Whether that day arrives or comes

నా ఆలోచన, మనసు ఎప్పుడు, ఎల్లప్పుడు తిండి దొరకక అలమటించేవారి గురించి మరియు అకస్మాత్తుగా, ఆయుష్షు కు ముందే అర్ధాయుర్దాయం తో చనిపోయేవారి గురించి , వారి జీవితాలలో వెలుగు వచ్చేంత వరకు వారి చుట్టూ తిరుగుతుంది. వారు ఏమి తప్పు చేశారు, ఏమి పాపం చేశారు.  శ్రద్ధ, జ్ఞానము,మోక్షము. తేజస్సు. ఇది జీవితం మంచి బాటలో నడవడానికి దోహదం చేస్తాయి. మనస్సు కు ఏదైనా కావాలనిపించింది. అది పొందడం తప్పు కాదు. కాని అది ఏ మార్గంలో పొందినావో ముఖ్యం, అది ధర్మానికి అనుగుణముగా ఉండాలి. అది చాలు. అధర్మంగా ఉండరాదు. ధర్మం అనే భీమా ఉంటే జీవితం బాగుండును, నీకు ధీమా ఉండును. మామూలు భీమా చేస్తే నీ జీవితం తరువాత నీకు కావాల్సిన వారికి ఉపయోగపడుతుంది.  రవి కాంచని చోటు కవి గాంచును. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారు అని మీకు తెలుసు. అర్ధరాత్రి మహిళ ఒంటరిగా తిరుగ కల్గిన రోజు ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని చెప్పారు. ఈ రోజటికి అట్టి పరిస్థితి లేదు. దీని వైఫల్యానికి ఎవరు కారణం మీరే చెప్పాలి. ఈ రోజు ఇంకా ఎన్ని ఈ విధముగా సమస్యలు ఉన్నాయి. ఒక్కసారి చూడండి. నడి రోడ్డుపై 2000 రూపాయల కట్ట 1లక్ష రూపాయలు పడి పోయినప్పుడు, ఎన్నిరోజులయినా ఆ పోగొట్టుకున్న వ్యక్తి తిరిగి వచ్చి తీసుకునే వరకు అలాగే ఉండాలి. మన అందరి ప్రవర్తన అంత ఉన్నతముగా ఉండాలి.

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

What are you learning really?