జనత జనార్దన్
జనతా జనార్దన్, నరుడే నారాయణుడు, మానవ సేవయే మాధవ సేవ. ప్రజలకు సాధ్యం కానిది లేదు. వారు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు. వారు. విజ్ఞులు. వారు మేధావులు. ఎన్నో త్యాగాలు చేశారు. ఇలాంటి తరుణంలో వీరిని కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాలను ఏర్పరుచుకునే పంథాలో వీరిని పావులుగా వాడుకుంటున్నారు. వారిని ప్రలోభాలకు లోను చేసి వాడుకొని మోసం చేస్తున్నారు. అమాయకుల ను నమ్మించి సొమ్ముచేసుకొని చివరికి నడి సముద్రంలో వదిలి వెళ్ళిన చందంగా వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. వారిని బలి పశువులుగా చేస్తున్నారు. ఇలాంటి వింత సంస్కృతికి చరమ గీతం పాడవల్సిన సమయం రానే వచ్చింది. ఈ క్రుళ్ళిపోయిన వ్యవస్థలను బాగు చేయకుండా ఎక్కడ ప్రజలు జాగరూకులు అవుతారో అనే ఒక కుంచిత స్వభావులై ,స్వార్థపరులై వారిని నిరంతరము త్రొక్కి పెడుతూ వారి కబంధ హస్తములనుండి జారకుండా ఉండునట్లు జాగ్రత్త పడుతున్నారు. మీదికి మాత్రం మేక వన్నె పులి లా ప్రవర్తిస్తారు. మొసలి కన్నీరు కారుస్తారు. ఓ నా ప్రజలారా ఇక ముందు కల్లిబుల్లి కబుర్లు, మాటలు అసలే నమ్మవద్దు. విజ్ఞానం పెంపొందించుకొని, తెలివితో ఇట్టి వానిని ఎదుర్కొని వారి ప్రయత్నాలను ధీటుగా త్రిప్పికొట్టండి. నిరంతరము జాగ్రత్తతో జాగరూకులై మేల్కొని ఉండండి. అఖండ నవభారత నిర్మాణాన్ని అందరూ కలిసికట్టుగా ఏర్పరుచుకుందాము.
Comments
Post a Comment