Real incident
ఒక జరిగిన సంఘటన. మా ఊరిలో మహాలాక్ష్మీ అమ్మవారి పుష్ప అర్చన చాలా గొప్పగా జరుగుతున్నది. అలాంటి సందర్భంలో మా ఊరిలో దసరా నవరాత్రులప్పుడు దేవి భాగవతం చెప్పిన ప్రవచించిన వ్యక్తి ఆ ఉదయం మరణించారని నాతోపాటు, ఊరిలోని కొంతమందికి తెలిసినది. అట్టి సమయంలో ఆ మహానుభావుని మరణ వార్త నలుగురికి అనగా తెలియని వారికి తెలుస్తుంది మరియు అతనిని స్మరించినట్లు ( స్ఫూరణకు తెచ్చుకోవడం) అవుతుంది కావున అట్టి విషయం ఈ ఆలయంనకు వచ్చిన అందరికి విషయం తెలుస్తుంది అని నేను చెప్పడం జరిగింది. (రాంపెళ్లి సత్యనారాయణ) అక్కడ ఉన్న కార్యక్రమ నిర్వహణలో ముఖ్యుడైనవారు ఇది శుభ సందర్భము అలా తెలపడం వద్దు అని తెలియజేసినారు. వారు పెద్దవారు , వారికి శాస్త్రము తెలుసు కావచ్చు అని నేను మిన్నుకుండి పోయాను. అనగా ఏమి మాట్లాడకుండా ఉన్నాను. కాని నా మనసు ఆలోచన ఏమంటే అతను విజ్ఞాని, మన అందరికంటే అమ్మవారికి దగ్గర, అతనికి ఆమె స్వరూపం,మహిమ ఎక్కువగా తెలుసు కావున అతనిని జ్ఞాపకం చేసుకోవడం మంచి విషయం, మంచి ప్రక్రియ అని నేను తలచాను మరియు నా భావన. దీని గురించి విజ్ఞులు చెప్పవలెను. ఈయన దేవి భాగవతం మరియు శ్రీమత్భాగవతం చాలా సార్లు మా ఊరికి వచ్చి చెప్పినారు. ఇంకొక సంఘటన. ఒకరు ఒక ఊరిలో మోటారు బైక్ దొంగిలించారని ఆ ఊరి ప్రజలు అతనిని కట్టి వేసి తీవ్రముగా కొట్టినారు. దానికి గాను అతను తీవ్రముగా గాయపడి చనిపోవడం జరిగింది. ఇక్కడ పరిస్థితి ఘోరం. ఇద్దరిలో తప్పు ఉంది. చట్టమును ప్రజలు వారి చేతిలోకి తీసుకోవడం చాలా తప్పు. అతడిని పోలీసులకు అప్పగించవలసింది. కాని వారు అలా చెయ్యకపోగా అతడిని తీవ్రముగా హింసించారు. దాని పర్యవసానం ఒక ప్రాణం గాలిలో కలిసినది.
Comments
Post a Comment