Belief
నీ ప్రతిభను నువ్వు నమ్ముకో, నీ నైపుణ్యాన్ని నమ్ముకో, స్వభావమును నమ్ముకో, నాణ్యతను నమ్ముకో, నీ సంకల్పమును, దృఢ నిశ్చయమును నమ్ముకో, నీ పట్టుదల, అకుంఠిత దీక్షను నమ్ముకో, నీ సేవా నిరతిని నమ్ముకో, నీ దయార్ద్ర హృదయాన్ని, నీ అహింసా విధానాన్ని, నీ దాన గుణాన్ని నమ్మకో, నీ సత్య నిరతి, ధర్మానుష్టానమును, నీతి, నిజాయితీ లను నమ్ముకో. విజయం నిన్ను వరించడానికై నీ కొరకై వస్తున్నది, దేవుడు నీ తోనే ఉన్నాడు అని గుర్తించు. ఉద్యోగం, డబ్బు సంపాదించడం/పొందడము గొప్ప కాదు. వాటిని ఎలా కాపాడుకోవాలి/ నిలబెట్టుకోవాలి అనేది చాలా ప్రధానం మరియు అది గొప్ప. గుణము,నేర్పు గొప్ప. ఇదేవిధముగా మంచి,మర్యాద,నడవడి మరియు కీర్తి వీనికి ఈ సూత్రం వర్తిస్తుంది. సత్యము, ధర్మం వీనికి ఆయుధాలుగా ఉపయోగపడును.
Comments
Post a Comment