What you people are doing? Atleast i am bringing into your kind consideration. Your kind notice. Your kind observation. If one eligible person gets it, i am satisfied. I feel great and my job over.
ఈ లోకంలో, ప్రపంచములో ఎందరో గురువులు, విద్యావంతులు,మేధావులు, గొప్పవారు. వారందరికి నా నమో సుమాంజలులు. గురువును మించిన దేవుడు లేడు అంటారు. గురువు యొక్క స్థితి అంతటి గొప్పది. అయితే నా పని నాదే. నా కర్తవ్యం నా దేవుడు. దేవుడు నాకు ఉపక్రమించిన పని నేను చేస్తున్నాను. ఇదియే నా ధర్మం, విశ్వాసం. నేను చేయ కల్గిన, నాకు వచ్చిన పని ఇదియే. నాకు కేటాయించబడిన పని కూడా ఇదియే అని నా ఆత్మసాక్షి చెప్పుతున్నది. నేను నలుగురి ప్రకారం yనడుస్తున్నాను ఈ సమాజంలో. కోటి విద్యలు కూటి కొరకు. అదేవిధముగా నాకు వచ్చిన విద్యతో జీవనభృతి సాగిస్తున్నాను. పరివర్తనయే నా ఆయుధం, ఇది నాకు అత్యంత ప్రీతిపాత్రము. ఈ పరివర్తన సదా దేవుని అనుగ్రహముకై నా ప్రయత్నము సాగును. నేను ప్రకృతి ప్రేమికున్ని. ప్రకృతి అంటే నాకు అమితమైన ఇష్టం. ఇలాంటి ప్రకృతికి కారణ భూతుడు, సృష్టికర్త అంటే ఇష్టం ఉండకుండా ఎలా ఉంటాను. అంతా ఆ పరమేశ్వర ప్రసాదం. దేవుని కృప వల్ల నా సంకల్పము నన్ను ముందుకు తీసుకుపోయి కృత కృత్యున్ని చేయును. ఇదియే నాకు దేవునిపై ఉన్న అత్యంత అచంచలమైన నమ్మకం. నేను నిమిత్త మాత్రుడను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.
వెన్నంటుకోగానే కన్నంటుకోవడం అదృష్టం. నిద్రావస్థ. మనసు ఎప్పుడు మేల్కొని ఉండును. గాఢ నిద్రలో అది కూడా సెదతీరి నిద్రించును. ఇది ఒక మహత్తర ప్రక్రియ. చాలా విచిత్రం. సమాధి స్థితి అని కూడా అనవచ్చు. శ్వాస లేనిచో శరీరం శవంతో సమానం. అనగా బ్రతకడానికి, చనిపోవడానికి మధ్య ఉన్న స్థితిగా చెప్పుకోవచ్చును. అందుకే రేపటికి రూపం లేదు అంటారు. మరు క్షణంలో ఏమి జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. అన్ని అవస్థలలోకన్నా ఇది ప్రత్యేకం. సదా పనిలో నిమగ్నమై అనుక్షణం తీరిక లేకుండా positive work తో ఉండేవారు,గడిపేవారు అదృష్టవంతులు. అది వారికి వరం. అదే వారికి శ్రేయస్సు. వారు ఆ పని ద్వారా నలుగురికి సేవ చేసి వారు బాగు పడినట్లైతే వారి జన్మ ధన్యము. వారు కృతార్థులు. చరిత్రలో నిలిచెదరు. కీర్తి కల్గి ఉందురు. వారు ఎదుటి వారికి ఆదర్శం. ప్రతి ఒక్కరు ఈ విధముగా జీవితం గడిపే ప్రయత్నము చేయవలెను.
శోకము, దుఃఖము.ఇది శత్రువు తో సమానం. దీనిని దరి చేరనియ్యరాదు. దగ్గరికి రానివ్వద్దు. దీనికి వశుడైనవాడు సర్వ నాశనం చెందుతాడు. పతనం చెందుతాడు. ఎంతటి ఘోర కృత్యమైన చేయుటకు ఒడిగడతాడు. నీచ, నికృష్టమైన కార్యాలు చేస్తాడు. కోపానికి వశుడై విచక్షణ కోల్పోయి పాప కార్యాలకు పూనుకుంటాడు. ముందు, వెనుక ఆలోచించడు, చూడడు. మహాపాపాలు వస్తాయి. ఎంత తప్పు అయినా చేస్తాడు. చంపేస్తాను అని లేదా చచ్చిపోతాను అని కోపానికి వశుడై అంటాడు. పాపి చిరాయువు. శరీరం సుఖ, దుఃఖములను అనుభవించుటకు ఉపకరణం. శరీరం తనంతట తానే నశించిపోవాలి లేదా క్షయం కావాలి. విస్తరాకు వలే శరీరం.దానిని జాగ్రత్తగా పుల్లలతో కుట్టి, శుభ్రము చేసి భుజించిన పిమ్మట బయట పడవేస్తాము. అదేవిధముగా మన శరీరం. ఆత్మ హత్య మహాపాపం. అందుకే తన కోపమె తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దాయచుట్టంబౌ. తన సంతోషమే స్వర్గం. అని మహానుభావులు సుమతి శతకంలో ఎంతో అద్భుతముగా సరళమైన పదాలతో చక్కగా వివరించారు కదా!వైరాగ్యానికి నిదర్శనంగా గాలిని/వాయువును చెప్తారు. మల్లెపూలు,చచ్చిన కళేబరము రెండింటి నుండి ప్రసరించును, ప్రయాణించును. వాయువుకు ఎట్టి తేడా లేదు. అన్నిటి యందు సమానముగా ప్ర...
Comments
Post a Comment