రావస్థ. మనసు ఎప్పుడు మేల్కొని ఉండును. గాఢ నిద్రలో అది కూడా సెదతీరి నిద్రించును. ఇది ఒక మహత్తర ప్రక్రియ. చాలా విచిత్రం. సమాధి స్థితి అని కూడా అనవచ్చు. శ్వాస లేనిచో శరీరం శవంతో సమానం. అనగా బ్రతకడానికి, చనిపోవడానికి మధ్య ఉన్న స్థితిగా చెప్పుకోవచ్చును. అందుకే రేపటికి రూపం లేదు అంటారు. మరు క్షణంలో ఏమి జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. అన్ని అవస్థలలోకన్నా ఇది ప్రత్యేకం. సదా పనిలో నిమగ్నమై అనుక్షణం తీరిక లేకుండా positive work తో ఉండేవారు,గడిపేవారు అదృష్టవంతులు. అది వారికి వరం. అదే వారికి శ్రేయస్సు. వారు ఆ పని ద్వారా నలుగురికి సేవ చేసి వారు బాగు పడినట్లైతే వారి జన్మ ధన్యము. వారు కృతార్థులు. చరిత్రలో నిలిచెదరు. కీర్తి కల్గి ఉందురు. వారు ఎదుటి వారికి ఆదర్శం. ప్రతి ఒక్కరు ఈ విధముగా జీవితం గడిపే ప్రయత్నము చేయవలెను.

Prime object is the Welfare of Public

నాలో ఎన్నో ఆలోచనలు,భావనలు,కోణాలు,ఆధ్యాత్మిక దొంతరలు, తరంగాలు, పరివర్తనలు. నాలో అఘాతం, బడబాగ్ని, లావా ఇలా నాకు తెలువకనే చాలా ఉన్నాయి. మంచి,చెడు ల కలయికనే మన అంతరంగము. నా లోని చెడు నాతో ఉండిపోని, ఇది శరీరం నశించిపోయినప్పుడు ఇట్టి ఆలోచనలు కూడా నశించిపోని, నాలో ఉన్న ఈ కొద్ది సమాజంకు పనికివచ్చే మంచి బహిర్గతమై సమాజంలోని ప్రజలకు చేరి వారికి మంచి కలుగాలనే నా ఈ చిరు ప్రయత్నము. మీ శ్రీ రాధ కిరణ్ శాస్త్రులు గులుకోట, మంథని, భారతదేశం. సర్వే జానా సుఖినోభావంతు, లోకా సమస్త సుఖినోభావంతు, ఓం శాంతి శాంతి శాంతిః || 

My feelings

నాలోని ఈ భావనలు మరి ఈ సమాజంకు పనికి వస్తాయా లేదా, నాలో నేను దాచుకోలేను. నాకు భయం, భీతి లేదు. ఎలాంటి పర్యవసానానికైనా నేను సిద్ధమే. అందరూ నలుగురితో నారాయణ అంటే పోలా, ఎందుకు వచ్చిన తిప్పలు, గొడవలు అని అనుకుంటారు. నా అభిమతం అలా కాదు. నేను అలా కూర్చోలేను. నా భావనలు సరియైనవా, తప్పా అని నేను తప్పకుండా తెల్సుకోవాలనుకుంటాను. నేను చెప్పేవాటికి సమాజం నుండి positive response వస్తే ఇంకా ప్రయత్నము చేస్తాను. మన దేశంలో భావ ప్రకటన స్వాతంత్ర్య హక్కు ఉంది, దానిని ఎవ్వరూ ఎందుకు పట్టించుకోరు, ఉపయోగించుకోరు అని నా అభిప్రాయం. సమాజంలో జరుగుతున్న మంచి,చెడు మరియు తప్పు ఒప్పుల మీద ఒక రెండు మాటలు మాట్లాడరు. సమాజ అభివృద్ధి,శ్రేయస్సు గురించి పాటు పడరు. అందరూ ఇలాగే అనుకుంటే దేశ భవిష్యత్తు పరిస్థితి ఏమిటి. ఇది నాకెందుకు అనుకుంటారా మీరు? ఓటు వేసి నాయకుని ఎన్నుకోగానే మీ బాధ్యత అయిపోదు. అతను సమాజం అభివృద్ధికి పాటు పడుతూ అతని విధిని సరిగా నిర్వహిస్తున్నాడా లేదా చూసి లేనట్లయితే అతనికి గుర్తు తెచ్చి నిలదీయాలి. అతన్ని ప్రశ్నించే గళం మీరు కావాలి. అప్పుడే ఈ దేశం ముందుకు పోతుంది.

కర్తవ్యమే దేవుడు

ఈ లోకంలో, ప్రపంచములో ఎందరో గురువులు, విద్యావంతులు,మేధావులు, గొప్పవారు. వారందరికి నా నమో సుమాంజలులు. గురువును మించిన దేవుడు లేడు అంటారు. గురువు యొక్క స్థితి అంతటి గొప్పది. అయితే నా పని నాదే. నా కర్తవ్యం నా దేవుడు. దేవుడు నాకు ఉపక్రమించిన పని నేను చేస్తున్నాను. ఇదియే నా ధర్మం, విశ్వాసం. నేను చేయ కల్గిన, నాకు వచ్చిన పని ఇదియే. నాకు కేటాయించబడిన పని కూడా ఇదియే అని నా ఆత్మసాక్షి చెప్పుతున్నది. నేను నలుగురి ప్రకారం yనడుస్తున్నాను ఈ సమాజంలో. కోటి విద్యలు కూటి కొరకు. అదేవిధముగా నాకు వచ్చిన విద్యతో జీవనభృతి సాగిస్తున్నాను. పరివర్తనయే నా ఆయుధం, ఇది నాకు అత్యంత ప్రీతిపాత్రము. ఈ పరివర్తన సదా దేవుని అనుగ్రహముకై నా ప్రయత్నము సాగును. నేను ప్రకృతి ప్రేమికున్ని. ప్రకృతి అంటే నాకు అమితమైన ఇష్టం. ఇలాంటి ప్రకృతికి కారణ భూతుడు, సృష్టికర్త అంటే ఇష్టం ఉండకుండా ఎలా ఉంటాను. అంతా ఆ పరమేశ్వర ప్రసాదం. దేవుని కృప వల్ల నా సంకల్పము నన్ను ముందుకు తీసుకుపోయి కృత కృత్యున్ని చేయును. ఇదియే నాకు దేవునిపై ఉన్న అత్యంత అచంచలమైన నమ్మకం. నేను నిమిత్త మాత్రుడను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.

If God asks you What you want?

భగవంతుని ప్రార్థన నీ ప్రేమ,కృపా సదా నాపై ప్రసారింపజేయుము అని వేడుకోవాలి. సత్ బుద్దిని కల్గించమని కోరాలి. నాచే దానం అగునట్లు చూడమని ప్రార్థించాలి. జీవిత చరమాంకం వరకు సత్యము,ధర్మము ప్రకారం నడుచునట్లు ఉండేవిధముగా చూడాలని ప్రార్థించాలి.

Great personality

అత్యంత గొప్ప వ్యక్తి. దేవుడు వచ్చి పదా వెళదాం, నాతో వచ్చెయ్, నీ శరీరమును వదిలిపెట్టి తక్షణమే అని అనినంతనే హుటాలునా దేవుని వెంట వెంటనే ఎట్టి ఆలస్యము చేయక ఒక వర ప్రసాదం లెక్క స్వీకరించి దేవునితో వెళ్లేవారు. ఇక్కడ దేవుని ప్రశ్నలు అడగటం అప్రస్తుతం, అది పద్ధతి కాదు. ఎక్కడికి,ఎందుకు,నేనే ఎందుకు అని మూర్ఖులు అడుగుతారు. ఎందుకనగా సాక్షాత్తు దేవుడే దిగివచ్చి రమ్మన్నప్పుడే నీ యోగ్యత బయటపడింది కావున నీకు ఉండవల్సినది అచంచలమైన విశ్వాసం,నమ్మకం మరియు భక్తి,ప్రేమ, శ్రద్ధలు. మోసం చేయుటకు,అసత్యాలు చెప్పుటకు అంతము ఉండదు. అది కొనసాగుతూనే వుంటుంది.

Country's Wealth is equal to be distributed among all country men.

ఏది చెప్పిన, ఏది ఆచరించిన మానవ జీవన గమనం గురించి దాని మంచి గురించి, సఫలత గురించి. It should end in plus. మారాల్సినవి మనిషా, వ్యవస్థయా, లేక రెండా. మార్పు ఏ విషయంలో, ఏ దిశగా, ఎందుకోసం, దీనికి ఎవరు పూనుకోవాలి. అసలు సాధ్యమవుతుందా, మరి నీ కర్తవ్యం ఏమి, మారిన తరువాత ఏమి గోచరించును, అగును, ఏవిధముగా లాభం. వీటన్నింటికి జవాబులతో కార్యాచరణ సిద్ధం చేసుకొని అందరు కలిసి సంఘటితముగా ఒక శక్తి వలే ముందుకు కదిలి సాధించాలి. నవ భారత నిర్మాణం చేయాలి. అందరి సంక్షేమం కల సాకారం కావాలి. మన నినాదం మన మందరము ఒక్కటి, మన అందరి సంక్షేమం మనకు ముఖ్యం. అది ఏ ఒక్కరి సొత్తు కాదు, అందరి సొత్తు. దేశ సంపద యావత్తు దేశ ప్రజలందరి హక్కు. ఇది అందరికి సమానంగా చెందాలి మరియు పంచబడాలి. దీనిలో ఎక్కువ, తక్కువలు వద్దు, తేడాలు వద్దు. ఇదియే మన అందరి ప్రముఖ,ప్రథమ ఉద్దేశ్యం

Soul is eternal

శాశ్వతం ఆత్మ, దేవుడు, అశాశ్వతం శరీరం. దెయ్యం, భూతం. ఇది 5 భూతములతో ఏర్పడినది, చివరికి దానిలో కలిసిపోవును. మానవులందరు పుట్టిన తరువాత గిట్టే వరకు ఏమి చేస్తున్నారు, వారికి నచ్చిన విధముగా ఇష్టమైన ప్రకారం జీవించే ప్రయత్నము చేస్తున్నారు, వారు చేసే పని వారు ఎరిగి చేస్తున్నారు. తప్పు చేసినా కావాలని, ఇష్టపడి, చెయ్యాలి అని తీర్మానించుకున్న తరువాత చేస్తున్నారు. 

Nothing is impossible provided You have burning desire

In this world nothing is impossible. You should have 100% confidence in you. You should know your Strengths and Weaknesses. Try to fight against your Weaknesses. Overcome them by Sadhana. Utilise maximum your resources. Work hard with determination,dedication,Commitment and burning desire Success is after you to hug or to garland you.

Immersion in Bhakti

ఆకళింపు చేసుకోవడం, మునకలు ( Immersion)  వేయడం, ఆస్వాదించడం, అనుభూతిచెందడం, అనుభవించడం, పట్టుకోవడం, నమ్మడం, విశ్వసించడం, మైమరచిపోవడం, భక్తితో నృత్యం చేయడం, పారవశ్యం చెందడం, కృతజ్ఞతతో ప్రవర్తించడం/చూపడం ఈ విధములుగా  భగవంతుని కృపకై ఇవన్నీ దాటి వెళ్ళవలసి ఉంటుంది. ఈ క్షణ భంగురమైన శరీరం మీద వ్యామోహం విడిచిపెట్టిన వాడై ఉండాలి. నిరంతర తపనతో కూడిన సాధన చేస్తూ ఒకే చిత్తముతో ఉండాలి. చిత్తం శివునిమీద భక్తి చెప్పుల మీద. నీవే తప్ప నాకు వేరే ఏ దారి ,గతి లేదు అనే ప్రఘాడ విశ్వాసం ఉండవలెను.  నీవే తప్పని తప్పరాంబెరుగా అన్న పద్యము ప్రకారం.

Voice to raise Question

నాలోని ఈ భావనలు మరి ఈ సమాజంకు పనికి వస్తాయా లేదా, నాలో నేను దాచుకోలేను. నాకు భయం, భీతి లేదు. ఎలాంటి పర్యవసానానికైనా నేను సిద్ధమే. అందరూ నలుగురితో నారాయణ అంటే పోలా, ఎందుకు వచ్చిన తిప్పలు, గొడవలు అని అనుకుంటారు. నా అభిమతం అలా కాదు. నేను అలా కూర్చోలేను. నా భావనలు సరియైనవా, తప్పా అని నేను తప్పకుండా తెల్సుకోవాలనుకుంటాను. నేను చెప్పేవి సమాజం నుండి positive response వస్తే ఇంకా ప్రయత్నము చేస్తాను. మన దేశంలో భావ ప్రకటన స్వాతంత్ర్య హక్కు ఉంది, దానిని ఎవ్వరూ ఎందుకు పట్టించుకోరు, ఉపయోగించుకోరు అని నా అభిప్రాయం. సమాజంలో జరుగుతున్న మంచి,చెడు మరియు తప్పు ఒప్పుల మీద ఒక రెండు మాటలు మాట్లాడరు. సమాజ అభివృద్ధి,శ్రేయస్సు గురించి పాటు పడరు. అందరూ ఇలాగే అనుకుంటే దేశ భవిష్యత్తు పరిస్థితి ఏమిటి. ఇది నాకెందుకు అనుకుంటారా మీరు? ఓటు వేసి నాయకుని ఎన్నుకోగానే మీ బాధ్యత అయిపోదు. అతను సమాజం అభివృద్ధికి పాటు పడుతూ అతని విధిని సరిగా నిర్వహిస్తున్నాడా లేదా చూసి లేనట్లయితే అతనికి గుర్తు తెచ్చి నిలదీయాలి. అతన్ని ప్రశ్నించే గళం మీరు కావాలి. అప్పుడే ఈ దేశం ముందుకు పోతుంది.

What are you learning really?

I came to such a decision that I don't require further any Study because I don't find any suitable and good,quality, application oriented,applicable, result oriented one. Basic function of your education is it should feed you, later it should give knowledge, it should give you what you wish, what you really want or require. Why do you require all nonsense stuff. What is the use of that in your whole/entire life span. What are you really learning? Whether it helped you in any day/ any manner. You need to invest crores of money for your education. Is it required? From Where you or your parents bring this money? Even after is it really helping in the life? Does it is matching financial calculation. Is it giving you back returns in terms of money or livelihood. Or Are you facing any problem for survival of the existence and to settle down or your settlement of life. Is indeed? Then what we are doing really or exactly. The path we chose and going is the right one. Did i meet or app...

Justice is equal to all.

ఏ నిరపరాధికి, అమాయకునికి మరియు ముద్దాయి కాని వారికి శిక్ష అసలే పడ కూడదు. ముద్దాయికి తప్పకుండా శిక్ష పడాలి. తప్పించుకపోవడానికి వీలు ఉండకూడదు. ఈ విధముగా వ్యవస్థలను కట్టుదిట్టం చేయవలెను. న్యాయం జరుగు విషయంలో డబ్బు/పైసల పైరవీల ప్రభావం ఉండకుండా చూడాలి. న్యాయం అందరికి సమానంగా ఉండి అందరికి అందుబాటులో ఉండి అందాలి. బీదవారికి న్యాయం దక్కాలి.

Leaving Values for Power

రాజకీయాలు నైతిక విలువలను కోల్పోతున్నాయి. అధికారం గురించి ఎంతటి వరకైనా దిగజారి పోతున్నారు. హత్య రాజకీయాలకు తెరతీస్తున్నారు. ఎదుటివారిని హత్యచేసి అయినా అధికారం కైవసం చేసుకుంటున్నారు. ఇది దారుణమైన పరిస్థితి మరియు పని. సమాజం దీనిని ముక్తకంఠంతో ఖండించాలి. ప్రజలు జాగరూకులు కావాలి. సమాజంలో జరుగుతున్న మార్పులు, సంఘటనపట్ల మిక్కిలి అప్రమత్తముగా ఉండాలి. దానికి ఎప్పటికప్పుడు ధీటైన సమాధానం చెప్పాలి. చెడు పట్ల సంఘటితమై పోరాడాలి. లేనిచో సమాజ వ్యవస్థలలో తీవ్ర ఇబ్బందులు కలిగి అవి వేరే పరిస్థితికి దారి తీస్తాయి. వ్యవస్థలు బీటలువారి పతనమైపోతాయి. ప్రజాస్వామ్య మూలాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇది అత్యంత ఆందోళనకర మరియు ప్రమాదకరమైన పరిస్థితి. ఇట్టి విషమ పరిస్థితి అత్యవసర పరిస్థితికి ( వెంటనే వైద్యం చేసే దేశ మరియు సమాజ ప్రధాన అతిపెద్ద సమస్య) దారి తీసే అవకాశం ఉంటుంది. కావున ఇట్టివాని విషయంలో ముందే తెరుకోవాలి మరియు నిరోధించాలి.

True disciple

మనకు ఒకతను గురువు. అతనంటే అభిమానం, ఇష్టం, మరియు ప్రేమ. కాల క్రమంలో ఎన్నిటికో లోబడి అతను ఒకటి లేదా కొన్ని తప్పులు చేస్తారు. కాని నేను ఏమంటాను అంటే నేను ఆ పాత పడ్దతిలో మాత్రమే అతనిని ఆరాధిస్తాను, గౌరవిస్తాను. ఎందుకనగా అతని కర్మ అతనికి సంబంధము. నేను అతనిని ఆ రోజు ప్రకారం freeze చేసుకున్నాను. అతని ప్రస్తుతము నాకు అప్రస్తుతము. రేపటి దినము నేను కూడా ఏమైనా తప్పు చేయవచ్చును. మనం మానవ మాత్రులం. తప్పు చేయలేమని చెప్పలేము. కాని తప్పు చేయకుండా మనసును గట్టిగా సంకల్పించుకోవచ్చును. అట్లా తప్పు చేయకుండా ఉండునట్లు ప్రయత్నము చేయవచ్చును. అట్టి నిగ్రహముతో కూడి ఉండి సాధన చేయవచ్చు. నా ప్రక్కకు ఉన్న మూర్ఖుడు ఇది వినడు.  ఒక మనిషికి ఎన్ని తెలువనియ్యండి, అతనికి ఏర్పడవలసిన base, foundation సరిగా లేనట్లయితే వ్యర్థము. సంస్కారం, వినయము,మర్యాద ఇది లేని చదువు కూడా వ్యర్థము, శోభించదు. మీరు double Phd చేశారు. దీనికి సహాయం చేసిన గురువు గారు ఎదురుపడినప్పుడు నమస్కారం సంస్కారం. అది లేనప్పుడు ఆ phd లు వ్యర్థము. మనము ఉన్నచోటికి మనకంటే పెద్దవారైన స్త్రీమూర్తి వచ్చినారు. మనం లేచి వారిని అక్కడ ఉన్న సీటులో కూర్చోండి అని చెప్...

Every aspect of humanbeing depends on KARMA

లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, ఇట్టి లక్ష్యము ధర్మానికి అనుగుణమై సత్యమునకు దగ్గరిదై ఉండాలి. ఇట్టి లక్ష్యం హేతుబద్ధంగా, మరియు నీవు చేరుకోగలిగే, నీ వల్ల అయ్యే, నీ అవధి లోనిదై ఉండాలి. దానికి సంబంధించిన సరియైన ప్రణాళిక రూపొందించుకోవడం లేదా తయారు చేసుకోవడం. తదనుగుణంగా సరియైన ప్రయత్నము చేయడం లేదా కార్యోన్ముఖుడవ్వడం. దాని ఫలితం తో నీకు సంబంధము లేదు. అది పరమాత్మ యందు వదిలుపెట్టుము. నీవు ఇట్టి లక్ష్యము సాధించడంలో విఫలమైనప్పటికిని, నీవు చేసిన ప్రయత్నము కారణముగా ఒక విధమైన తృప్తితో ఉండేదవు. ఈ చేసిన ప్రయత్నము తపస్సు  లాంటిది. కాని నువ్వు విజయం సాధించినట్లైతే నీకు గుర్తింపు,కీర్తి మిగులును. నీవు మిక్కిలి ఆనందముతో ఉండేదవు. ఇదియే పరమానందం. దీని ముందు స్వర్గ సుఖములు కూడా దిగదుడుపే. మనందరం కర్మ సిద్ధాంతము పై ఆధారపడి దానికి లోబడి పని చేస్తున్నాము. అట్టి కర్మలు లేదా పనులు లక్ష్యము నిర్దేశించుకొని చేయునపుడు పైన తెల్పినవి అన్ని దానికి వర్తించును.

Standing on word is the most difficult task.

మనిషి గొప్పతనం.  గొప్పనైనవి. ఆచరణకు/ పాటించటకు అత్యంత కష్టముతో  కూడుకున్నవి.              ఉన్నతమైన ఆలోచన,వ్యక్తిత్వం,నడవడి,కర్మలు(పనులు), నిస్వార్థము, సేవ, దయ,కరుణ. పట్టుదల, దీక్ష, తపన. ధర్మమును, సత్యమును విడవకుండా పట్టుకొని ఉండడం. అన్న మాటపై నిలబడి ఉండడం. జీవితంలో అసాధ్యం అంటూ ఏమీఉండదు, అందుకు మన ప్రయత్నమే ముఖ్యం. Last but not the least తపస్సు, భక్తి. కైవల్యమును పొందుటకు కూడా ఇవే ప్రధాన సాధనములు.

Necessity

అవసరం అనే చక్రం మీద ఆధారపడి ఈ ప్రాపంచిక విషయములు నడుస్తున్నవి. Necessity is the mother of Invention అంటారు.  Money, woman, wine ఇదే ప్రపంచం అన్నట్లు 99.8 శాతం మంది ప్రజలు భావిస్తూ, దానిని పొందుటకై దాని చుట్టూ భూమి సూర్యుని చుట్టూ భ్రమణం చేయుచున్న విధముగా భ్రమణం చేయుచున్నారు అని నా అభిప్రాయం. కాని ఒక్క నిమిషం ఆగి పరమాత్మ స్వరూపం తెల్సుకోనుటకై సమయంను కేటాయించుటలేదు. దుఃఖములలో భగవంతుని అందరూ ప్రార్థింతురూ కాని సుఖములలో భగవంతుని ప్రార్థన చేసినట్లయితే ఈ దుఃఖములు దరి చేరవుకదా అని ఆ రోజే కబీర్ చెప్పలేదా!

Great Things

ప్రపంచములో గొప్పనైనవి. చేసిన మేలు మరచిపోకపోవడం కాకుండా కృతజ్ఞతతో ఉండడం. పట్టుకున్నదానిపై ఎంత కష్టమైన నిలబడ గల్గి ఉండడము, నీ కంటే గొప్ప వారు తారస పడినప్పుడు వారిని సరియైన విధముగా గుర్తించి ఒప్పుకొని అభినందించి, చిరు సత్కార్యం చేయడం.

Everything is your perception

ఒక గ్లాసులో సగం వరకు నీళ్లు నిండి ఉన్నాయి. దీనిని రాజు గారి సభకు తీసుక వచ్చారు. రాజు గారు దీనిని వర్ణించండి అని సభ్యులను, పండితులను అడిగినాడు. అందులో సగం మంది గ్లాసులో సగం వరకు నీళ్లు నిండి ఉన్నాయి అని తెల్పినారు, మిగిలిన సగం మంది గ్లాస్ సగం ఖాళీగా ఉంది అని తెల్పినారు. ప్రధాన మంత్రి లేసి గ్లాసులో సగం వరకు నీరు నింపవచ్చును అని తెల్పినారు. అది వారు చూసే కోణంలో ఉండును. భావనలోనే సమస్తము. It depends on your perception, the way you think, the way you observe,the way you notice ,the way you see. Your past always control your future. For every new step it will be definitely influenced by our past. Because something past is already memorised in our mind. Frightening, dearness comes with these examples only. తెలుగులో ఒక సామెత ఉంది. పచ్చ కామెర్లు అయిన వారికి లోకమంతా పచ్చగానే కనిపించును. చెడు వారికి చెడు వారు కనిపించును. మంచి వారికి మంచి వారు కనిపించును. మన చెడు, తప్పులు,పాపాలను మనలోనే ఉంచుకొని, మనకు తెలిసిన మంచిని సమాజంకు పంచవలెను లేదా ఇవ్వవలెను.అందువలన సమాజం మంచిగా మారే అవకాశం ఉండును.  Ever...

Mother's Love

మనిషికి ఆస్తి,అంతస్తూ,అధికారం అన్ని దిగదుడుపే. తల్లి అనురాగం, ఆప్యాయత, ప్రేమ ముందు. ఇది దొరకని వారి జీవితం చాలా బాధాకరంగా మరియు విచిత్రముగా ఉండును. వీరు దూరదృష్టవంతులుగా మిగులుదురు. వీరు మిక్కిలి దుఃఖితులుగా ఏదో జీవితంలో విలువైనది కోల్పోయిన వారుగా ఉందురు అని నా అభిప్రాయం. తల్లిదండ్రుల ప్రేమకు విలువ కట్టలేము.

What education you require or you learn?

నువ్వు చదివేది వేరు, ఎందుకు చదువు తున్నావో నీకు నీవే ప్రశ్న వేసుకోవాలి. దాని వలన నీకు కలిగే ఉపయోగం ముందు తెలుసుకోవాలి, దానిని ముందు చదవాలి. ఈ వ్యవస్థలోని లోపాలు ఎలా ఉన్నాయంటే మనలను ఉన్నచోటనే వెర్రి వాడిని చేసి, వారు దొడ్డిదారిన వారికి కావలసినది తెచ్చుకునే ఏర్పాటు చేసుకున్న వారిలా ఉంటుంది. యువత ముఖ్యముగా నిద్రమత్తులో ఉన్నారు. వారు ఎటు వెళ్ళాలి, వారికి ఏమి కావాలి వారికి తెలువదు. ఒక గందరగోళం పరిస్థితిలో ఉన్నారు. దీని నుండి బయటికి రావాలి. నిద్రావస్థ నుండి లేచి మేల్కొనాలి. తెలివి తెచ్చుకోవాలి. దేశ భవిష్యత్తు వీరి భుజస్కందములపై ఉంది కావున దానికై అహర్నిశలు శ్రమించాలి. దేశ కీర్తిని నలువైపులా వీరి విజ్ఞానముతో విస్తరింపజేయాలి. ఏమి చదువాలే, ఎలా చదువాలి, దాని తాత్పర్యం ఏమిటి, అది మనకు ఏ విధముగా ప్రయోజనము కల్గిస్తుంది. ఇది తెలుసుకోవాలి. మూస ధోరణి అవలంభించవద్దు. ఇది మనకు భవిష్యత్తులో కనీసం తిండి పెడుతుందా అని ఇంగితముతో ఆలోచించవలెను అని నా అభిప్రాయము. విజ్ఞాన సముపార్జన తో పాటు అది మన జీవన భృతికి తప్పకుండా ఉపయోగపడాలి. సమాజంలో అట్టి చదువు ఏ విధముగా ప్రయోజనకారి అని తెలుసుకోవాలి. వీలైతే అనుభవపూర్వకంగా వ...

Breath is Your talk

ఊపిరియే వాక్కు, ఊపిరి లేనట్లయితే వాక్కు రాదు, ప్రాణం నిలువదు. ఈ భేదం పరమేశ్వరుడు అతని తత్వం. మతము అనగా మతి నుండి పుట్టినది. అభిప్రాయము. ధర్మో రక్షతి రక్షితః ఇతిహాసము అనగా జరిగినది చెప్పడం. సత్యం వదా, ధర్మం చరా. సత్యము పలుకుము, ధర్మమును అనుష్టించు. కర్మ ద్వారా ఆచరించు. వట్టిగా అనుసరించడం వలన లాభం లేదు. దానిని పట్టుకొని తుది జీవితం వరకు పట్టుకొని ఉండాలి అనగా ఆచరిస్తూ ఉండాలి. శ్రీరాముని జీవితం దీనికి దగ్గరి తార్కాణం.నారాయణుడే నరునిగా అవతరించిన గొప్ప అవతారం. దశ వర్ష సహస్ర వత్సరాలు రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. అందుకే ఇతని పరిపాలన కాలాన్ని రామ రాజ్యం అంటారు. ప్రజలు సుఖ, సంతోషాలతో విలసిల్లినారు. మానవుడు ఏమి చేయగలడు అని చెప్పే విధముగా మానవుని కీర్తి ప్రాధాన్యత శ్రీరాముని ధర్మ పరిపాలన, సత్య దీక్ష దక్షత వలననే వచ్చింది. ఆంగ్లములో ధర్మమునకు తుల్యమైన పదం లేదు. వారు దానికి DHARMA అని మాత్రమే వ్రాస్తారు. అదేవిధముగా అధర్మమునకు తుల్యమైన పదం లేదు. సాధ్యాసాధ్యాలపై విచక్షణతో మెలగాలి. అప్పుడే నీవు కోరుకున్నట్లుగా నీ లక్ష్యం ను నీవు చేరుకోగలవు. అది ఎప్పుడు వాస్తవానికి దగ్గరగా ఉండాలి.

Competetion in Today's World

10000 మంది అభ్యర్థులు ఉద్యోగంనకు పోటీ ఉన్నారు, 20 పోస్టులు ఉన్నాయి. 78 మందికి పరీక్షలో 99.8 శాతం మార్కులు వచ్చాయి. 10000 మందిలో 9700 మంది నిరుద్యోగులు, అందులో 8400 మంది బీదరికంలో మగ్గుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో ప్రభత్వం మిన్నుకుండి పోయింది. అసలైతే 10000 మందికి 10000 మందికి ప్రభుత్వం దారి చూపాలి. కనీసం 99.8 శాతం వచ్చిన అభ్యర్థులందరికి అనగా 78 మందికి ఉద్యోగాలు చూపించవల్సిన కనీస ధర్మం ప్రభుత్వం మీద కలదు. 99.7 శాతం వచ్చిన వారు 46 మంది మరియు 99.2 శాతం వచ్చిన వారు 84 మంది ఉన్నారు అని అనుకుందాము. ఉదాహరణకు తీసుకొని అర్థం కావడానికి చెప్పుచున్నాను. మరి ఈ రాజ్యం, ఈ దేశము ఎప్పుడు, ఏ రోజు బాగు పడుతుంది. ఒక పరుగు పందేములో  1st rank, 2nd rank 10000 rank ఉన్నట్లయితే 1st rank వారికి అవార్డు అని పేర్కొంటే 2nd నుండి last rank వరకు వారు last rank తో సమానం. ఇది ఉన్న competetion పరిస్థితి. ఇది కూడా విద్యార్థులు, యువత, అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. దానికి తగ్గట్లుగా ఇతర ఉపాధి మార్గాలని అన్వేషించుకొని జీవితాలలో settle కావలెను. Self employment, giving employment మీద దృష్టి పెట్టవలెను. అవసరమైతే ప్రభత్వం ...

Justice to common Man

Justice to common man. న్యాయం కావాలి. సాధారణ మనిషికి న్యాయం జరగాలి. ఈ భారతదేశంలో. 10 crores ఉన్న వ్యక్తికైనా అన్యాయం చేస్తే, నేరం చేస్తే తప్పకుండా శిక్ష పడాలి. వ్యవస్థలను ఆ పద్ధతిలో కట్టుదిట్టం చేయాలి. అవసరమైన చోట వీలును సమకూర్చుకొని మార్పులు చేయాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. చట్టాలలోని లోపాలను ఆసరాగా చేసుకొని ముసుగు దొంగల లాగా ముద్దాయి లు నేరం చేసినప్పటికీ వారి ధన బలం, రాజకీయ బలంలతో తప్పించుకొని తిరుగుతున్నారు ఈ దేశంలో. ఇట్టి నీచ సంస్కృతితో ఉన్న వ్యవస్థ తక్షణమే మారాలి. ఆ దిశగా ప్రయత్నాలు సాగాలి. దీనికి ముఖ్యముగా భారతీయ యువత ముందుకు వచ్చి, పూనుకొని, నడుము బిగించాలి.  1000 rupees ఉన్న వ్యక్తికి , అది కూడా లేని వ్యక్తి కూడా న్యాయం జరిగే విధముగా వ్యవస్థలు మరియు చట్టములు మారాలి. ఇవి ఎవరి గురించి మారుతున్నాయి. అందరి ప్రజల సంక్షేమం మరియు శ్రేయస్సు గురించి. దీనిని అందరూ మన గురించి మనకు కలిగే మంచి మార్పుకై ఐకమత్యంతో స్వాగతిద్దాం. దీని వలన సమాజం బాగు పడును, దేశం బాగు పడును. చీదపురుగులు నశింపబడును. కొంగ్రొత్త భారతావని మన కళ్ళముందు సాక్షాత్కారింపబడును. అందరూ కలిసి సంతోషముగా,ప్రేమగా ఆ లోకాన్...

Lord of Universe

I don't follow trend rather it will follow me. This is my path. This is the way I go. I like this only. I like to go in this way only. Becaudse i am after Lord of Universe. I like Paramaatma. I want to make friendship with him. I want to follow him only. Not others who waste their valuable time in nonsense things. I don't like. I don't want to even shift my eye towards that. I pray to Paramaatma to give me such kind of Precious life and time, where I see only you and keep on worshipping you. Which is the solution for all sorrows in earth. Oh Paramatma i beg and pray you to show me the holy path, where I can stand infront of you and staring at you like Bhakta Prahlada. There is no other valuable life in this holy earth(Bhoomata) other than worshipping you. Thank you very much to bear me so far and showing me the right path. My Salute with gratitude. Once again  Thank You Paramatma.

New Definition to be derived

రాజకీయాలకు, ప్రభత్వం కు, సేవకు వ్యవస్థకు, విధానాలకు, నియమాలకు, నిబంధనలకు కొత్త నిర్వచనం కావాలి మరియు రావాలి. మనకు ఏమి వచ్చు, ఎంత వచ్చు అన్న దానికంటే వచ్చిన దానిలో లేదా దానితో ఏమి చేస్తున్నాము, దానితో ఏమైనా ఉపయోగం ఉందా లేదా వచ్చిందా అనునది ముఖ్యం. దీనికే ప్రాముఖ్యత ఎక్కువ అని నా అభిప్రాయం. ఇట్టి ఏర్పడిన ఉపయోగం అది నీ వరకు మాత్రమేనా, నీ కుటుంభం వరకు మాత్రమేనా లేదా నీ ఇంటి ప్రక్కవారితో పాటు సమాజానికి ఏమైనా అందిందా అన్నది ముఖ్యం. ఎన్ని ఎక్కువ ఏళ్ళు బ్రతికినావన్నది కాదు ముఖ్యం, నీ వల్ల ఎందరికి ప్రయోజనం లేదా ఉపయోగం కల్గింది లేదా ఏ ప్రకారంగానైనా సేవ చేశావా ఈ సమాజానికి అన్నది చాలా ముఖ్యం. అదియే పరమ పూజ్యం, పరమ దైవం. అదియే లెక్కలోకి మరియు పరిగణనలోకి తీసుకోబడుతుంది. గణించబడుతుంది. అదియే నీకు గుర్తింపు మరియు ప్రత్యేకత సంతరింపచేస్తుంది.

Keep eyes open

What is good and bad? What is correct and wrong? Simple common sense. Simple logic. If you keep your eyes open you notice so many things. You come to know so many subjects.Evaluate and explore. For this You may not require PG, M.Phil, M.Tech and Phd's. You require Observation. Keep on observing your surroundings, Society and Nature. It will teach you Subjects and lessons.  Learning desire, enthusiasm or thirsty for new discovery will sit you above the Sky. Do analysis work, derive simple calculations. You improve your skill of future Vision or Vision. Automatically you are going to remain as a model in this Society or World.

Sin of your act

పొరపాటుగా ఎదుటి వారికి మన కాలు త్రాకినప్పుడు మనము ఏ విధముగా చెంపలు వేసుకుంటామో అదేవిధముగా మనసులోకి చెడు భావన, ఆలోచన వచ్చినప్పుడు అదేవిధముగా చేయవలెను.  ఆ విధముగా పాప పరిహారం, ప్రాయశ్చిత్తము చేసుకోవలెను. లేదా కంట నీరు పెట్టుకోవలెను. బ్రతికి ఉన్న తల్లి లేదా తండ్రి మరణించారు అని భావించిన పిదప మనకు ఏ విధముగా కంట నీరు వచ్చునో.

Arrogance

నాకు ఇది ఉంది అది ఉంది అని గర్వించే వ్యక్తి అతను దేని పై లేదా దేనియందు దృష్టి నిల్పనంతగా లేదా కేంద్రీకృతము చేయనంతగా, ఆ పరమాత్మ యందు కేంద్రీకృతము చేయువిధముగా దేవుడు ఏర్పాటు లేదా తయారు చేయును. అతనికి గల అన్నీ  వనరులను,శక్తులను దూరం చేసి అతనికతనే అవగతం లేదా అర్థం చేసుకునేవిధముగా పరమాత్మ చేయును.    అమృత చూపు, దృక్కులు., ఈశ్వర దర్శనం పై అనురక్తి కల్గిన వారగునట్లు పరమాత్మ చేయును.

My wish and aim

My aim is to bring or make difference in the lives of poor of the poorest families in the India and abroad.They should be feed by proper food according to their necessity or requirement. No life should be taken out by God on human mistakes or machinery mistakes. Un natural deaths maximum to be minimized. Forward helping hand. No accidents to take place.

Exploitation

బలవంతుడు బలహీనుడిని, తెలివి ఉన్నవాడు, తెలివి లని వాడిని ఇదేవిధముగా శక్తిమంతుడు,అధికారం కలవాడు,చదువు ఉన్నవాడు,సంపద ఉన్నవాడు అవి లేని వారిని నిత్యం ఏదో ఒక విధముగా,ఏదో ఒక కోణంలో చాలా మట్టుకు, చాలా మంది ఈ ప్రపంచములో మోసం చేసే ప్రయత్నము సాగుతున్నది. ఈ ప్రపంచములో మంచి వారు,మహానుభావులు ఉన్నారు కాని అందులో చాలా మంది ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.

Remaining as Spectator

బలవంతుడు బలహీనుడిని, తెలివి ఉన్నవాడు, తెలివి లని వాడిని ఇదేవిధముగా శక్తిమంతుడు,అధికారం కలవాడు,చదువు ఉన్నవాడు,సంపద ఉన్నవాడు అవి లేని వారిని నిత్యం ఏదో ఒక విధముగా,ఏదో ఒక కోణంలో చాలా మట్టుకు, చాలా మంది ఈ ప్రపంచములో మోసం చేసే ప్రయత్నము సాగుతున్నది. ఈ ప్రపంచములో మంచి వారు,మహానుభావులు ఉన్నారు కాని అందులో చాలా మంది ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.

Few Yeksha Prashnas

తాత్పర్యం,స్వార్థం,పరమార్థం, ఎంతటి మహానుభావులైనా పది పనులు ఒకేసారి చేయలేరు. You can not be two places at a time. దివ్య జీవనం. వేదాంత సంస్కారం. అహం వీడ్చి వైకుంటపాలి చేరుకోవాలి. వినయం, సంస్కారం,విచక్షణ. 123 యక్ష ప్రశ్నలు. ధర్మరాజు స్థితప్రజ్ఞతకు మారు పేరు.  అన్నిటికంటే ఆశ్చర్యకరం ఏమిటి. జీవుడు అందరూ మరణిస్తున్న నేను శాశ్వతం అని సంపద కాంక్షితుడై ప్రోగు చేయడం. డబ్బు కూడ బెట్టడం.

Desire is the major cause for sorrow

ధనం మూలం ఇదం జగత్తు. సర్వ దుఃఖ ములకు కారణం కోరిక లేదా వాంఛ. మరియు కోరికలు. నీలో ఏర్పడే ఆలోచనలు,భావనలు ఎలా ఉండాలి. ఆలోచనలను, కోరికలను ఎలా వడపోయాలి,ఎలా నియాత్రణలోకి తీసుకోవాలి. ఎలా సాధన చేయాలి. మనసును ఎలా శుభ్ర పరుచుకోవాలి. విధి విధానాలు. ఏ పని పునరావృతముగా చేస్తావో దాని పట్ల మనసు దృష్టి నిల్పి,ఇష్టత పెంచుకొని ఆ పని చేయుటను ప్రేరేపించును. బుద్ధిని కూడా నియంత్రణ చేయును కొన్ని సందర్భాలలో.

Physical benefits

అతి పెద్ద తలంపు లేదు, స్వార్థం ఆవహించింది. ఒక క్షేత్రము లోపల ఆలోచన,పని,మనసు,బుద్ధి తిరుగుతూ ఉంది. అది దాటడం లేదు. ఐహిక సుఖాల యందలి నీ మనసు చుట్టూ తిరుగుతూ ఉంది. ఒక కోరిక తరువాత ఒకటి తరువాత వంద తరువాత వెయ్యి తరువాత లక్ష తరువాత కోట్లు మరియు అనంతమైన కోరికలు. క్షేత్రములు లేవు, అవధులు లేవు.

Letter to Prashanth Kishore

Sir nice to interact with u. I want to improve my skills with your valuable support. We can join together to build new India with lot of extra glory/ power in all segments, if i get such opportunity with you. I want to meet you and work with you. I am striving and wandering for right opportunity from right person at right time. I am patiently waiting for that wonderful/valuable time. I have enough patience for that. I have strong belief that that day will come. On that process this communicative interaction with you. I belong to Telangana State. We can bring reforms wherever required for the development of Economy and development of people living standards. It should remain like a boon for the coming new generations. I hope you give me this valuable support and opportunity to work with you for the prosperity of India and valuable suggestions. I feel Bringing my dream come true with this opportunity. My wish and ambition is that I want to prove my self in front of the public of this na...

My job or duty

What you people are doing? Atleast i am bringing into your kind consideration. Your kind notice. Your kind observation. If one eligible person gets it, i am satisfied. I feel great and my job over.

Behaviour and property of Soul

ఒక ఆత్మ ఒక శరీరంలో ఆ దేవ దేవుని అనుమతిని అనుసరించి ప్రవేశించిన తరువాత ఆ జీవితం ఉన్నంత వరకు అట్టి శరీరంతో మాత్రమే అంటి పెట్టుకొని ఉండే స్వభావం కలిగి ఉండును. ఇది అనగా ఆత్మ తనకు ఇష్టమైనప్పుడు అట్టి శరీరం నుండి వేరు అగుటకు ఆస్కారం ఉండదు, అది సాధ్యపడదు. కాని ఇట్టి మనసు ఆ శరీరంతో ముడిపడి ఎప్పుడైనా, ఎక్కడికైనా విహరించే, ప్రయాణించే వెసులుబాటు కల స్వభావం కలిగి ఉండి తదుపరి ఆ శరీరంతో మాత్రమే అంటిపెట్టుకొని, అనుబంధము కల్గివుండును. దీనికి అన్నిటిని గమనిస్తూ, స్పృశిస్తూ జ్ఞాపకంగా ఉంచుకునే స్వభావం అట్టి శక్తి దీనికి ఉంది.

Present my Principle

Now I changed my concept. No talk, no reveal, only into action. Listen more and talk less, observe more, work more, do something important either to yourself or public.

Thirsty of desire for excess money.

Live let live. Give opportunity to live others. Do not grab excess, Do not be after other's cup of tea. If u require 80lakhs for your life time expenditure, earn 2crores , do or perform daan of 50 lakhs. Do not be after 10 crores which may again raise to 50cr again to 200cr....Like that. Because there is no end for desire thirsty.

Appearance of God in Kaliyuga

కలికాలంలో దేవుడు రాడు, నేరుగా అగుపించడు, అతని మహత్మ్యం మరియు లీలలు ఏదో ఒక మాధ్యమం ద్వారా గోచరించును,అవగతమవును లేదా తెలియజేయబడును.

Desire, Dream come true

ఏదో ఒక తపన,తృష్ణ,కోరిక అనునిత్యం, నిరంతరం వెంటాడుతూ ఉన్నది. అది తీరేది ఎన్నడు. తీరం దాటేది ఎన్నడు. మనసుకు ప్రశాంతత ఎన్నడు. కొన్ని దశాబ్దాల మౌన సంఘర్షణ. ఎప్పుడు లావాలా బయటికి వచ్చునో. ఆ సందేశం ప్రజల దరి చేరునో. ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఆ సమయం రానే వచ్చింది. కన్న కల సాక్షాత్కారమై ఎదుటనే ప్రత్యక్షమైంది.

Karma and experience is individual

I conclude the subjects with these. Follow truth and dharma. Help others. No violence, be patient. Distribute good and food. Plant trees. Meditate for Loka kalyanam. Lead Satisfied life which is Satisfaction and content for your own soul. Satisfaction definition differ from person to person. As my friend says no definition for enjoy or enjoyment. This also differ from person to person. You should move or meditate like Yogi, Muni or Maharshi. Then only it is possible to understand this world and get enlightenment or Mukshuvu or Moksham or Mumukshu or immersing in Paramatma or Brahma or Brahma padartham. You should learn the actual mathematics then you will be called True Mathematician. To understand few you should know mathematics. You should be in a position to derive the things. Get the formula to reach Bhagwan. Like result. This formula is not yet derived properly and not got the approval in the Laboratory. Still it is in experiment made. Every individual experiment is subjected to ...

Discussion with Parabrahma

The discussion with Srimannaaraayana murthy none other than Govinda. Allot me the work, i go and finish it. I am not noticing Kalki bhagwan in this world. Let me complete my duty Sir., Oh... No wait... I am there to look after.. do not worry... That is not your work, do not be after that. You be after which makes you sit comfortably. Try to know me as much as possible till the last breath exist. Perform that Sadhana karyam Or karma. Follow Karma Siddhanta. The work whatever you do should be in the limits/field of Shastra and Dharma. Thank you my dear God.

Work with interest and likeness

ఒక పనిని అదే రీతిగా మూస ధోరణి లేదా పద్ధతిలో ఏ విధమైన మార్పు లేదా తేడా లేకుండా ఒక యంత్రము లెక్క చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు, నేను దానిని వ్యతిరేకిస్తాను. ఏ పనినైనను ఇష్టముతో కష్టపడి చేయాలి అని నా అభిప్రాయం. నేను దీనికి మాత్రమే మొగ్గు చూపిస్తాను.పనిలో అయిష్ఠత ఉండరాదు, తృప్తి ముఖ్యం.

Your Movement

శివ,శివా. హంస, హంసిని. నిత్యానంద కరి, వరా భయకరి. వర అభయ కరి. సౌందర్య రత్నాకరి,లక్ష్యం వైపు కదలిక, శాస్త్రీయమైన కదలిక,పని. ఎలా కదలాలో అలా కదలాలి. గురు తుల్యం, ప్రమాణం, ఉపదేశం అనుసారం. శాస్త్ర ప్రమాణం. నీ గుండె మీద చెయ్యి పెడితే, ఆత్మ విమర్శ చేసుకుంటే సరియైన కదలిక నా కాదా తెలుస్తుంది, అవగతమవుతుంది.