Money management economics
Money management economics. ధనం మూలం ఇదం జగత్తు అంటారు. ప్రపంచములో అన్నిటికి డబ్బు ప్రధానం. కావున ఇట్టి డబ్బు పట్ల సరిగా వ్యవహరించడము మన కర్తవ్యము మరియు బాధ్యత. ఉద్యోగము, డబ్బు పొందడం కన్నా వానిని కాపాడుకోవడం చాలా ముఖ్యమైనదిగా చెప్పుతారు. కావున సదా వీని విషయంలో అప్రమత్తతో వ్యవహరించాలి. మనకు చాలా తెలుసు అని అనుకోరాదు, నిరంతరము ఎంత తెలుసుకుంటూ ఉన్నప్పటికి తక్కువే అవుతుంది. పూలు అమ్మిన చోట ఇంకేమో అమ్మగలమా అని సామెత. ఎదుటి వారి అనుభవం నుండి మనం నేర్చుకోవాలి, దానికి అనుగుణముగా నడుచుకోవాలి. ఒకసారి జరిగిన పొరపాటు తిరిగి జరగకుండా, పునరావృతం కాకుండా చూసుకోవాలి. జీవిత గమనంలో ఎన్ని విషయాలు నిరంతరం నేర్చుకున్నా అవి తక్కువే, ఇంకా చాలా నేర్చుకోవాల్సినవి ఉంటాయి. ఇది నిరంతర ప్రక్రియ. అంతము మన జీవితం సమాప్తి అయినప్పుడు మాత్రమే. మన జీవిత భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. దానిని అందముగా, సౌకర్యవంతముగా మరియు ఆదర్శవంతముగా తీర్చుకుందాము.చెయ్యవలసిన మంచి చెయ్యకపోతే చెడు గా మారుతుంది, చెడు చూడవల్సివస్తుంది. అందుకే ఒక ప్లస్ రెండో ప్లస్ కు దారి తీస్తుంది కాని ఒక మైనస్ ఎన్ని మైనస్ లకైనా దారి తీయును. ఆ ఏర్పడే రెండు ప్లస్ లను కూడా తుడిచివేయును. మన జీవితమును మంచిగా నడిపించుకోవడం, చూసుకోవడం మనచేతిలోనే ఉంది, ఎవ్వరి చేతిలో లేదు. ఎవ్వరో వస్తారని ఏదో చేస్తారని ఆశ పడవద్దు, అట్టి భ్రమలో ఉండవద్దు. కావున ప్రతి ఒక్కరు అనుక్షణం అప్రమత్తతతో, జాగరూకత తో వ్యవహరించగలరు. మనం ఒక విషయం పట్ల betterment అనుకున్నప్పుడు ఇంకా కూడా betterment ఉంటుంది. అది అనంతం, దాని ప్రయాణం, ప్రయత్నము ఆనంతము అని నా అభిప్రాయం. తినే కంచం, పడుకునే మంచం, ఆలోచించే మెదడు,బుర్ర ను సరిగా చూసుకోవాలి. బూజు పట్టకుండా చూస్తూ, ఏమైనా చెత్త చేరినట్లయితే ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. మంచము ఎంత ఉంటే కాలు అంతవరకే జాపాలి అంటారు మన పెద్దవారు. దుబారా ఖర్చు చేయవద్దు. ఇదియే కాపాడుకుంటే indirect income మరియు saving అవుతుంది. ఇది మన కష్ట సమయాలలో ఉపయోగపడుతుంది, మరియు మన శ్రమను,బడలికను తగ్గించును. ఇదియే మనకు శ్రీరామ రక్ష అని నా అభిప్రాయం. మనం ఉండే చోటును, ప్రక్కకు ఉన్న పరిసరాలను పరిశుభ్రముగా ఉంచుకోవాలి అంటారు. అందరూ ఇలా చేస్తే, ఇలా ఆలోచిస్తే సరిపోతుంది. మనదేశ అభివృద్ధికి బాటలు వేసిన వారము అవుతాము.
Comments
Post a Comment