Godess on the Earth, Mother.

మాతుహు. Mother, Mummy,అమ్మ,తల్లి. జీవితంలో తల్లిని మించిన దైవం, అంతకు మించిన దగ్గరి చుట్టం లేదా బంధువు లేరు. నీకు సదా వందనం. ఏమిచ్చినా నీ ఋణం ఈ జన్మకు కాని ఏ జన్మకు కాని తీర్చికోలేను. ఏమిచ్చినా నీ రుణం తీర్చికోలేను. నీ తరువాత స్థానమే ఎవరికైనా. తరువాత స్థానం తండ్రిది. వీరే ప్రత్యక్ష దేవుళ్ళు ఆ సంతానానికి. అలాంటి వీరి ప్రేమ దూరమైతే దొరకదు. దీనిని డబ్బుతో కొనలేము. అంగడిలో దొరికేది కాదు. ఇది దూరమైన వారి బాధ వర్ణించలేము, చాలా అతి దురదృష్ట వంతులుగా చెప్పవచ్చు లేదా పేర్కొనవచ్చు. వారి దీవెనలు దైవ దీవెనలు. కావున వారి ఉపస్థితి మన జీవితంలో అమూల్యం, అజారామరం, అతిమధురం, మరపురానిది, మరువ లేనిది. వెలకట్టుటకు సాధ్యం కానిది. వెల కట్టే సాహసం అసలే చేయవద్దు. ఎంత జీవితంలో వీలైతే వారితో గడిపే విధముగా చూసుకోవాలి. వారి చల్లని నీడలో సేద తీరి విశ్రమించాలి. ఆ రుణం ఏమి చేసిన ఎన్ని జన్మలైనా తీర్చుకోవడం కష్టసాధ్యం. వారితో ప్రేమతో, మర్యాదగా నడుచుకుందాం. వారిని సదా స్మరించుకుందాం. వారి అడుగుజాడల్లో నడిచి ఆదర్శంగా నిలుద్దాం. ఈ భూమి మీద ఉన్న ప్రత్యేక్ష దైవం, అమ్మవారు కన్న తల్లి అమ్మ. Godess on the earth is nothing but mother. అవనిపై ఉన్న దేవత తల్లి. లోకంలో చెడు తల్లి ఉండదంటారు. లోకాలనేలే తల్లి ఆ తల్లి, ఇక్కడ పిల్లలను ఏలే తల్లి ఈ తల్లి. ఇది ప్రపంచములోని అందరూ తల్లిదండ్రులకు ప్రేమతో అంకితం.

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

Name and title of the Writings