Your Power, My Message
మనిషి ప్రస్తుత పరిస్థితి తో రాజీపడనవసరం లేదు, బాధ పడవద్దు. ధైర్యం అసలే కోల్పోవద్దు. నీ హృదయ అంతరాళంలో నుండి దాగివున్న అపరిమిత శక్తి పై దృష్టి పెట్టు, అది నిన్ను ఏ స్థానంలో ఉంచాలో ఆ స్థానంనకు తీసుకొని పోవును. అదియే దాని బలము గొప్పతనం. నీకున్న శక్తిని నీవు గుర్తించ గలవు, గ్రహించ గలవు, అటులనే నీతో కాని పని, నీలో లేని శక్తిని కూడా గ్రహించగలవు. లేనిది ఉన్నట్లు ఊహించుకోవద్దు,చెప్పవద్దు భ్రమ ప్రపంచములో విహరిస్తూ ఉండరాదు. లేని శక్తి పంచభూతాల సాక్షిగా ఒప్పుకోవాలి. వానిని సాధించటకు ఎప్పుడైనా ప్రయత్నము చేయవచ్చు. అంతేకాని ఉత్తర ప్రఘల్భాలకు పోవద్దు. ఉన్న శక్తిపై పోరాడి దేనినైనా సాధించి అసాధ్యమును సుసాధ్యం చేసుకోవచ్చు. దీనికి నీ పట్టుదల,శ్రమకు అదృష్ట రూపంలో రవ్వంత ఆ దేవ దేవుని చల్లని చూపు తోడవుతే సరిపోతుంది. గుమ్మడికాయంత శ్రమ ఉన్న ఆవగింజ అంత అదృష్టం ఉండాలి అంటారు. ఆ ఆవగింజ అదృష్టమే ఆ దేవ దేవుని ఆశీస్సులు అని అనుకోవచ్చు. ఇట్టి విషయం పెద్దలు చెప్పినది, నా అభిప్రాయం కూడా ఏకీభవించినట్లు. అందరికి శుభం కలుగు గాక ||
Comments
Post a Comment