Nature of a common man in this natural world

 ఈ ప్రపంచము లోపల జరుగుతున్నవి ఎవ్వరూ మాట్లాడరు, అంతా బయట బయట మాట్లాడతారు. అందరూ పొడి పొడిగా మాట్లాడి మసులు కుంటారు. అందరూ ఇలాగే ఉంటే అభివృద్ధి ఉండదు. ప్రేమ ఉండదు. స్వార్థం నిండును. వీరికి భయం ఎక్కువ. ఏమైనా ఇబ్బంది వస్తుందేమోనని. వీరు నాకెందుకు, నేను ఒక్కడినే ఉన్నానా, నాకు ఏమి అవుతుందో, నలుగురితో నారాయణ అంటే పోలే, మనకు ఎందుకు వచ్చిన కష్టం. దారిన పోయే కంప మన నెత్తిమీద పెట్టుకున్నట్లు అని తలంపు చేస్తారు. మనం పొడి,పొడిగా హాయిగా,సౌకర్యముగా, సుఖముగా, ఆనందంగా ఉన్నామనునదే మనకు/వీరికి ముఖ్యం.అలాగే వీరు తలుస్తారు అనగా ఆలోచిస్తారు దానినే పాటిస్తారు అని అర్థం. వీరికి మట్టి అట్టకుండా పని కావాలి. దాని లాభం కావాలి. వీరు తనకు కలిగే లాభం గురించి ఎంటవరకైనా క్రిందకు దిగజారుతారు. ఏ విధముగానైతే గొంతు నుండి మాట వస్తుందో, కాని అది నాభి నుండి వచ్చినప్పుడు మాత్రమే విశిష్టతను సంతరించుకుంటుంది.

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

Name and title of the Writings