దైవ సాక్షాత్కారం Defining and Proving God, Bhagwan, Parabrahma

దేవున్ని నిరూపించడం. ఇట్టి కార్యం ఈ కలియుగంలో భుజస్కంధాలపై వేసుకోవడం చిన్న పని అగునా అండి. మీరు నేను అందరం ముసుగు వేసుకొని ఉన్నాము ఈ విశాల విశ్వంలో. అయితే చిన్న తేడా మాత్రమే. మీరు వేసుకున్న ముసుగును తీయాలని, తీసివేయాలని ప్రయత్నము చేయడం లేదు, నేను కొంత ప్రయత్నము చేస్తున్నాను, అంతే తేడా, దేవుని పరిధి,ఆవరణ, క్షేత్రములో ముసుగుతో ఉన్నవారికి ప్రవేశం లేదు, ఉండదు. వొజ్జల సిద్ధాంతి, మంథని వాస్తవ్యులు, గొప్పవారు. 10 కోట్ల ప్రవచనాలు1 ఆచరణ ముందు దిగదుడుపు. ఒక ప్రాణం పోతున్నది, నీరు పోయాలి 1 గ్లాసెడు. కాని కారు ఆపి నీరు ఉన్నా పోయలేదు, నీరు పోసి ప్రాణం కాపాడలేదు అనుకొండి. ఒకరి ప్రాణం పోతున్నది అని తెలువకపోతే తరువాత ప్రాణం పోయింది, తరువాత ఆ రోడ్ వెంబడి 1కోటి కార్లు వెళ్లాయి. ఏమి లాభం, పోయిన ప్రాణం తిరిగి వస్తుందా... ఆ కారులో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కానీయండి, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి గారు కాని శ్రీ రాధా కిరణ్ శాస్త్రులు కాని ఉండనివ్వండి, ఒక వృత్తి రీత్యా చెండాలుడు ఉండనివ్వండి, కారు దిగి లేదా అటుగా కాలినడకన అటుగా వెళ్తున్నా బీద రిక్షా కార్మికుడు ఉన్న నీటిని ప్రాణం పోయే వ్యక్తికి ఎవరైతే పోసి ప్రాణాలు కాపాడుతారో వారే యోగులు, మహానుభావులు. ఆ పని చేసే అదృష్టం ఉండాలి, కలగాలి. అదే యోగం. దానినే అతనికి పట్టిన యోగం అంటారు. ఆ యోగం ఉండాలి. అది భగవంతుని దయ,కృప, కరుణా, కటాక్షాలు ఉండాలి, కావాలి. నిర్మల భావన, స్వచ్ఛ మనస్సు దేవున్ని ప్రసన్నము, అనుగ్రహమును చేసి, ఇచ్చి మన ఇబ్బందులను దూరం చేయుటకు కారకమగును, కారణమగును. నిర్మలమైన మనస్సుతో జ్ఞానమును సముపార్జించవలేను. అట్టి జ్ఞానము మోక్ష ప్రాప్తికై ఉపయోగపడాలి, దారి చూపాలి. నువ్వు శిభి చక్రవర్తివి అయినా సత్య హరిశ్చంద్రుడైనా దుర్మార్గుల చెంతన చేరినా, వారి పక్షపాతం వహించి, వారికి పని చేసినా అధోగతి పాలు అగును. ఉదాహరణ. బ్రాహ్మణ సంధ్యావందనం ప్రకారం నిశ్చల, నిర్మల మనస్సు తో, ఆత్మతో హృదయాంతరాళంలో ఉన్న పరమాత్మను దర్శించాలి,చూడాలి మరియు అంతటా, విశ్వవ్యాప్తమై ఉన్న పరమాత్మను చూడగల్గాలి, చూడాలి. సూర్యుని సాక్షిగా, సన్నిధిలో అనగా సూర్యోదయ కాలమునందు దోసిలిలో తీసుకున్న నీటిలో నీ ఆత్మను సాక్షాత్కారం చూసుకోవలెను. శక్తి, తేజస్సు కర్మ,ధ్యానం, భక్తి ద్వారా కల్గును, పరమాత్మ దర్శనముకు దారి చూపి కృతకృత్యత కలుగజేయును.

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

What are you learning really?