Learn,understand,follow and immerse in the philosophy of Lord Sri Radha Krishna

ఆధ్యాత్మిక భావనలు వ్రాసుకోవాలి, ఎవరైనా చెప్పినప్పుడు శ్రద్ధగా వినాలి. అర్ధమైనట్లు ఉంటాయి కాని తరువాత గుర్తు ఉండవు,రావు, మరచిపోతాము. వానిని మనస్సుతో పట్టుకోగల్గాలి. లేనిచో కర్పూరం వలే ఆవిరైపోతాయి. జీవునికి పరమాత్మకు మధ్య అమ్మవారు మధ్య వ్యస్థితం లేనిచో ఎప్పుడు గొడవ,ఘర్షణ. రాముడు,సీత, లక్ష్మణస్వామి. ముగ్గురి క్రమం. దేవుడు, జీవుడు మధ్యలో అమ్మవారు. వాల్మీకి మహర్షి రచించిన శ్రీరామాయణం మనందరికి ఒక ఆదర్శ కావ్యం మరియు మానవాళికి ఒక వరం. ఏదైనా నువ్వు చేసే ఆలోచన,ధోరణి, మన ప్రయత్నము 90% వృధా పంథాలో తీసుకవెళ్తాము. దీనినే గుర్తింపు కోసం మనము లోకానికి చూపించే ప్రయత్నము చేస్తాము. ఎటులనగా మనము ఏది చేరలేమో, ఏది మనము కాదో, ఏది మనవళ్ల కాదో దాని కొరకు కాలం వృధా చేస్తాము. అదే తాపత్రయంతో దానికై ప్రయత్నము చేస్తుంటాము. ఎదుటివారు గ్రహించాలని తాపత్రయం.సులభముగా చెప్పితే ముసుగు వేషం లో గమనం,కదలిక ఉంటుంది. ముసుగు ప్రయత్నము, ముసుగు ఆలోచన, చింతన. అదే మనమెందో గుర్తెరిగి, మనము ఏమి చేయగలమో, మనవళ్ల ఏది సాధ్యపడగలదో గ్రహించి అట్టి దానికై ప్రయత్నము చేసిన 6 లేదా 30 రోజుల్లో సాధించగలం. లేనిచో 365రోజులైనా, 3 సంవత్సరాలైనా ఏమి చేయలేము. ముసుగును తీసి బ్రతికే ప్రయత్నం చేయాలి. మనస్సు శుద్ధి ఏర్పడును. అప్పుడు అన్ని వాటంతట అవియే పూర్తగును. సదాచారము,సత్ గుణములు ముఖ్యం. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమగును. శ్రీ రాధాకృష్ణులు ఆత్మ, పరమాత్మ కు స్వరూపులు. ఆత్మ శుద్ధి, సౌందర్యం ఇవి రెండూ ముఖ్యం. శుద్ధితో సౌందర్యం లభిస్తుంది. నిస్వార్థమైన సేవ పరమాత్మ సన్నిధికి మార్గం చూపుతుంది. 

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

What are you learning really?