Infront of my eyes

విధి ఎంత చిత్రమో, విచిత్రమో. ఎందుకంటే ఈరోజు నా కళ్ళముందు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంలో ( accident) ఒక వ్యక్తి అత్యంత దారుణంగా చనిపోయినారు, రెండవ అతను చిన్న గాయంతో ప్రాణాలతో బయట పడినారు. ప్రమాదానికి కారణం మద్యం త్రాగి మోటారు బైకను స్పీడ్ గా నడపడం. కాని ఈ జరిగిన సంఘటనను తొందరగా మర్చిపోలేకపోతున్నాను. జీవితంలో ఎదురయ్యే,జరిగే,సంభవించే మరియు మనము చేసే పనులుకాని, సంఘటనలకు కాని తిరిగి అవకాశం ఇచ్చే విధముగా కొన్ని ఘటనలు,సంఘటనలకు తావు ఉండదు. ఉదాహరణ పైన చెప్పిన ప్రమాదం. కావున జీవితంలో మనిషి ఎంత అప్రమత్తముగా ఉన్నా, ఎంత జాగ్రత్త పడినా తక్కువే అవుతుంది. మనకు తోచని,ఊహించని,ఆలోచించని,చూడని,ఊహకందని, తెలివికి చిక్కని, అంతుచిక్కని ఎన్నో ప్రమాదాలను ముందుగా మనం పసి కట్టలేము. కావున ప్రతి అడుగులో తొందరపాటుగా ప్రవర్తించకుండా, మెదడు పెట్టి గట్టి ఆలోచనతో , తెలివిగా ముందుకు వెళ్ళాలి. తరువాత దైవాధీనం. దేవుని దయ. మన చేతిలో ఉన్నంతవరకు జాగ్రత్తలు పాటించాలి. ఆ తరువాత అంతా విధి. ఈ మన గమనం అది ఆడిస్తున్న వింత నాటకం. ఆ నాటకంలో మన పాత్రదారులం. రంగస్థలంలో పాత్రధారులు వస్తూ ఉంటారు మరియు పోతూ ఉంటారు. రంగస్థలం ఈ ప్రపంచ భూమి. రంగస్థలంలో తెర ఉంటుంది. అదే మన ఆకాశం. ఇది నేను చెప్పిన విషయం కాదు. మహాకవి పోతనగారు చెప్పినట్టి విషయం. బహుశ మీకు తెలిసే ఉంటుంది. ఈ సందర్భముగా ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటున్నాము.

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

What are you learning really?