Eternal Karma, Pure heart

మనము ఏదైనా తప్పు, ఒప్పు తలచి పని చేసిన పిదప, ఒప్పు పనికి ఇబ్బంది ఉండదు, వెనుకకు తిరిగి చూడనవసరం లేదు, తప్పు పనికి మాత్రం దేవుడు ఏదో ఒక విధముగా, ఏదో ఒక రూపంలో (సంజ్ఞ, మనిషి,వస్తు) నీకు తెలియవచ్చు విధముగా నీ కళ్ళముందు అగుపించునట్లు, కనిపించునట్లు చేస్తాడు, ఇది నా జీవిత అనుభవంతో చెప్పుతున్న  మాట. అన్నిటికంటే pure heart, శుద్ధ మనసు, ఆత్మ ముఖ్యం. మనం జన్మించినదే కర్మ చేయడానికి. ఆ కర్మ శుద్ధత్వానికి భంగము కలుగచేయరాదు. మన పని, ఆచరణ, పద్ధతి, ప్రవర్తన దానికి లోబడి,దానికి అనుగుణముగా ఉండాలి. దైవమును తెలుసుకొని మోక్ష ప్రాప్తి పొందాలి, అనగా శుద్ధ మనసు సంతృప్త, ప్రశాంతత స్థితిని చేరి, ఎట్టి వ్యామోహాలు లేనిదై, భవ బంధములకు అతీతమై, దూరమై అరిశడవర్గాలను జేయించినదై ఉత్తమ స్థితి ద్వారా ఆ పరమాత్మ యందు లయం అగుట. దీనినే పరమ ఆత్మ స్థితి అని కూడా అనవచ్చు. ఇదియే నర జన్మ ఎత్తిన మానవుని పరమార్థము, గమ్యము చేర వల్సిన స్థితి. ఒకరి మనసు నొప్పించరాదు, ఒకరి కడుపు కొట్టరాదు, ఒకరిని నిందించరాదు,  దూషించరాదు, మోసం చేయరాదు, వంచించ రాదు. వీనినే పరమముగా  ఆచరించవల్సినవిగా చెప్పవచ్చును.

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

What are you learning really?