Experiences while writing the Book
నా పుస్తక రచన అనుభవాలు. ఎన్నో ఎన్నెన్నో విచిత్ర మరపురాని సంఘటనలు జరిగినవి. దేవుని కృపతో ముందుకు వెళ్లి సాధించాను. అతనే నడిపించింది. నాకు స్ఫూర్తి కావ్యకంఠ గణపతి మహాముని. 108 అమ్మవారి పద్యాలు రచించారు. శ్రీ ప్రవచన వాచస్పతి డా// ఛాగంటి కోటేశ్వరరావు గారికి వారి ప్రవచనాలు నన్ను చేరిన కారణముగా వారికి నమస్సులతో కూడిన కృతజ్ఞతలు, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి గారు, శ్రీ గరికపాటి నరసింహారావు గార్లకు కృతజ్ఞతలు. సరస్వతి అమ్మవారి కృప ఎలా ఉంటుంది. నేను చదువుత లేను కదా అని నాకు నేను వేసుకున్న ప్రశ్న. అమ్మవారు వీణా పుస్తక దారిణి. నేను ఒక పుస్తకము వ్రాయునట్లు చేయుచున్నది ఈ అమ్మవారు కాదా! ఇది అమ్మవారి కృప మరియు కరుణ కాదా. ముమ్మాటికీ అమ్మవారి భిక్ష. ఎవరైనా అత్యంత భక్తి, విశ్వాసములతో, అత్యంత నమ్మకంతో ( నీ పైన నీకు నమ్మకం ఉండాలి అది సన్నగిల్లుతున్న రోజు నువ్వు మరణంనకు దగ్గర అవుతున్నట్లు) ఈ పని నేను చేస్తాను అని త్రికరణ శుద్ధిగా తలచినట్లైతే దేవుడు కూడా నీకు అండగా ఉండి నీ పనికి ముందు ఈ లోకం నుండి తీసుకొని వెళ్ళడు, భయము వ్యక్తము చేస్తారు, అట్టి పని పూర్తి కావడానికి పంచభూతములు సహాయం చేస్తాయి. జీవుడు తుదకు పంచ భూతములలోనే కదా కలవడం. ఆత్మ దేవుడు దీని నుండి వేరు చేయబడ్డ శరీరమే దయ్యం, భూతం అని నా అభిప్రాయం. దేవుడు అనగా నీలోని మంచి, దెయ్యం అనగా నీలోని చెడు. రెండు నీలోనే ఉన్నాయి కదా! అనగా దేవుడు నీలోనే ఉన్నాడు. కాని నువ్వు చూడడం లేదు. నీకు కనిపిస్తలేడు. నువ్వు ప్రయత్నముతో సాధన చేయుము. నీకు సఫలం చేకూరుతుంది. అన్నమయ్య మహానుభావులకు దేవుడు ఈ విధముగా సాక్షాత్కారం అయ్యి మోక్షం ప్రాప్తి కల్గినది.(త్రికరణ శుద్ధి అనగా మనసా,వాచా,కర్మణా మూడు విధములు. పెళ్లిరోజు ఆ విధముగా ప్రమాణం చేస్తాం, కళ్ళు మూసుకున్నా తెరచినా అదే తలంపు గుర్తుకు రావడం మరియు కన్పించడం, స్థిత ప్రజ్ఞత మరియు సాధన అవసరం.) ఇతరులను జేయించడం కంటే తనను తాను జేయించడం కష్టం. ఎందుకనగా నువ్వు క్రితం చేసిన తప్పులు ఎదుటి వారికి తెలువవు కాని నీది నీకు తెలుసు. ఒక మనిషి తనను తాను మోసం చేసుకోరాదు. నీవు తప్పు చేసినట్లయితే నీ ఆత్మ అనే దేవుని ముందు నువ్వు తప్పు ఒప్పుకో. లేనిచో నీవు ఈ జన్మలో మనిషివి కాదు. మరియొక మనిషి జన్మ వచ్చును. కష్టాల కడలిలో ప్రయాణం చేయుదువు. నేర్చుకోవడం ఒక వరం అది ఆనంతము. విజ్ఞానము ఆనంతము.
Comments
Post a Comment