What education you require or you learn?

నువ్వు చదివేది వేరు, ఎందుకు చదువు తున్నావో నీకు నీవే ప్రశ్న వేసుకోవాలి. దాని వలన నీకు కలిగే ఉపయోగం ముందు తెలుసుకోవాలి, దానిని ముందు చదవాలి. ఈ వ్యవస్థలోని లోపాలు ఎలా ఉన్నాయంటే మనలను ఉన్నచోటనే వెర్రి వాడిని చేసి, వారు దొడ్డిదారిన వారికి కావలసినది తెచ్చుకునే ఏర్పాటు చేసుకున్న వారిలా ఉంటుంది. యువత ముఖ్యముగా నిద్రమత్తులో ఉన్నారు. వారు ఎటు వెళ్ళాలి, వారికి ఏమి కావాలి వారికి తెలువదు. ఒక గందరగోళం పరిస్థితిలో ఉన్నారు. దీని నుండి బయటికి రావాలి. నిద్రావస్థ నుండి లేచి మేల్కొనాలి. తెలివి తెచ్చుకోవాలి. దేశ భవిష్యత్తు వీరి భుజస్కందములపై ఉంది కావున దానికై అహర్నిశలు శ్రమించాలి. దేశ కీర్తిని నలువైపులా వీరి విజ్ఞానముతో విస్తరింపజేయాలి. ఏమి చదువాలే, ఎలా చదువాలి, దాని తాత్పర్యం ఏమిటి, అది మనకు ఏ విధముగా ప్రయోజనము కల్గిస్తుంది. ఇది తెలుసుకోవాలి. మూస ధోరణి అవలంభించవద్దు. ఇది మనకు భవిష్యత్తులో కనీసం తిండి పెడుతుందా అని ఇంగితముతో ఆలోచించవలెను అని నా అభిప్రాయము. విజ్ఞాన సముపార్జన తో పాటు అది మన జీవన భృతికి తప్పకుండా ఉపయోగపడాలి. సమాజంలో అట్టి చదువు ఏ విధముగా ప్రయోజనకారి అని తెలుసుకోవాలి. వీలైతే అనుభవపూర్వకంగా వెళ్లి చూడాలి.  అది ఎందుకు, ఎప్పుడు ఉపయోగపడుతుందో నీకు తెలువదు, ఆ చెప్పేవారికి కూడా తెలియదు. ఇది మన దౌర్భాగ్యం. మన విద్యా వ్యవస్థ పరిస్థితి. దీని మార్పుకై సమూల మార్పులతో కూడిన ప్రక్షాళన గావించబడి ప్రజారంజక విద్యా వ్యవస్థ తయారు కాబడి ఆచరణ లోనికి రావాలి. దానికై అడుగులు ముందుకు పడాలి. యువత పూనుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి లోకసభలో బిల్ పాస్ అయ్యేవిధముగా చూడాలి. ఎందుకనగా దీని ద్వారా మొదటగా మరియు ఎక్కువగా లాభం పొందేవారు యువతనే కాబట్టి.

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

What are you learning really?