నీకు కావలసినది, నీవు కోరుకున్నది ,దానికై నీ పరుగు, నీ ఆరాటం డానికై నీవు పరుగెత్తి,పరుగెత్తి అలసి,సొలసి సేద తీరునప్పుడు నీ భావన, నీ అనుభూతి అతి మధురం,మాధుర్యం మరియు ముద్దమందారం. దానిని మాటలలో వర్ణించలేను. అప్పుడు తీసుకునే విశ్రాంతి ఆహ్లాదం,ఆనందము మరువలేని, మరచిపోని తీపి గుర్తు. శ్రీమన్నారాయణుడు శేషతల్పము పై విశ్రమించువలే. కావలసినది,కోరుకున్నది దొరికినప్పుడు,పొందినప్పుడు క్షీర సాగర మాధనములో చివరగా అమృతము లభించిన పిదప ఎలాంటి అనుభూతి పొందారో లేదా చెందారో అలా ఉంటుంది. మన ఈ పరుగు ఎవరి కోసం, దేని కోసం, ఏమి కావాలి,ఏమి సాధించడానికి, లక్ష్యము ఏమి, ఏ కోరికను పొందుటకు లేదా సాధించటకు. ప్రయాణం,గమ్యం ఎటువైపు. వీటి జవాబు నీకు తెలియాలి. దీనిపై దృష్టి నిలపాలి.ఈ భూమి మీదకు వచ్చి నువ్వు చేయవలసిన అతి ముఖ్యమైన పని, ముఖ్యమైన ధర్మం ఏమిటి, అది తెలుసునా. భగవంతుని స్వరూపమును ఎదో ఒక నీకు తెల్సిన పద్ధతిలో పద్యం లేదా వచన రూపంలో వివరించడం. గొప్పవారు చేసింది ఇదే. దేవుడిని చేరుటకు నీవు ఎంత దూరంలో ఉన్నావు, మిగిలిన నీ తోటి ప్రయాణికులు ఎంత దూరంలో ఉన్నారో తెలియచెప్పడం. నువ్వు ఆ స్థితి పొందాలి, తరువాత లోకానికి చెప్పాలి లేదా తెలియజేయాలి. దేవుని గూర్చి నీకు తెలిసినది, అర్థమైనది,అనుభూతి చెందినది,చేరువ చేసేది.
కర్తవ్యమే దేవుడు
ఈ లోకంలో, ప్రపంచములో ఎందరో గురువులు, విద్యావంతులు,మేధావులు, గొప్పవారు. వారందరికి నా నమో సుమాంజలులు. గురువును మించిన దేవుడు లేడు అంటారు. గురువు యొక్క స్థితి అంతటి గొప్పది. అయితే నా పని నాదే. నా కర్తవ్యం నా దేవుడు. దేవుడు నాకు ఉపక్రమించిన పని నేను చేస్తున్నాను. ఇదియే నా ధర్మం, విశ్వాసం. నేను చేయ కల్గిన, నాకు వచ్చిన పని ఇదియే. నాకు కేటాయించబడిన పని కూడా ఇదియే అని నా ఆత్మసాక్షి చెప్పుతున్నది. నేను నలుగురి ప్రకారం yనడుస్తున్నాను ఈ సమాజంలో. కోటి విద్యలు కూటి కొరకు. అదేవిధముగా నాకు వచ్చిన విద్యతో జీవనభృతి సాగిస్తున్నాను. పరివర్తనయే నా ఆయుధం, ఇది నాకు అత్యంత ప్రీతిపాత్రము. ఈ పరివర్తన సదా దేవుని అనుగ్రహముకై నా ప్రయత్నము సాగును. నేను ప్రకృతి ప్రేమికున్ని. ప్రకృతి అంటే నాకు అమితమైన ఇష్టం. ఇలాంటి ప్రకృతికి కారణ భూతుడు, సృష్టికర్త అంటే ఇష్టం ఉండకుండా ఎలా ఉంటాను. అంతా ఆ పరమేశ్వర ప్రసాదం. దేవుని కృప వల్ల నా సంకల్పము నన్ను ముందుకు తీసుకుపోయి కృత కృత్యున్ని చేయును. ఇదియే నాకు దేవునిపై ఉన్న అత్యంత అచంచలమైన నమ్మకం. నేను నిమిత్త మాత్రుడను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.
Comments
Post a Comment