Deep Sorrow (శోకము)

శోకము, దుఃఖము.ఇది శత్రువు తో సమానం.  దీనిని దరి చేరనియ్యరాదు. దగ్గరికి రానివ్వద్దు. దీనికి  వశుడైనవాడు సర్వ నాశనం చెందుతాడు. పతనం చెందుతాడు. ఎంతటి ఘోర కృత్యమైన చేయుటకు ఒడిగడతాడు. నీచ, నికృష్టమైన కార్యాలు చేస్తాడు. కోపానికి వశుడై విచక్షణ కోల్పోయి పాప కార్యాలకు పూనుకుంటాడు. ముందు, వెనుక ఆలోచించడు, చూడడు. మహాపాపాలు వస్తాయి. ఎంత తప్పు అయినా చేస్తాడు. చంపేస్తాను అని లేదా చచ్చిపోతాను అని కోపానికి వశుడై అంటాడు. పాపి చిరాయువు. శరీరం సుఖ, దుఃఖములను అనుభవించుటకు ఉపకరణం. శరీరం తనంతట తానే నశించిపోవాలి లేదా క్షయం కావాలి. విస్తరాకు వలే శరీరం.దానిని జాగ్రత్తగా పుల్లలతో కుట్టి, శుభ్రము చేసి భుజించిన పిమ్మట బయట పడవేస్తాము. అదేవిధముగా మన శరీరం. ఆత్మ హత్య మహాపాపం. అందుకే తన కోపమె తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దాయచుట్టంబౌ. తన సంతోషమే స్వర్గం. అని మహానుభావులు సుమతి శతకంలో ఎంతో అద్భుతముగా సరళమైన పదాలతో చక్కగా వివరించారు కదా!వైరాగ్యానికి నిదర్శనంగా  గాలిని/వాయువును చెప్తారు. మల్లెపూలు,చచ్చిన కళేబరము రెండింటి నుండి ప్రసరించును, ప్రయాణించును. వాయువుకు ఎట్టి తేడా లేదు. అన్నిటి యందు సమానముగా ప్రవర్తించును. అబ్బ మంచి గాలి, కంపు గాలి అని అంటాము. వాయు దేవుడు ఇవి ఏమి పట్టించుకోడు. తప్పుచేసిన పనులకు పశ్చత్తాప పడడం, శోకించడం మంచిదే. తదుపరి స్థితప్రజ్ఞతతో మళ్లీ సామాన్య లేదా మామూలు దైనందిన జీవితంలోకి రావాలి.

Comments

Post a Comment

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

What are you learning really?