My movement, My Life, My Philosophy, My way in finding Paramatma

నేను జీవితంలో నా గురించి కంటే ఎదుటి వ్యక్తి గురించి ఎక్కువగా ఆనందము చూశాను, అట్టి కర్మ చేశాను, ఆనందము వెతుక్కోని ఆనందిచాను అని చెపుతూ తదుపరి నిజమైన ఆనందము ఎందులోనూ కనబడనందున దేనిలోను లేదు అని భావించిన వాడినై ఆ పరమాత్మ స్మరణలోనే సకల శుభాలు, ఆనందాలు ఉన్నాయని తలంచాను. ఇదియే మనస్సులో నాటుకొని పోయింది. దీర్ఘకాలంగా దీనినే అనుసరిస్తూ, నమ్ముతూ, విశ్వషిస్తూ కాలం అనే సముద్రంలో గమనం సాగిస్తున్నాను. నేను జీవితంలో దేనికి బానిసను కాలేదు. ఒక్క ఆ పరమాత్ముని చరణాలను, పరమాత్ముని సన్నిధిని చూడడానికి తప్ప. ఇది నా మొదటి మెట్టు విజయం అని అనుకుంటున్నాను. ప్రతి అడుగులో, ప్రతి కర్మలో, ప్రతి విషయంలో, ప్రతి గమనంలో, ప్రతి సంఘటనలో నా జీవితంతో అన్వయించుకొనుచూ వచ్చాను అని మీకు తెలుపుతున్నాను. ఇదియే నా పరమైన ప్రత్యేకతగా భావిస్తాను.  నేను ఈ ఐహిక, అవాస్తవమైన, మిధ్యా ప్రపంచములో దేని వెనుక వెనుక పడలేదు, దేనికోసం వెంపర్లాడలేదు. కొంతకాలం డబ్బుకోసం వెనుక పడ్డాను, కొన్ని నిజాలు తెలుసుకున్నాను, డబ్బు వెనుక పడడం ఆపినాను. నన్ను ఇప్పుడు ఎట్టి విషయం మోహింప చేయలేదు. ఇట్టి స్థితి నరునికి చాలా అరుదుగా అత్యంత అనుభవం, సాధన ద్వారా చేకూరును. ఆ పరమాత్మయే నీకు ఇట్టి దారి చూపి అట్టి స్థితి ఏర్పరుచును. దానికై నీ ఆలోచన, మనస్సును అతనిపై శుద్ధి, నిష్కలంకముగా లగ్నము చేయవలెను. నేను ఎట్టి సంతోషము, ఆనందమునకై అతిగా ప్రయత్నము చేస్తూ అదే ప్రపంచముగా భావించి, అందులోనే తల మునకలై, నీటిలో మునిగి ఉన్నట్లు మునిగి పోలేదు. ఆ పరమాత్మ భజన, ధ్యానము, సేవ,  చరణములయందే అట్టి ఆనందము కలదని ప్రఘాడముగా మనస్సుతో స్పృశించి,అనుభవించి, సాంత్వన చెంది చెప్పుతున్నాను. ఆ విధముగా అతని తలంపులో మునిగిపోయి చెపుతున్న మాటలివి.

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

What are you learning really?