Our Responsibility

My aim or goal and object is that I should reach and my word should reach 130 crores Public of this Holy Bharat/ India. And next to 770 crores of this world. గుడ్డి ఎద్దు చెనులో పడినట్లు పోరాదు. నీ కంటూ ఒక ఆలోచన, స్థిరమైన దృఢ చిత్తం, అభిప్రాయం తో ముందుకు వెళ్ళాలి. ఇది ఎలా వస్తుంది. చదువు మరియు విజ్ఞానం ద్వారా ఇది వస్తుంది మరియు అందుతుంది. దొంగలు, దొంగలు కలిసి ఊర్లు పంచుకుంటున్న విధముగా ఉంది భారతదేశ పరిస్థితి. చలి,ఎండ మరియు వానలో మన దేశ సైనికులు అహర్నిశలు రాత్రి అనకా పగలు అనకా ఈ పవిత్ర భారతదేశాన్ని మరియు ఇక్కడి గొప్ప ఉన్నత విలువలు కల్గిన ప్రజలను రక్షిస్తున్నారు. కాని ఈ అమాయక సైనికులకు తెలువదు ఈ ప్రజల్లోని కొంతమంది మరికొంత మందిని లూటీచేస్తూ,హరిస్తూ నిర్దయతో భక్షిస్తున్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి వారికి అనుగుణముగా మార్పు చేసుకుంటూ లోపాలు ఉన్నట్లయితే సవరించక వానినే కొనసాగిస్తూ ( వారి దోపిడీకి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి కావున) వారి వారి పబ్బం గడుపుతున్నారు. అనుక్షణం అతని ఉనికి స్వలాభం గురించి ఎదుటి వారిని మోసం చేస్తున్నారు. ఇదియే పునరావృతం అవుతున్నది. భారతీయ పౌరులందరు ఐకమత్యంతో సంఘటితమై దీనిని రూపుమాపి, కూకటివేళ్ళతో పెకిలించి వానిని పూర్తిగా తీసివేసి నిర్వీర్యమైన వ్యవస్థలను కాపాడాలి అని నేను మనన్ఫ్యూర్తిగా కోరుతూ మీ అందరిని అభ్యర్థిస్తూ వేడుకుంటున్నాను. ఇది భారతదేశ ఉనికికి విఘాతం కలిగించే సమస్య మరియు ప్రమాదకర పరిస్థితి. ముఖ్యముగా యువత దీనియందు ప్రత్యేక దృష్టి నిలపాలి. ఎందుకనగా వారి అనేక అవకాశాలు, ఉద్యోగాలు మరియు కలిగే అభివృద్ధి కి ఇవి తీరని చేటుచేసి విఘాత పరుస్తాయి. దీని వలన ఎందరో అమాయకుల అభివృద్ధి హరించిపోతుంది. ఎవ్వరిది పాపం, ఎవ్వరికి చెందాలి ఈ పాపం, ఎవ్వరకావున ఓ యువత వెంటనే మేల్కొనండి, నిద్రపోతున్నవారిని మేలుకొల్పండి. కార్యదీక్షకు పూనుకోండి. ఈ పవిత్ర భారతదేశాన్ని మనమందరం కలసి కట్టుగా ఉండి కాపాడుకుందాం. కొంగ్రొత్త భారతావని లోకి అడుగిడుదాం. భోలో స్వతంత్ర భారత్ కీ జై. భోలో భారత్ మాతాకీ జై. వందే మాతరం.

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

What are you learning really?