Justice to common Man

Justice to common man. న్యాయం కావాలి. సాధారణ మనిషికి న్యాయం జరగాలి. ఈ భారతదేశంలో. 10 crores ఉన్న వ్యక్తికైనా అన్యాయం చేస్తే, నేరం చేస్తే తప్పకుండా శిక్ష పడాలి. వ్యవస్థలను ఆ పద్ధతిలో కట్టుదిట్టం చేయాలి. అవసరమైన చోట వీలును సమకూర్చుకొని మార్పులు చేయాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. చట్టాలలోని లోపాలను ఆసరాగా చేసుకొని ముసుగు దొంగల లాగా ముద్దాయి లు నేరం చేసినప్పటికీ వారి ధన బలం, రాజకీయ బలంలతో తప్పించుకొని తిరుగుతున్నారు ఈ దేశంలో. ఇట్టి నీచ సంస్కృతితో ఉన్న వ్యవస్థ తక్షణమే మారాలి. ఆ దిశగా ప్రయత్నాలు సాగాలి. దీనికి ముఖ్యముగా భారతీయ యువత ముందుకు వచ్చి, పూనుకొని, నడుము బిగించాలి.  1000 rupees ఉన్న వ్యక్తికి , అది కూడా లేని వ్యక్తి కూడా న్యాయం జరిగే విధముగా వ్యవస్థలు మరియు చట్టములు మారాలి. ఇవి ఎవరి గురించి మారుతున్నాయి. అందరి ప్రజల సంక్షేమం మరియు శ్రేయస్సు గురించి. దీనిని అందరూ మన గురించి మనకు కలిగే మంచి మార్పుకై ఐకమత్యంతో స్వాగతిద్దాం. దీని వలన సమాజం బాగు పడును, దేశం బాగు పడును. చీదపురుగులు నశింపబడును. కొంగ్రొత్త భారతావని మన కళ్ళముందు సాక్షాత్కారింపబడును. అందరూ కలిసి సంతోషముగా,ప్రేమగా ఆ లోకాన్ని ఆహ్వానించండి. స్వేచ్చా పక్షులవలె హాయిగా తీయగా వినీలాకాశంలో ఎగురండి.ఎగిరి గంతు వేయండి.

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

What are you learning really?