My sincere appeal& proposal to you.
ఒక విషయాన్ని స్పష్టముగా చెప్పాలంటే నేటి పరిస్థితుల్లో అలాంటి వాతావరణం లేనట్లుగా ఉంది నా భావన. మనం చెప్పేదానికి ఇంకేమైనా విరుద్ధమైన అర్థం తీస్తారేమో వక్రీకరిస్తారేమో, వివాదాస్పదం చేస్తారేమో అని. సుఖాన ఉన్న ప్రాణం, మనకెందుకులే, వేరేవారు చూసుకుంటారులే. మనకు ఎందుకు వచ్చిన గొడవ. బయట ఉన్న ఇబ్బందికర, భయానక పరిస్థితుల దృష్ట్యా సాటి మనిషి ఆలోచన తీరు ఈ విధంగా మారింది. దీనికి కారణం. రాజు గారి పాలు,నీళ్లు కథలాగా ఉంది. భావప్రకటన స్వాతంత్ర్యము మరుగున పడింది. ఏమైనా మాట్లాడితే ఏమవుతుందో అనే భయం. ఈ భయంతో ఎన్నిరోజులు జీవించడం. ఇట్టి ఈ భయం దోచుకునేవారికి, అవినీతిపరులకు వరంగా మారింది. ఛలోక్తులు చేయడం,చెప్పడం ఈ రోజు ఇబ్బందిగా మారింది. సౌకర్యము లేదు. సరదాగా తీసుకోగలగాలి. Sportive గా ఉండాలి. Sence of humour ఉండాలి. ఏదైనా సమాజంలో వ్యక్తపర్చేవిధముగా ఉండాలి. ఆ వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం ను ఏర్పరచాలి, ఏర్పడాలి. ఒకరిపై ఒకరు నిందలు మోపడం, బురద చల్లడం, అసూయ,ఈర్ష,అహం ఈ స్వభావాలు తగ్గించుకుంటే మంచిది అని నా అభిప్రాయం. అందరూ సహృదయ మనస్కులై ఒక మంచి వాతావరణానికి నాంది పలకాలి. ప్రశాంతమైన గాలి ఇళ్లల్లో మరియు వీధులలో వీచాలి. అందరూ కూడా ప్రతీ విషయాన్ని రాద్ధాంతము చేయవద్దు, లాగ వద్దు, చిన్న విషయాన్ని పెద్దది చేయవద్దు. ఒక మంచి Noble cause గురించి లేదా burning problem గురించి ఎంత పోరాడిన తప్పులేదు. అటువంటి ప్రజా ప్రయోజన విషయాల పట్ల మీ విలువైన సమయాన్ని వెచ్చించండి అని నా విన్నపము మీ అందరితో. దయచేసి ఈ భావనను, మాటను లోతుగా అర్థం చేసుకోని ఆచరణలో పెడతారని కాంక్షించే మీ రచయిత. విషయం పట్ల చర్చ 3 రకములు. చర్చ,జల్పము,వితండము. ఒక భారతదేశ ప్రధానమంత్రి లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి తన తెలివితక్కువ తనంతో మరియు మూర్ఖతతో ఎవ్వరిని consult చేయక, సలహాలు సూచనలు తీసుకోక మొండి వైఖరితో, నిరంకుశముగా తన పాలనలో భాగముగా ప్రజల హక్కులకు, సంక్షేమమునకు మరియు ఆర్ధికంగా ఏ ప్రయోజనము లేని, నష్టపర్చి ఇబ్బంది పెట్టే విధమైన చట్టమును లేదా కార్యక్రమును చేసెను. ప్రజలందరూ ప్రతిపక్షం వారు సభలో వాదించి, నిరసనలను తెలియజేసి మనకు న్యాయం చేస్తారు అని చూసే కంటే, మనద్వారా ఏర్పడిన ప్రభుత్వంకు గట్టిగా బుద్ధి చెప్పే విధముగా ఓటు వేసి గెలిపించినవారు సంఘటితముగా పోరాటం చేసి ప్రభత్వ వ్యతిరేక కార్యక్రమములను ఎండగట్టి అట్టి పాలనాదారులకు గట్టిగా బుద్ధి చెప్పి, వ్యవస్థలను, యంత్రాంగం ను సరిచేయవల్సిన బాధ్యత ఓటర్ మహాశయులు మరియు ప్రజల భుజస్కంధాలపై కలదు అని నా అభిప్రాయం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని నిరీక్షించకు, ఆశపడకు. మన సమస్యను, మన పనిని అందరం కలిసి సాధించుకుందాం. ఇదియే మీకై నా విన్నపము మరియు పిలుపు.
Comments
Post a Comment