Present pathetic situation
ఈ రోజు వాతావరణం ఎలా ఉంది అంటే స్వేచ్ఛగా ఏదైనా,ఏమైనా వ్యక్తీకరించడానికి, తెలియజెప్పాడానికి, భావజాలంను ప్రకటించడానికి చాలా ఇబ్బంది, కష్టపడవల్సి వస్తున్నది. కొన్ని సందర్భాలలో భయపడవాల్సి వస్తున్నది. వ్యవస్థ మరియు దాని కారణభూతులు కారణం. దొంగే దొంగ దొంగ అన్న చంద్రంగా పరిస్థితి మారింది. దొంగ నటన కలవారు, దోపిడిదారులు, భూకబ్జాదారులు మరియు బకాసురులు,ఆర్థికంగా మోసాగించి లక్షల మందికి చెందవల్సిన డబ్బును అనుభవించేవారు దీనికి కారణం అని నా అభిప్రాయం. ఇట్టి లోపాలతో కూడిన వ్యవస్థలు మారాలి. భారతదేశంలో ఆర్థిక సమానత్వం రావాలి. పేదవారి కడుపు నిండాలి. వారికి అన్నీ విషయములలో న్యాయం జరగాలి, సమానత్వం రావాలి. ఈ దేశంలో రెండే కులాలు ఒకటి ఉన్నవారు, రెండు లేనివారు అని నా అభిప్రాయం. లేనివారు ఉన్నవారుగా మారాలి. ఆర్థిక వ్యవస్థ అందరికి అనుగుణముగా మారి సమన్యాయం చేయాలి.మన భారతదేశ మువ్వన్నెల జండా సదా ఎగిరి రెపరేపలాడుతుండాలి.ప్రపంచదేశాలతో చూస్తే మనదేశం గొప్పగా మరియు గర్వించే విధముగా ఉండాలి. పేదవారి గుండె ఆనందముతో నిండి విశ్రమించాలి. నేను కోరుకునే భారతావని అలా ఉండాలి.100 మందిలో 90 మంది తప్పుగా ఉంటే ఆ చెప్పే తప్పే ఒప్పుగా చిత్రీకరించి అదియే సరియైనదిగా వీరి తెలివితేటలతో తయారు చేస్తున్నారు. ఇది ఒక వింత,విచిత్రమైన దారుణమైన మరియు ఘోరమైన పరిస్థితి. ఈ పరిస్థితి వెంటనే మారనట్లైతే ఎన్నో ఉపద్రవాలకు తావు ఇస్తుంది మరియు దారి తీస్తుంది. ఇలాంటి వాతావరణమునా మనము కోరుకునేది, కోరుకుంటుంది. ఇది మన జీవన గమనానికి మరియు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. కావున విజ్ఞులారా! వివేకవంతులారా! యువత!మేలుకోనండి,తరలిరండి. నవభారత నిర్మాణం చేపడదాం. మన భారతమాతను రక్షించి, కాపాడుకుందాం.
Comments
Post a Comment