Instead of quarrelling for greatness, do best to the needy and find satisfaction, peace and way of Paramatma

ఇద్దరు గొప్పతనం గురించి అర్రలు చాచడం, వెంపర్లాడడం, వెంబడిపడడం కాదు, ఈ సమాజానికి ఏమి ఇచ్చాము, మన సహకారం, భాగస్వామ్యము contribution ఏమిటి? ఈ విధముగా ఆలోచించాలి. ఇంకా వీలైతే రెండు కోతులు రొట్టెముక్కకై కొట్లాడిన మూడవ కోతికి లాభం అయినట్లు, వీరిరువురు అట్టి పరిస్థితి తెచ్చుకోక సమాజ,లోకహితం గూర్చి పాటుపడాలి. అమాయకుల,అనాధల, అబలల, నిరుపేదల జీవితాల్లో వెలుగురేఖలు, వారి మోములో చిరునవ్వు తేవాలి. ఆ ప్రయత్న దిశగా వారి గమనం ఉండాలి. అందరూ కాలగర్భంలో కలిసిపోయేవారే. ఉన్నంతలో, శరీరం చైతన్యవంతముగా ఆ అమ్మవారి దయతో ఉన్నంతవరకు నలుగురికి మంచి చేయడం కన్నా మహోన్నతమైన పని ఈ భూమిపై ఏమి లేదు ఎవరికిని అని నేను అత్యంత విశ్వాసంతో, నమ్మకంతో నా ఆత్మ ద్వారా చెపుతున్న మాట. దీనిలో వారికి అత్యంత ఆత్మ సంతృప్తి కలుగుతుంది. అదియే ఇంకా కొన్ని మంచి పరిణామాలకు దారి తీస్తుంది. ప్రతీవారికి కీర్తి కాంక్ష, మేము గొప్ప, గొప్ప పేరు తెచ్చుకోవాలి అని అందరికి ఉంటుంది, కాని దాని అర్హత,యోగ్యతకు నేను ఎంతమేరకు సరితూగుతున్నాను అని చాలా తక్కువ మంది, నరులు ఆత్మవిమర్శ చేసుకొనెదరు. దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడు, ఏ విధముగా కోరుకుంటే, ఏ శక్తితో ఉండాలి అని కోరుకుంటే, ఏ రూపంతో కోరుకుంటే ఆ విధముగా మనకు అగుపిస్తాడు. కనిపిస్తాడు, దర్శనమిస్తాడు. ఓం శాంతిః శాంతిః శాంతిః||

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

What are you learning really?