Rudeness leads to darkness, see through eye of heart.

అహంకారంతో అంధకారం ఏర్పడును, అజ్ఞానంతో అహంకారం ఏర్పడుతుంది. అట్టి సమయంలో ఆ పరమాత్ముని చరణములను ఎవ్వరు పట్టుకుంటారో, విశ్వశిస్తారో వారికి భగవంతుని లీలల ద్వారా చీకటిని తొలగించి వెలుగును, తేజస్సును ప్రసాదించి వారికి సన్మార్గమును చూపుతాడు. ప్రళయ కాలంలో వస్తు ప్రపంచము భగవంతునిలో, పరమాత్మలో లీనమవుతుంది. ఉదరంలో, పొట్టలో భద్రముగా కాపాడును. తదుపరి తిరిగి మరల ప్రపంచమును సృష్టించును. ఆ దేవ దేవుడు నిరంజనుడు, ఎటువంటి కలంకము లేనివాడు, నిర్విరాకారుడు, రాగ, ద్వేషాలు ఎవరి యందు ఉండవు, పక్షపాతం ఉండదు, మన్మధుడు కూడా శ్రీకృష్ణుని ముందు ఓడిపోయి దాసుడయినాడు. ఓం కామధేనువాయనమః. శబ్ద ప్రపంచము ఓంకారములో లీనమైపోతుంది. భాగవతం ముందు శుఖ మహర్షి, వ్యాస మహర్షిని మనస్సారా తల్చుకోవాలి. భగవత్గీత లేదా భాగవతం భక్తి ద్వారా భగవంతుని తెలుసుకొనుట, చేరుకోనుట ను తెలియజేస్తుంది, చేరుకోనుటకు మార్గం తెలియజేస్తుంది, చూపుతుంది. మనము ఏ విధముగా, ఏ రూపకముగా త్రికరణ శుద్ధిగా కోరుకుంటామో ఆ విధముగా ఆ పరమాత్మ నీ శక్తిని అనుసరించి, శక్తి ప్రకారం, అనుగుణముగా నీకు దర్శనమిస్తాడు. ఒక దారము తీసుకోనండి. దాని పొడవు 3 లక్షల కిలోమీటర్లు. ఒక కొనను భూలోకంలో నీవు పట్టుకొనుము. రెండవ కొన ఆ భగవానుడు, ఆ దేవ దేవుడు పట్టుకొని ఉన్నాడు అని తలంపుము. అప్పుడు నీవు చేసిన అలజడి, ప్రకంపణము తరంగాల రూపములో ఆ దేవ దేవుని చేరి తిరిగి అది మరల తరంగ రూపములో వెనుకకు ప్రయాణించి మనను చేరి స్పృశించి, చెవులను, బుద్ధి mind ని చేరి, అక్కడి నుండి హృదయము ను Soul చేరును. ఇట్టి సాధనను నీవు హృదయంతో గ్రహించి, ఏకాగ్రతతో చేయవలెను. మనో నేత్రముతో చూడవలెను. అప్పుడు నీవు ఏమి గ్రహించితివో నీకు నీవే ముందు తెలుసుకొని, తిరిగి మరల ప్రపంచమునకు తెలుపుము, తెలియజేయుము.

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

What are you learning really?