My experience and message especially for Students and Youth

నేను చెప్పేది చాలా మందికి ముఖ్యముగా విద్యార్థులకు మరియు యువత గురించి. మీరు ఉదయం నిద్రలేచే సమయం కంటే 1 గంట ముందు లేవండి. మీ కార్యాచరణ ప్రారంభించండి. మీ దైనందిన జీవితాన్ని కొనసాగించండి. చదువుకునే వారికి కూడా అనుకూలమైన సమయం అవుతుంది. మెదడు fresh గా ఉండి చదివింది తొందరగా అర్థం అయ్యి ఎక్కువ కాలం గుర్తు పెట్టుకునేలాగా ఉంటుంది. అందుకే మన పెద్దలు బ్రహ్మి ముహూర్తంలో ఉదయం లేవమని చెప్తారు. సుమారుగా 4.00 నుండి 4.45 వరకు.  ఒక సామాన్య సాధారణ సూత్రము. మనం తొందరగా ఏ పనైనా చేసుటకు మొగ్గు చూపిస్తున్నాము అంటే అది మనకు క్షేమదాయకం మరియు లాభదాయకం కాదు. అటువంటిది మనం తొందరగా కార్యోన్ముఖులం కావడం లేదు అంటే అది మనకు క్షేమదాయకం మరియు లాభదాయకం అవుతుంది. దీనికి ఉదాహరణగా నిద్రలేవడంనే తీసుకోండి. మీరు ఏ పనికి ఉపక్రమించే ముందు అయినా 1నుండి3 నిమిషాలు ఆలోచించి ఇది క్షేమదాయకం అవునా కాదా అని మీకు మీరే ప్రశ్న వేసుకోండి లేదా ఉత్పన్నం చేసుకోండి. మీకే జవాబు వస్తుంది. దానికి అనుగుణముగా ముందుకు వెళ్ళండి. ఏ పని చేసిన ముందు వెనుక ఆలోచించండి. తొందరపడవద్దు. ఉరుకులాడి మనం సాధించేది ఏమి లేదు. నిధానమే ప్రధానం. దీనివల్ల మన జీవితంలో వచ్చే ఎన్నో పెను ప్రమాదాలను అవి మన ధరి చేరకముందే వాని నుండి విముక్తి కలుగజేయును. ఇది అక్షర సత్యం. నా అనుభవపూర్వకం. It is a proved one. ఇది నిరూపింపబడిన సత్యము. అందుకనే మిత్రులారా ఎల్లప్పుడూ ఆలోచనతో, జాగ్రత్తతో అడుగు ముందుకు వేసి బంగారు భవిష్యత్తును సాక్షాత్కారం చేసుకోండి మరియు ఏర్పరచుకొండి.

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

What are you learning really?