Easy to say but very difficult to follow and implement

చెప్పడం సులభం, ఆచరించడం కష్టం. అది నాకైనా, మీకైనా, ఎవరికైనా. దేవుడు సృష్టించిన ఈ మానవులందరికి వర్తిస్తుంది. అట్టి మనకు మానవ జన్మ ప్రసాదించిన  దేవుడిని కృతజ్ఞతతో మనస్సుతో, పంచ ఇంద్రియాలతో ఆరాధించి, పూజించి ఆ మధుర అమృత తుల్యమైన భగవత్ స్వరూపాన్ని అనగా ఒక్క స్వరూపం అనే కాదు అన్నీ లక్షణాలు, విధులు, హక్కులు మొదలైన సమస్త సమాచారం తెలుసుకోవడమే మన ముఖ్య పని. Life Object of a person after taking birth on holy earth. మనస్సును శుద్ధి చేసుకోవడం కష్టం అనగా ఉత్కృష్టమైనది అని. సత్ బుద్ధి కలగాలి. అందులకు సాధన మనస్సు ద్వారా చేయాలి. మనము తొందరగా mould, motivate ఆవుతున్నాము అంటే బాగా విచారించుకొని పని చేయాలి, మన ఆచరణ తప్పుదిక్కు పోయే అవకాశం ఉంటుంది. దీనిని సంజ్ఞ signal గా గుర్తించాలి. అనుక్షణం అంతరాత్మకు సమాధానం చెప్తుండాలి. ఇలా చేస్తే మరణం తరువాత పరమాత్మకు జవాబు చెప్పడం తక్కువ అవుతుంది అని నా అభిప్రాయం. నా ధ్యానం ద్వారా నేను చెపుతున్నది ఈ విషయం.మనము ఆలస్యముగా mould, motivate అవుతున్నాము అంటే కూడా విచారించుకొనియే పని చేయాలి. కాని ఇప్పుడు మన ఆచరణ ఒప్పు దిక్కు అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. అవకాశం ను మనకు అనుగుణముగా మల్చుకోవడం మన చేతిలో మన కర్మల నియంత్రణ, execution మీద ఆధారపడి ఉంటుంది. దానికి అనుగుణముగా మన కదలిక, గమనం ఉండాలి. అటుల ఆ పరమాత్మ తత్వానికి అత్యంత సాధనతో దగ్గర కావాలి. అట్టి ప్రయత్నము నిరంతరము కొనసాగాలి. కొన్ని గంటల, రోజుల పని కాదు అని నా తలంపు.

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

What are you learning really?