Everything is you (Parameshwar , Paramaatma or Parabrahma

కన్నుకు, కడుపునకు సిగ్గు ఉండదు.మా అమ్మ చెప్పిన సామెత. జీవము నీవే కదా, బ్రోచే భారము నీదేే కదా, నా భారము నీదేకదా. భక్త ప్రహ్లాద. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు.నేను ఎవరు, నా పని ఏమి, నేను ఏమి చేయాలి, అందులకు నేను ఏమి ప్రయత్నము చేయాలి, నాకు ఏమి తెలియాలి, నాకు ఏమి కావాలి, దానికై నా కార్య సాధన సాగుతున్నదా, ప్రయత్నలోపం ఏమైనా ఉన్నదా, నన్ను నేను పూర్తిగా అర్థం చేసుకున్నానా, ఎదుటి వారిని నేను పూర్తిగా అర్థం చేసుకుంటున్నానా,  నా ప్రయాణ దిశ సరియైనదేనా, నేను చేసే పని వల్ల నా జీవునికి తృప్తి కలుగుతుందా, ఉపకార చింతనతో, కర్మతో ఉన్నానా,లేదా? అని మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు. నా జీవిత పరమార్థం ఏమిటి? తెలుసుకొని ఆ దిశలో నా అడుగులు ఉన్నాయా. ఈ విధముగా ఎవరికి వారు ప్రశ్న వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగాలి. ఈ భగవంతుడు ప్రసాదించిన జన్మకు స్వార్థకత చేకూరునట్లు నడుచుకుంటూ కృతకృత్యుడు కావలెను.

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

Name and title of the Writings