సమాజంలో ఎందరో తన స్వలాభం మరియు స్వార్థ ప్రయోజనాల గురించి చాలా మందిని మోసం చేస్తుంటారు. సమాజంలోని పౌరునిగా దానిని విషాదీకరించి ఏది నలుపు ఏది తెలుపు, ఏది గుర్రం ఏది మైదానం, ఏవి పాలు ఏవి నీళ్లు అని చెప్పే భాధ్యత ఉంది అని నేను భావిస్తాను. నా మనసు మరియు దృష్టి అటువైపు ఉండును. ఎందరో అమాయకులను వారి పబ్బం గడుపుకొనుటకు సమిధలుగా వాడుకుంటారు, సొమ్ము చేసుకుంటారు. మోసపూరిత ధోరణితో అవసరానికి కరివేపాకు లాగా వాడుకొని వదిలి వేస్తారు. వారి ప్రాణాలతో చేలాగాటాలు ఆడతారు. వారి అమూల్యమైన ఓటు వేసి నాయకుడిని ఎన్నుకుంటే అతడు వీరిని బలి పశువును చేస్తాడు,నిలువునా మోసం చేస్తాడు. కావున ఇట్టి వారిని ఎండగట్ట వలసిన బాధ్యత మన అందరి పై కలదు. యువత మేలుకో. ఇట్టి దుర్మార్గాన్ని నిగ్గు తేల్చి ప్రజల మధ్య జాగృతి ని తీసుకురావాలి. నవ భారతావని పిలుస్తోంది. దాని నిర్మాణ దిశగా అడుగులు వేద్దాం. మన అందరి కర్తవ్యాన్ని పాటించి స్వర్ణ భారత్ ను సాధిద్దాం.

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

Name and title of the Writings