True education to be delivered or released
ప్రజలు చదువు మరియు విద్యావ్యవస్థ పట్లగల అశ్రద్ధ మరియు నిర్లక్ష్య వైఖరిని ఏ మాత్రం ఉపేక్షించారు దుమ్ము దులుపుతారు. Education చదువును వ్యాపారంగా చూస్తున్నారు. ప్రభుత్వం దీనిపై చాలా దృష్టి పెట్టాలి. ఇది విద్యార్థి భవిష్యత్తు, తల్లిదండ్రులు కట్టుకున్న ఆశలతో కూడుకున్నది. దీనిలో ఎన్నో emotions, love, sacrifice, desire ఇలా చాలా దాగి ఉంటాయి. ప్రతి విద్యార్థికి, వారి తల్లిదండ్రులకు ఇదే ప్రథమం. కావున దీనిపై ఎంత దృష్టి పెట్టిన, ఎన్ని మార్పులకు శ్రీకారం చుట్టిన తక్కువే అవుతుంది. దీని విలువ మనం విలువ కట్టలేనంత. ఇట్టి వ్యవస్థలో ఎన్నో లోటుపాట్లు. సరియైన విద్యా వ్యవస్థ,ప్రణాళికలు, లేవు అని నా అభిప్రాయం. దీనిపై ఎంత కసరత్తు జరిపిన తక్కువే అవుతుంది. ఒక 7వ తరగతి, ఒక 10వ తరగతి చదవడం చాలు అట్టి పరిస్థితుల్లో. విద్యార్థులకు నేను ఇప్పుడు చెప్పే కొన్ని విషయాలు ఏ గురువు చెప్పరు, ఏ పుస్తకంలో చదువలేరు, దొరకదు ఎందుకనగా ఉండదు కనుక. విషయమేమనగా గురుకుల విద్యావిధానంలో అక్కడే విద్యార్థులు ఉండకుండా ఇంటికి వెళ్లే విధముగా, touring ఉండే విధముగా ఉండాలి. మ్రొక్కయి వంగనిది మానై వంగునా అని సామెత కావున మీరు 2సం ల నుండి 22 సం ల వరకు ఏమి చదివినా ఆ చదువుకై ఎంత కష్టపడినా. ప్రణాళికాబద్ధముగా, అవసరముకనుగుణముగా, ఇష్టతను అనుసరించి, అది అతనికి livelihood జీవిత గమనం మరియు జీవనభృతి కై ఉపయోగపడాలి, పనికి రావాలి, ఆలోచనలను రేకెత్తించేవిధముగా ఉండాలి, ప్రతిభ, నైపుణ్యాలను పెంపొందించాలి,విజ్ఞానమును పెంచాలి మరియు నలుగురికి చెప్పడం ద్వారా వారి విజ్ఞానమును పెంచేవిధముగా ఉండాలి. మంచి మార్పుకు దోహదకారి కావాలి. నేర్చికునేటప్పుడే ఇంగ్లీష్ కాక వేరే మాధ్యమంలో ఉన్నవారు ఇంగ్లీషులో కూడా తెలుసుకునే ప్రయత్నము చేయాలి. ఉన్నంతలో అవసరం వరకు దానికంటే ఎక్కువ ఆ విద్యార్థి దశలోనే hard work, శ్రమ చేయాలి. By heart కాకుండా విషయమును అవగాహన చేసుకునే ప్రయత్నము చేయాలి. నీకు తెల్సినదానిలో strong గా ఉండాలి తెలువంది ఒప్పుకోవాలి. అవసరం మేరకు నేర్చుకోని అర్థం చేసుకునే ప్రయత్నము చేయాలి.
Comments
Post a Comment