Voter is God
ఓటు హక్కు వినియోగింపజేసి ఆ తరువాత అతని విలువ, ప్రాధాన్యం తగ్గించి పబ్బం గడుపుకునే విష వ్యవస్థ, సంస్కృతి నడుస్తున్నది, అదియే దాపురించింది. 5 సంవత్సరాలు పాలించే నాయకుడు ప్రతీరోజు ఓటరును తలచుకుంటూ బ్రతికే విధముగా వ్యవస్థను బలోపితం చేయాలి. తరువాత ఈ 5 సంవత్సరములలో ఏ రోజాయినా పదవి పోవునట్లు జాగ్రత్తగా ఉండే విధముగా వారికి ఆ భీతి కలుగునట్లు చట్ట సవరణలు చేయబడాలి. అలాంటి కట్టుదిట్టమైన ప్రజల వ్యవస్థ రావాలి. అందరూ ప్రజా సంక్షేమం అంటూనే ప్రజలకు గుండు చేయించి కుచ్చు టోపీ పెడుతున్నారు. ప్రజా సంక్షేమంలో ఫలాలు ప్రతీ ఇంటికి ప్రతీ పౌరనికి అందేవిధముగా ఉండాలి మరియు వాటిని తయారు చేసినప్పుడు అది సమాజంలోని ఏ కొందరికో కాకుండా అన్నీ వర్గాలవారు లబ్ది పొందే విధముగా కసరత్తు జరపాలి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం నిలుస్తుంది. గెలిచిన నాయకుడు ఓటు వేసిన ఓటరుకు appointment ఇవ్వడం లేదు. ఇంతటి విషమ పరిస్థితి సమాజంలో ఏర్పడింది. కావున ఓటరు మహాశయులారా ఎన్నోవిధాలుగా మోసపోయినా, ఇకనైనా మేల్కొనండి. లేనట్లయితే మన శరీరంలో ఏ అవయవాలు ఉపయోగపడతాయో అవి అమ్ముకునే పరిస్థితి దాపురిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఓటర్ దేవునితో సమానం.
Comments
Post a Comment