Voice to raise Question
నాలోని ఈ భావనలు మరి ఈ సమాజంకు పనికి వస్తాయా లేదా, నాలో నేను దాచుకోలేను. నాకు భయం, భీతి లేదు. ఎలాంటి పర్యవసానానికైనా నేను సిద్ధమే. అందరూ నలుగురితో నారాయణ అంటే పోలా, ఎందుకు వచ్చిన తిప్పలు, గొడవలు అని అనుకుంటారు. నా అభిమతం అలా కాదు. నేను అలా కూర్చోలేను. నా భావనలు సరియైనవా, తప్పా అని నేను తప్పకుండా తెల్సుకోవాలనుకుంటాను. నేను చెప్పేవి సమాజం నుండి positive response వస్తే ఇంకా ప్రయత్నము చేస్తాను. మన దేశంలో భావ ప్రకటన స్వాతంత్ర్య హక్కు ఉంది, దానిని ఎవ్వరూ ఎందుకు పట్టించుకోరు, ఉపయోగించుకోరు అని నా అభిప్రాయం. సమాజంలో జరుగుతున్న మంచి,చెడు మరియు తప్పు ఒప్పుల మీద ఒక రెండు మాటలు మాట్లాడరు. సమాజ అభివృద్ధి,శ్రేయస్సు గురించి పాటు పడరు. అందరూ ఇలాగే అనుకుంటే దేశ భవిష్యత్తు పరిస్థితి ఏమిటి. ఇది నాకెందుకు అనుకుంటారా మీరు? ఓటు వేసి నాయకుని ఎన్నుకోగానే మీ బాధ్యత అయిపోదు. అతను సమాజం అభివృద్ధికి పాటు పడుతూ అతని విధిని సరిగా నిర్వహిస్తున్నాడా లేదా చూసి లేనట్లయితే అతనికి గుర్తు తెచ్చి నిలదీయాలి. అతన్ని ప్రశ్నించే గళం మీరు కావాలి. అప్పుడే ఈ దేశం ముందుకు పోతుంది.
Comments
Post a Comment