Hard work leads to Sucess

అనుగ్రహం విజయము ను చేకురుస్తుంది. ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన పనులు చేపించి, ఉన్నత శిఖరాలను చేరే విధముగా ప్రేరేపించి, ఆ శిఖరాలు చేరు కుంటారు. గుమ్మడికాయ అంత శ్రమ ఉన్నా, ఆవగింజ అంత అదృష్టం ఉండాలి అంటారు. ఎంత సామర్థ్యం, ఎంత శక్తి, ఎంత బలం, ఎంత అందం, ఎంత మంచి, ఎంత వచ్చు, ఎంత పని తనం ఉన్నది అని ఎవరికి వారే గొప్పగా భావించక, మెదడులో వీటిని తీసి ఖాళీ చేసి బ్రహ్మ జ్ఞానం ను నింపాలి . ఒకవేళ అన్ని తెలిసినా, అన్ని ఉన్నా కూడా అనుగ్రహం కావాలి లేదా ఉండాలి. అప్పుడే నువ్వు కృతకృత్యుడవు అవుతావు.సాధిస్తావు. సూర్యరశ్మి రావాలంటే ఏమి చేయాలి, కిటికీ తీయాలి, అదేవిధముగా నేను,మేము అహం తీసివేయాలి. అప్పుడు అనుభూతి చెందాలి. ఒక రూమ్ లో ఉన్న అన్నీ వస్తువులను ఖాళీ చేసి లేదా తీసువేసి న పిదప నువ్వు అక్కడ కూర్చొని శ్వాస తీసుకుంటే ఏ విధముగా అనుభూతి చెందెదవో అదే విధముగా. ఈ ప్రపంచములో, లేదా విశ్వం లో నీ స్థానం దూది పింజ వలె. A Small Part of raw cotton.దూది పిడక , పిడత వలె. గాలికి కొట్టుకపోయి మరల కనిపించదు. ప్రపంచము అలాగే ఉంటుంది. కానీ మన Existence స్థితి ఉండదు మరియు మారినది. ప్రపంచమునకు ఏ మాత్రం తేడా లేదు,మార్పు లేదు, కనీసం పట్టించుకోవడం కూడా లేదు, స్మరణ, స్మరించడం అసలే లేదు. ఇతను స్వార్థమైనవాడు. పరోపకారి కాదు. మంచి నోటి నుండి ఏ నాడు రాలేదు, మంచి చేయలేదు,మంచి కోరలేదు. పైపెచ్చు ఇతరుల కడుపు కొట్టి దోచుకొని తినేవాడు. ఒక్కడే చీకటి గది లో రాక్షసునివలె. ఎందుకంటే ఎవరైనా వస్తే వారికి పెట్టాలిగా. అందుకే అతను ఎవరికి గుర్తుకు రాడు, ఒకవేళ వచ్చినా చెడ్డవానిగా.  సంతోషం తో జీవించడానికి కావలసినవి    1. వినయం, గౌరవం, పెద్దవారికి,గురువులకు  నమస్కరించడం ,ప్రేమించడం 2. నీ బలమైన, గొప్ప లక్షణాలను, మరియు ఆనందాన్ని దాచుకోవద్దు, వ్యక్తపర్చాలి, తెలియజేయాలి. దాని ద్వారా మనసు తేలికై మరియు కొంత తృప్తికి లోనై, ఒత్తిడి, బాధ దూరం అవుతుంది. 3. అందరికి మరణం తప్పదు, Death is inevitable, అనివార్యమగు ఈ విషయముగ్రహించిన వారై దాని  గూర్చి చింత, శోకము తగదు. ఉన్నంత వరకు సంతోషముగా,ఆనందంగా ఉండే ప్రయత్నము చేయాలి 4. ప్రేమను పంచాలి మరియు పెంచాలి. పనిని ప్రేమిస్తూ చేయాలి. 5. సుఖము, సంతోషము మరియు ఆనందము చిన్న ఇల్లు లేదా పెద్ద ఇల్లు లేదా నువ్వు చూసే వస్తువుల్లో ఖరీదైన వస్తువుల్లో లేదు. నీలో, నీ భావనలో,నీ మనసులోనే ఉంది అని భావించి తెలుసుకోవాలి.

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

What are you learning really?