True disciple

మనకు ఒకతను గురువు. అతనంటే అభిమానం, ఇష్టం, మరియు ప్రేమ. కాల క్రమంలో ఎన్నిటికో లోబడి అతను ఒకటి లేదా కొన్ని తప్పులు చేస్తారు. కాని నేను ఏమంటాను అంటే నేను ఆ పాత పడ్దతిలో మాత్రమే అతనిని ఆరాధిస్తాను, గౌరవిస్తాను. ఎందుకనగా అతని కర్మ అతనికి సంబంధము. నేను అతనిని ఆ రోజు ప్రకారం freeze చేసుకున్నాను. అతని ప్రస్తుతము నాకు అప్రస్తుతము. రేపటి దినము నేను కూడా ఏమైనా తప్పు చేయవచ్చును. మనం మానవ మాత్రులం. తప్పు చేయలేమని చెప్పలేము. కాని తప్పు చేయకుండా మనసును గట్టిగా సంకల్పించుకోవచ్చును. అట్లా తప్పు చేయకుండా ఉండునట్లు ప్రయత్నము చేయవచ్చును. అట్టి నిగ్రహముతో కూడి ఉండి సాధన చేయవచ్చు. నా ప్రక్కకు ఉన్న మూర్ఖుడు ఇది వినడు.  ఒక మనిషికి ఎన్ని తెలువనియ్యండి, అతనికి ఏర్పడవలసిన base, foundation సరిగా లేనట్లయితే వ్యర్థము. సంస్కారం, వినయము,మర్యాద ఇది లేని చదువు కూడా వ్యర్థము, శోభించదు. మీరు double Phd చేశారు. దీనికి సహాయం చేసిన గురువు గారు ఎదురుపడినప్పుడు నమస్కారం సంస్కారం. అది లేనప్పుడు ఆ phd లు వ్యర్థము. మనము ఉన్నచోటికి మనకంటే పెద్దవారైన స్త్రీమూర్తి వచ్చినారు. మనం లేచి వారిని అక్కడ ఉన్న సీటులో కూర్చోండి అని చెప్పి వారు కూర్చున్న తరువాత మనం కూర్చోవడం సంస్కారం. ఒక్కోసారి సందర్భమును బట్టి మనసీటు వారికి ఇచ్చి కూర్చొమ్మనాలి. అది విజ్ఞత అనబడును. అతను సరియైన వ్యక్తికి తార్కాణముగా చరిత్రలో నిలుచును.

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

What are you learning really?