Nothing waste (useless) in this world.
Is duniya me bekhaar ki cheej koi nahi hoti. ఈ విశ్వంలో,ప్రపంచములో పనికిరాని లేదా ఉపయోగకారి కాని వస్తువు అంటూ ఏది లేదా ఏమి ఉండదు. ఈ సృష్టిలో లేదా ప్రపంచములో ఏ క్రొత్త పదార్థమును సృష్టించలేము లేదా నాశనము చేయలేము, ఒక దాని నుండి ఇంకొక పదార్థముగా మాత్రమే అది రూపాంతరము చెందుతుంది. అట్లు మాత్రమే మనందరం చేయగలం. అట్టి వస్తువును ఇంకా effective గా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి,తెల్సుకోవాలి.అనగా ఉపయోగించుకోవడం మనకు తెలిసి ఉండక పోవచ్చు. కావుననే మనం ఉపయోగపడని వస్తువుగా ప్రక్కకు పెట్టి పెడతాము. కొన్ని సందర్భాలలో దానిని అమ్ముతాము, అమ్మడము వీలుకానప్పుడు ఉచితముగా చెత్త తీసుకపోయే వారికి ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు పేపర్, బీరు సీసాలు, electronic మరియు electrical పరికరాలు. అతను దానిని Re processing చేసే వారికి అమ్మి డబ్బును పొందుతాడు. ఒకరికి ఉపయోగపడని, లాభం లేని వస్తువు ఇంకొకరికి ఉపయోగపడవచ్చు లేదా లాభం లేదా ప్రయోజనం కల్పించవచ్చు. దీనిలో నిగూఢమైన Economics, Financial Management ,income,expenditure, saving మొదలగు అనేక ఆర్థిక అంశాలు లోతుగా దాగి ఉన్నాయి అని నా అభిప్రాయం. ఏమిలేని నిరుపేద కూడా ఈ సూత్రమును నమ్ముకొని శ్రీమంతుడు కావచ్చు అని నేను ప్రగాధముగా విశ్వశిస్తాను. మనసు ఉంటే మార్గం ఉంటది అని పెద్దలు అంటారు మరియు చెప్తారు. కొంతమంది ఇదివరకే శ్రీమంతులుగా మారి ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. ఇది వారికి జీవితాన్ని ప్రసాదించింది అన్నమాట కాదు ఉన్నమాట.చూశారా దీని మహత్మ్యం. అందుకే దేనినైనా నిషితముగా పరిశీలిస్తూ, సాధన చేస్తూ పోతే నువ్వు ఎన్నో తెలుసుకోగల్గుతావు, అద్భుతములు సాధించుకోగల్గుతావు మరియు పొందగల్గుతావు. మనస్సు ప్రధానం. మనో నేత్రముతో చూడుము అంటారు. మనసును మించిన వేగము ఈ ప్రపంచములో దేనికి లేదు. కాంతి కూడా దీని వేగం ముందు తలదించుకోవాల్సిందే. మనస్సు తో కూడిన కోరిక,బుద్ధి,తేజస్సు ను నిల్పుకోవాలి.
Comments
Post a Comment