Posts

A small expenditure theory of marriages

Again this minimising of marriage expenditure comes under the Subject of Economics and it is treated as an another piece of Welfare Economics.     Saving cash according to the time/situation and moving with most care by keeping the future in mind and intact. Everything depends and change according to the time and situation. Eduru katnam already exists. % is less, in coming years the % may raise. This is nothing but giving instructions to mind with wide knowledge and high patience,  be careful, do not go or follow as others are. We need not to follow the trend. Because we are the persons who set the trend. (This is a subject followed and shown to the Manthani People  by Sri Gulukota Sri Ramulu -)                For a marriage function  Case #1: Let us assume the maariage expenditure In Hyderabad city is 1cr,  in Manthani town is 10-20 lacs, in this case your saving amount 80 -90 lakhs. Case # 2:  Flat/plot...

అమ్మవారి భక్తుని కథ

అమ్మవారి భక్తుడిని కించపరిచి మనసును బాధ పెట్టిన వారికి ఏర్పడిన దయనీయమైన పరిస్థితి వారికి వారే కొని తెచ్చుకున్న వారి దీన గాధ మీకై.  వీరు అహంకారం, అహంభావముతో తనకు బాగా తెలుసునని తెలుపక తెలుపుతూ జీవనం గడుపుతూ ఉండేవారు. అయితే వీరికి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా ఆ ఊరి గుడి పూజారి పై పెత్తనం చెలాయించవలెననే దుర్బుద్ధితో వారిని గుడికి వెళ్లి ఎగతాళి చేసి అనవసరమైన పరుష మాటలతో కన్ను మిన్ను తెలువక అనేక మాటలు అనెను. తదుపరి ఇంటికి వెళ్లిన పూజారి మనో వేదనతో ఉండెను.అప్పుడు అతను కొలిచే అమ్మవారు నేను ఉండగా నీకు ఎందులకు బెంగ. నీవు హాయిగా విశ్రాంతి తీసుకొనుము అని తెలిపెను. వీరు మూర్ఖులకు చక్రవర్తి గా ఉన్నారు, నాకు బాగా తెలుసని విర్ర వీగారు, వీరికి పచ్చకామర్లు అయి వీరు లోకం అంతా నాకు పచ్చగా ఉంది అని గొడవ చేయసాగారు. వీరు మరునాడు ఉదయం మంచము నుండి లేవ ప్రయత్నం చేయగా లేవకుండెను. వారు కుష్టు మరియు పక్షవాతము వచ్చినదని గ్రహించి మిక్కిలి బాధ పడిన వారై ఆ పూజారిని పిలిపించుకొని వారి కాళ్ల మీద పడి శరణు కోరినారు. వారి అజ్ఞాన చర్యకు ఆ దేవుడు వారిని ఒక సంవత్సర దినములలో తన లోకంనకు రప్పించుకొనెను.

సత్యం, జ్ఞానం, బ్రహ్మము

సత్యం ఒక కొన్ని కోట్ల వజ్ర ఆయుధముల కంటే ఎక్కువ. అనంతము, ఆనందం. సత్యం ఎప్పుడు నిత్యం, అది శాశ్వతం, అట్టి జ్ఞానం బ్రహ్మము. 

My written story of Bhagwan & Bhakta

ఒక విశేషమైన భక్తుడు మరియు భగవంతునికి మధ్య జరుగుతున్న సంభాషణ తో కూడిన కథ :- భక్తుడు :-  ఏమయ్యా స్వామీ! నీకిది భావ్యముగా ఉందా? ఎన్ని సంవత్సరాలనుండి నేను నిన్ను కొలుస్తూ వస్తున్నాను, కనీసం 40 సంవత్సరాలు దాటింది. నిన్నే నమ్ముకొని ఉన్నాను. నీ దయ, కరుణ  లేదు, నా పై నీ దృష్టి లేదు, నాకు ఒక్క క్షణం గురించి వచ్చి అయినా కనిపించి పోవచ్చు కదా! నా గురించి కూడా కాదు, మిగిలిన నీ భక్తుల నమ్మకం, విశ్వాసం పెంపుదలకు, నేను నీ గురించి గొప్పగా చెప్పుటకు, అర్థం అయ్యిందా స్వామీ ! నేను ఏమి చేయాలో పాలు పోవడం లేదు స్వామీ ! నీవే ఎలాగైనా దర్శన భాగ్యం కల్పించాలి.  భగవంతుడు :- నేను నీకు కనిపించడానికి సిద్ధంగా  40 సంవత్సరాలనుండి ఉన్నాను. కాని నన్ను నువ్వు భగవంతుడివి కావు అని అవమాన పరుస్తావనే సంశయముతో నేను రావడం లేదు. నేను అవమానం ను భరించను. భక్తుడు :- అటువంటి విధంగా అస్సలు ఉండదు. నేను మీకు హామీ ఇస్తున్నాను. భగవంతుడు :- నాకు నీ మీద నమ్మకం కలగడం లేదు. భక్తుడు :- అటువంటి సందేహం వలదు, నన్ను కరుణించి కాపాడు స్వామీ ! భగవంతుడు :- సరే అటులనే, కాని ఒక్కసారి మాత్రమే. భక్తుడు :- స్వామీ అటులనే, అంతా మీ...

God, Godness దేవుడు, దైవం

దైవం అనగా ఏమిటి? అది ఏమి చేయును? ఏమి పని చేయును Functioning?  అతి పెద్ద పదార్థము యొక్క శక్తి స్వరూపము దేవుడు, అతనికి సంభందించిన అన్ని పదార్ధములు, వస్తువులు, విషయాలు దైవం. క్షేత్రం యొక్క పరిధి దైవం. దైవం వలన మానవుడు సత్యం ను తెలుసుకొని ధర్మంనకు అనుగుణంగా నడుచుకోవడం తెలుస్తుంది, అలవాటు అవుతుంది. అట్టి మానవుని గమనము, జీవనం కారణ జన్మకు కారణం అయ్యి తనను తాను తెలుసుకొని మోక్షం, కైవల్యము ప్రాప్తించుటకు, సిద్ధించుటకు దోహద కారి అగును. దైవం ను నమ్మిన వ్యక్తి కష్టాలు పడుతున్నను సుఖం, సంతోషం, తృప్తి, విజయం మొదలగు వానితో వచ్చు  ఆనందం తో కూడిన ప్రశాంత జీవనం కొనసాగించును. కీర్తి పొందును. కాని దైవం నకు వ్యతిరేకంగా ఉన్నవారు క్షణిక సుఖం పొందునట్లు అనుభూతి చెంది భ్రమ ఏర్పడును. తుదకు అన్నీ కోల్పోయి సర్వ నాశనం చెంది దైవం ను ప్రార్ధన చేయు తలంచి, సమయం లేదు అని గ్రహించిన వాడై దేహం వదిలిపెట్టును. అందుకే ముందే స్పృహతో దైవత్వం ను తెలుసుకోని మసలు కొనవలెను, జీవన గమనం చేయవలెను. ఆనందమయ జీవనం కు బాటలు వేసుకోవలెను. 

దుర్గ అమ్మవారి మహిమ తెల్పడం

                     🍃🍂🌹🌹🍂🍃                                                మంచి మాట-మంచి పాట                                                  🍃🍂🌹🌹🍂🍃                                              🌲🌱🌷🌷🌲🌱 మనమే మనమే...  ఎందుకు ఎందుకు...  మనమే  ఎందుకు...   అహంకారం, అజ్ఞానం, అమాయకత్వంతో మనకే తెలుసనుకోవడం ఎందుకు...        తెలుసని డాంభీకాలు, ప్రగల్బములు, వెర్రి మాటలు ఎందులకు...  ఎందులకు...  ఏలయనగా నిన్నే నీవు ఎరుగని నీ జ్ఞానం...  నీకెలా ఏమని తెలుపును మిత్రమా...  ఇకనైనా ఆపేదవా నీ ఉత్తర ప్రగల్బములు......

తుమ్ము యొక్క నా విశ్లేషణ

నేను అడిగిన ప్రశ్నకు నేను ఈ విధముగా logic& reasoning ద్వారా నా విజ్ఞానం మేరకు  జవాబు చెప్పువచ్చు అని ఆలోచన చేయడం జరిగింది. Doctor గారు విశ్లేషణ చేయాలి. మనిషి మూల అంతరాలలో దాగి ఉన్న మంచి, చెడు బ్యాక్టీరియా, వైరస్ మరియు ఇతర వ్యాధికారక క్రిములు మన చుట్టూ ఉన్న వాతావరణం లోని గాలిలో ప్రవేశిస్తాయి. తుమ్ము 100MPH వేగంతో వస్తుందని విన్నాను. దీనిని ఆపే ప్రయత్నం చేయరాదు. అట్టి క్రిములు ఏవైనా chronic, acute, severe problematic diseases ను కల్గించే అవకాశం ఉన్నట్లయితే అట్టి ఉపద్రవం ను కొన్ని నిముషాలు ఆగి వెళ్ళటం వలన అట్టి వ్యాధి కారక క్రిములు మన ఎత్తు  height దాటి పై వాతావరణం లోకి వెళ్ళును, కావున మనకు కలిగే ఇబ్బంది తొలగిపోవును అని నా విశ్లేషణతో కూడిన అభిప్రాయం. యుద్ధాలలో మూర్ఛకు సంభందించిన అస్త్రము లేదా బాంబును ప్రయోగించినపుడు మనము భూమిపై సాష్టాంగ నమస్కారం చేసినట్లు ఉండుట ద్వారా అట్టి ఉపద్రవం నుండి రక్షించుకొనుటలో ఉన్న సూత్రం దీనికి కూడా వర్తిస్తుంది, ఉపయోగపడుతుంది అని నా విశ్లేషణ తో కూడిన భావన వలన కల్గిన అభిప్రాయం.