నేను పోని, వేళ్ళని మరియు పోలేని,వెళ్లలేని మరియు స్పృశించనివి ఎవరైనా తెలుసుకొని, వెళ్లి ఈ ప్రజల సంక్షేమానికి కృషి చేసినట్లయితే మొదటగా సంతోషించేవాడిని నేనే.
ఈ లోకంలో, ప్రపంచములో ఎందరో గురువులు, విద్యావంతులు,మేధావులు, గొప్పవారు. వారందరికి నా నమో సుమాంజలులు. గురువును మించిన దేవుడు లేడు అంటారు. గురువు యొక్క స్థితి అంతటి గొప్పది. అయితే నా పని నాదే. నా కర్తవ్యం నా దేవుడు. దేవుడు నాకు ఉపక్రమించిన పని నేను చేస్తున్నాను. ఇదియే నా ధర్మం, విశ్వాసం. నేను చేయ కల్గిన, నాకు వచ్చిన పని ఇదియే. నాకు కేటాయించబడిన పని కూడా ఇదియే అని నా ఆత్మసాక్షి చెప్పుతున్నది. నేను నలుగురి ప్రకారం yనడుస్తున్నాను ఈ సమాజంలో. కోటి విద్యలు కూటి కొరకు. అదేవిధముగా నాకు వచ్చిన విద్యతో జీవనభృతి సాగిస్తున్నాను. పరివర్తనయే నా ఆయుధం, ఇది నాకు అత్యంత ప్రీతిపాత్రము. ఈ పరివర్తన సదా దేవుని అనుగ్రహముకై నా ప్రయత్నము సాగును. నేను ప్రకృతి ప్రేమికున్ని. ప్రకృతి అంటే నాకు అమితమైన ఇష్టం. ఇలాంటి ప్రకృతికి కారణ భూతుడు, సృష్టికర్త అంటే ఇష్టం ఉండకుండా ఎలా ఉంటాను. అంతా ఆ పరమేశ్వర ప్రసాదం. దేవుని కృప వల్ల నా సంకల్పము నన్ను ముందుకు తీసుకుపోయి కృత కృత్యున్ని చేయును. ఇదియే నాకు దేవునిపై ఉన్న అత్యంత అచంచలమైన నమ్మకం. నేను నిమిత్త మాత్రుడను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.
వెన్నంటుకోగానే కన్నంటుకోవడం అదృష్టం. నిద్రావస్థ. మనసు ఎప్పుడు మేల్కొని ఉండును. గాఢ నిద్రలో అది కూడా సెదతీరి నిద్రించును. ఇది ఒక మహత్తర ప్రక్రియ. చాలా విచిత్రం. సమాధి స్థితి అని కూడా అనవచ్చు. శ్వాస లేనిచో శరీరం శవంతో సమానం. అనగా బ్రతకడానికి, చనిపోవడానికి మధ్య ఉన్న స్థితిగా చెప్పుకోవచ్చును. అందుకే రేపటికి రూపం లేదు అంటారు. మరు క్షణంలో ఏమి జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. అన్ని అవస్థలలోకన్నా ఇది ప్రత్యేకం. సదా పనిలో నిమగ్నమై అనుక్షణం తీరిక లేకుండా positive work తో ఉండేవారు,గడిపేవారు అదృష్టవంతులు. అది వారికి వరం. అదే వారికి శ్రేయస్సు. వారు ఆ పని ద్వారా నలుగురికి సేవ చేసి వారు బాగు పడినట్లైతే వారి జన్మ ధన్యము. వారు కృతార్థులు. చరిత్రలో నిలిచెదరు. కీర్తి కల్గి ఉందురు. వారు ఎదుటి వారికి ఆదర్శం. ప్రతి ఒక్కరు ఈ విధముగా జీవితం గడిపే ప్రయత్నము చేయవలెను.
Comments
Post a Comment