Your good thought and action will make you to reach God

చిన్నప్పటి నుండి కష్టాలలో పెరిగి,కష్టాలు చూసి చలించిన హృదయం అంత తొందరగా మోసం,నంగా,దొంగ, కుట్రలు, కుతంత్రాలు ఉన్న ప్రవృత్తికి లోనుకారు, వెళ్ళరు అని నేను అనుభవ పూర్వకంగా చెప్పడం. ఇంకా వీలైతే సమాజ ఉద్ధరణకు వీరు పూనుకుంటారు. జల్సా, దుబారా (Lavish&extravagance) ఖర్చుతో పెరిగిన వారు జీవిత పరమార్థం తెలుసుకోక అటువంటి వారు ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఏమి చేస్తారో, ఏమవుతారో వారికే తెలువదు. అంతా ఆ జగన్నాటక సూత్రధారి లీలలు,ఆటలు. అవి మానవ మాత్రులకు అంత తొందరగా,త్వరగా అర్థం కావు. దాని కోసం తపన,తపస్సు ద్వారా అత్యంత శ్రమ,పట్టుదల,దీక్ష,దక్షితతో అతి కష్టముగా తెలుసుకునే ప్రయత్నము సలుపవలెను అనగా చేయవలెను. ఈ ప్రయత్న మార్గంలో కూడా ఓపిక  ఉండక, ఏకాగ్రత లోపించి మరియు ఇతర అనేకానేక కారణాల వలన పట్టు వీడేదరు, ప్రయత్నమును అకస్మాత్తుగా విరమించరాదు, అట్లు విరమించవద్దు. ఆ దేవ దేవుని శ్రీ చరణాలను నమ్మకంతో, విశ్వాసంతో ఎన్ని ఆపదలు, కష్ట, నష్టములు వచ్చినప్పటికీ అట్టి పాద పద్మములను విడువరాదు. వారిని ఆ దేవ దేవుడు, సకల ప్రాణికోటి రక్షకుడు, పరబ్రహ్మ తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇదే నేను నొక్కి వక్కాణిస్తున్నాను. బాబు గోగినేని గారిని కూడా నేను ప్రేమిస్తుంటాను. నా దైవము నాకు నేర్పిన క్రమశిక్షణ, మర్యాద ఇదే. ఎవ్వరి కర్మను ధర్మమును వారు ఆచరించడమే దైవత్వమునకు దారి, మార్గము. ఇతి శ్రీ రాధాకిరణ్ శాస్త్రులు లోక కళ్యాణార్థం విరచితం, ప్రవచితం కరిష్యే ||

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

What are you learning really?