Pathetic Situation in India

ఈ దొంగల,దోపిడి మరియు బకాసురులతో సదా ఇబ్బంది పడుతూ,మొసంకు గురిఅవుతూ,అభివృద్ధి చెందలేని అమాయకుడు బ్రతుకు జీవుడా అని కాలం వెళ్లదీస్తున్న ఒక సామాన్యుని దయనీయమైన గాథ హృదయ విధారకమైన పరిస్థితి నేటి ప్రపంచములో. ఎవ్వరికి తెలుపలేని అందరికి గోచరిస్తున్న వింత పరిస్థితి. ధన బలము మరియు జన బలము ఉన్నవాడు అధికారము తో ఊగిపోతూ జనాలను మోసం చేస్తూ వారి అమాయకత్వంతో ఆడుకుంటున్నాడు. మంది మరియు మార్బలం ఉన్న వ్యక్తి, కండ బలముతో నలుగురిని ప్రోగు చేసుకొని పెట్రేగి పోతూ సంఘ విద్రోహ శక్తిగా మారి సంఘ విద్రోహ మరియు చేటు కార్యక్రమాలకు పూనుకుంటున్నాడు. ఇట్టి వాడు ఏదో ఒక బలముతో బలహీనున్ని అణునిత్యము త్రొక్కి పెడుతూ, అనగద్రొక్కుతూ,మోసం చేస్తూ వారి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరికి వీరి స్వలాభం మరియు స్వార్థం ఒక్కటే ముఖ్యం. సమాజ శ్రేయస్సు ను పట్టించుకోరు మరియు కాంక్షించరు. ఒకవేళ కొద్ది మంచి ఆలోచన ఉన్నా ఎవరో బాగు చేయాలని చూస్తారు కాని వారు మాత్రం ముందుకు రారు మరియు ఆదిశగా ఎలాంటి సహాయం కాని ప్రయత్నము కాని చేయరు. వీరిని స్వార్థులైన వింత జనులుగా పేర్కొనెదరు చరిత్రలో. ఇట్టి పరిస్థితి ముఖ్యముగా పవిత్ర భారతదేశంలో మిక్కిలిగా మర్రి ఊడలవలె సమాజంలో వాని వ్యవస్థలతో చొచ్చుకపోయింది. ఇట్టి సమాజ చీడపురుగులు రాబందువులవలె ప్రజలను పొడుచుకొని తింటున్నారు. వీరిని సమాజం నుండి ఏరివేసి బహిష్కరించాలి. ఈ చెదలను దానికి కారణ భూతులను సమాజం నుండి వెలివేయాలి. ఆర్థిక సమానత్వం దిశగా మనందరం ముందుకు సాగాలి. ఒక సమతా స్థితి చేరుకోవాలి. అన్ని విషయాలలో సమానత్వం రావాలి, ఆ దిశగా మన అడుగు ముందుకు పడాలి. స్వర్గం అనునట్లు భావించే నవ సమాజాన్ని నిర్మించుకొని నవభారత నిర్మాణాన్ని స్థాపింప చేసుకోవాలి. ఇది ఏ ఒక్కరి భాధ్యత అని అనుకోకండి. భారతీయులందరి కర్తవ్యముగా భావించి ముందుకు వెళ్లి సమిష్టిగా అభివృద్ధి చెందాలి.

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

What are you learning really?