Prime duty after taking birth.
ఇప్పటివరకు జన్మించిన గొప్పవారందరు ఈ లోకానికి ఏమి చేసారు, ఏమి ఇచ్చారు, అనగా ఏమి ప్రసాదించారు మరియి ఈ తరానికి ఏమి చెప్పే ప్రయత్నము చేసారు అని ప్రశ్న వేసుకోండి. మనకు దాని గురించి ఏమి తెలిసును, ఏమి అర్థం చేసుకున్నాము. పరమాత్మ రూపం తత్వము,లీలలు, చెప్పే ప్రయత్నం సాగింది. మనము ఈ లోకంలో ఎలా ఉండాలి,ఏమి చెయ్యాలి, మన విధి ఏమిటి, జీవిత లక్ష్యము ఏమిటి, భగవంతుడు ఎవరు, అతనితో ఎలా నడుచు కోవాలి, ఎలా అతనిని ప్రసన్నం చేసుకోవాలి, వశపర్చుకోవాలి. ఈ జీవితం లో మన ముఖ్య విధి ఏమిటి? జీవితం అర్థం, పరమార్థం ఏమిటి తెలుసుకొని మసిలి వానిని సాధించటకు శ్రమించాలి. ఆ పట్టుదల ఉండాలి. కార్యాచరణ సిద్ధం చేసుకొని ప్రయత్నము సాగించాలి. ఆ విధముగా సాధన చేయాలి. వారి వారి శక్తిని అనుసరించి ఉన్నంతలో వారు కృత కృత్యులయ్యారు. మరి మన సంగతి ఏమిటో మనం ఆలోచించుకోవాలి, తెలుసుకోవాలి.
Comments
Post a Comment