Give information whatever you know
నీకు కావలసినది, నీవు కోరుకున్నది ,దానికై నీ పరుగు, నీ ఆరాటం దానికై నీవు పరుగెత్తి,పరుగెత్తి అలసి,సొలసి సేద తీరునప్పుడు నీ భావన, నీ అనుభూతి అతి మధురం,మాధుర్యం మరియు ముద్దమందారం. దానిని మాటలలో వర్ణించలేను. అప్పుడు తీసుకునే విశ్రాంతి ఆహ్లాదం,ఆనందము మరువలేని, మరచిపోని తీపి గుర్తు. శ్రీమన్నారాయణుడు శేషతల్పము పై విశ్రమించువలే. కావలసినది,కోరుకున్నది దొరికినప్పుడు,పొందినప్పుడు క్షీర సాగర మాధనములో చివరగా అమృతము లభించిన పిదప ఎలాంటి అనుభూతి పొందారో లేదా చెందారో అలా ఉంటుంది. మన ఈ పరుగు ఎవరి కోసం, దేని కోసం, ఏమి కావాలి,ఏమి సాధించడానికి, లక్ష్యము ఏమి, ఏ కోరికను పొందుటకు లేదా సాధించటకు. ప్రయాణం,గమ్యం ఎటువైపు. వీటి జవాబు నీకు తెలియాలి. దీనిపై దృష్టి నిలపాలి.ఈ భూమి మీదకు వచ్చి నువ్వు చేయవలసిన అతి ముఖ్యమైన పని, ముఖ్యమైన ధర్మం ఏమిటి, అది తెలుసునా. భగవంతుని స్వరూపమును ఎదో ఒక నీకు తెల్సిన పద్ధతిలో పద్యం లేదా వచన రూపంలో వివరించడం. గొప్పవారు చేసింది ఇదే. దేవుడిని చేరుటకు నీవు ఎంత దూరంలో ఉన్నావు, మిగిలిన నీ తోటి ప్రయాణికులు ఎంత దూరంలో ఉన్నారో తెలియచెప్పడం. నువ్వు ఆ స్థితి పొందాలి, తరువాత లోకానికి చెప్పాలి లేదా తెలియజేయాలి. దేవుని గూర్చి నీకు తెలిసినది, అర్థమైనది,అనుభూతి చెందినది,చేరువ చేసేది తెలియజేయాలి.
Comments
Post a Comment