Influence of cinema in real life, One should know What is real life and the differences& limitations of both.
ఈరోజు, ఈ నేటి పరిస్థితుల్లో సినిమాలు చూడనివారు ఎవ్వరైనా ఉన్నారా అంటే ఆశ్చర్య కరమైన ప్రశ్న అవుతుంది. బహుశ జవాబు లేరు అని రావచ్చు. ఇట్టి సినిమా ప్రభావం మన అందరి నిజ జీవితంలో ఎంత? తప్పకుండా చాలామట్టుకు ఉంటుంది అని అందరూ చెప్పుతారు, ఇదియే నా అభిప్రాయం కూడా. ప్రతి సినిమా ఏదో ఒక మంచిని తెలుపుతుంది. ఒక మంచి message ను ఇస్తుంది, ఒక నీతిని తెలియజేస్తుంది. మరి మనలో ఈ సినిమాలలో ఏది ఎంత నేర్చుకోవాలి, ఏది అవసరం, ఏ పాయింట్ మనకు ఉపయోగపడుతుంది, మిగిలిన చెత్తను బుర్రకు ఎక్కించుకోకుండా వదలాలి అని ఎంతమంది దృష్టిని నిల్పుతారు. నేను భారతదేశం యొక్క అందగాన్ని అవునో, లేదో, ఏమో నాకు తెలువదు, కాకపోవచ్చు. కాని నా మనస్సు సాన పెట్టగా, సాధనతో మధించగా మనస్సుతో చాలా అందమైన వానిగా నాది నేను చెప్పుకునే ప్రయత్నము చేస్తాను. ఇది నా మట్టుకు నా గురించి నేను అనుకుంటున్న భావన. మరి నా బాధ నా గురించి అయితే మంచిగానే ఉండు కాని కాదే, నా బాధ అంతా అమాయకులైన భారతదేశ ప్రజలైన మీ అందరి గురించి. అందుకే నా ఆలోచనలను, నేను నమ్మే సత్యములను, వాస్తవానికి దగ్గర అనిపించిన మంచి మాటలను, ఆలోచనలను మీ ముందు ఉంచడం. ఇట్టివి ఏ క్రొద్ది మంది జీవితాలను ప్రభావితం చేసిన, వారి భవిష్యత్తును తిమిరం నుండి వెలుగులోకి తీసుకవచ్చినట్లయితే ఈ నా శ్రమకు స్వార్థకత చేకూరినట్లు, ఇట్టి నా ప్రయత్నముతో నేను కృత కృత్యునిగా భావిస్తాను. నా తృప్తికి ఇది చాలు. దీనిని చదివి నాలుగు విషయాలు నేర్చుకున్నాను, అవి నాకు నిజ జీవితంలో చాలా ఉపయోగపడతాయి, ఎవరికైనా చాలా ఉపయోగపడ్డాయి అన్న భావన నాకు సంతృప్తిని ఇస్తుంది. ఇదియే నాకు నోబెల్ ప్రైజ్ తో సమానం.సినిమా 3 గంటలు అయితే బ్రతుకు సినిమా 100 సంవత్సరాలు, కాని ఎన్నేళ్లు ఈ కాలుష్య, కల్మష ప్రపంచములో బ్రతుకుతామో మన అందరికి తెలుసు. ఒక ఆరోగ్యమైన వ్యక్తి సగటు జీవితకాలం మన అందరికి తెలుసు. నేను ప్రత్యేకముగా చెప్పనవసరం లేదు. ఈ దూరలవాట్ల వల్ల అది చేరుకునుడు కూడా గగనం అయ్యే పరిస్థితి దాపురించింది. ఇక మనది మనమే ఆత్మ విమర్శ చేసుకునే సమయం ఆసన్నమైంది. ఆత్మ సాక్షిని మించిన సాక్షి లేదు. కొంతమంది ఆత్మ సంఘర్షణ కారణముగా తాను చేసిన తప్పుకు guilty ఫీలింగ్ తో వారి తనువు చాలించిన సందర్భములు కూడా మీరు చూసే ఉంటారు. వారు మహానుభావులు నా దృష్టిలో. వారు ముసుగు వేసుకొని బ్రతకజాలరు. అందుకే ఆ పరిస్థితి వారిది. ఈరోజు సమాజం పరిస్థితి ఏమిటి, అది ఎటు వెళ్తుంది, దీనికి సరియైన కంట్రోలర్ ఉన్నారా? అంతా ఆ దేవ దేవుని దయ. ఇక అంతా అతనికే వదిలివేద్దాం. అతనే చూసుకొనును అని ఆశిద్దాం. నేను అయితే అదే ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ||
Comments
Post a Comment